Fastag Security Deposit : మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ క్లోజ్ అయిందా? సెక్యూరిటీ డిపాజిట్‌ని ఆన్‌లైన్‌లో ఇలా తిరిగి పొందొచ్చు!

Fastag Security Deposit : ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత ముందుగా సెక్యూరిటీ డిపాజిట్‌లను ఎలా తిరిగి పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Fastag Security Deposit : మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ క్లోజ్ అయిందా? సెక్యూరిటీ డిపాజిట్‌ని ఆన్‌లైన్‌లో ఇలా తిరిగి పొందొచ్చు!

Tech Tips in Telugu : How to get your Fastag security deposit back online

Updated On : March 2, 2024 / 5:09 PM IST

Fastag Security Deposit : ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్ అనేది భారత్‌‌లో టోల్ చెల్లింపులను విప్లవాత్మకంగా మార్చింది. హైవేలపై వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు టోల్‌లను వేగంగా చెల్లించేలా ఈ ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ సెటప్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. పూర్తిగా ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత వారి సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి పొందే విషయంలో వినియోగదారులు తరచుగా గందరగోళాన్ని ఎదుర్కొంటారు. మీరు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ క్రియేట్ చేసిన ప్రతిసారీ, బ్యాంకులు, ఇతర అధీకృత సంస్థలతో సహా జారీ చేసేవారు, రుసుముతో పాటు వన్-టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : FASTag Users Alert : ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు అలర్ట్.. కేవైసీ గడువు మార్చి 31 వరకు పొడిగింపు.. ఇలా సింపుల్‌గా అప్‌డేట్ చేసుకోండి!

ఈ డిపాజిట్ టోల్ లావాదేవీల సమయంలో తక్కువ బ్యాలెన్స్‌ ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. అయితే, మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని పూర్తిగా తిరిగి పొందవచ్చు. ఇందుకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన పనిలేదు. సాధారణంగా వాహనం కేటగిరీ బట్టి చెల్లించాల్సిన మొత్తం రూ. 100 నుంచి రూ. 250 మారుతూ ఉంటుంది. మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ ఎలా డియాక్టివేట్ చేయాలి.. సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్‌ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ డీయాక్టివేట్ చేయండి :
మీ ఫాస్ట్ ట్యాగ్ జారీచేసేవారి కస్టమర్ కేర్ సర్వీస్‌ను సంప్రదించండి. సాధారణంగా జారీ చేసేవారి వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా ఫిజికల్ స్టేట్‌మెంట్‌లలో సులభంగా కస్టమర్ కేర్ నంబర్‌లు అందుబాటులో ఉంటాయి. మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ డియాక్టివేట్ చేయాలనుకున్నట్టు కస్టమర్ కేర్ ప్రతినిధికి తెలియజేయండి. నిర్దిష్ట ప్రక్రియ ద్వారా అకౌంట్ డియాక్టివేషన్ అయ్యేలా చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడం అనేది జారీ చేసేవారిపై ఆధారపడి ఉంటుంది. డియాక్టివేషన్‌లో ఆన్‌లైన్ పోర్టల్‌లు, మొబైల్ యాప్‌లు లేదా సంబంధిత శాఖకు వెళ్లాల్సి రావచ్చు.

ఏదైనా అకౌంట్లలో తీసుకున్న బకాయిలు ఉంటే వెంటనే క్లియర్ చేయండి. మీ సెక్యూరిటీ డిపాజిట్‌ని స్వీకరించడానికి ముందు.. మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లలో ఎలాంటి బకాయిలు ఉండకూడదు. ఇందులో ఏవైనా చెల్లించని టోల్‌లు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు లేదా పెనాల్టీలు ఉంటాయి. మీరు జారీ చేసినవారి ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ యాప్ లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించడం ద్వారా బాకీ ఉన్న బ్యాలెన్స్‌ను క్లియర్ చేయవచ్చు.

సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్‌ కోసం రిక్వెస్ట్ చేయండి :
మీ అకౌంట్ డీయాక్టివేట్ అయిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అంతకంటే ముందుగానే బకాయిలను పూర్తిచేసి ఉండాలి. మీకు ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన కంపెనీ బట్టి ప్రక్రియ మారవచ్చు. కొంతమంది జారీచేసేవారు అకౌంట్ క్లోజ్ చేసిన వెంటనే ఆటోమాటిక్‌గా డిపాజిట్ రీఫండ్ చేస్తారు. మరికొందరికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం పడొచ్చు.

మీకు జారీ చేసే బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే.. రీఫండ్ ఎలక్ట్రానిక్‌గా నేరుగా మీ లింక్ చేసిన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అయితే, బ్యాంక్‌యేతర ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసేవారికి లేదా జారీ చేసే బ్యాంక్‌లో అకౌంటు లేని వ్యక్తులకు, డిమాండ్ డ్రాఫ్ట్ జారీ అవుతుంది. తద్వారా రిజిస్టర్డ్ అడ్రస్‌కు పంపుతారు. బ్యాంకులు రీఫండ్‌ను ప్రాసెస్ చేయడానికి లేదా డిమాండ్ డ్రాఫ్ట్‌ను పంపడానికి కొంత సమయం పట్టవచ్చు. సాధారణంగా జారీ చేసేవారిని బట్టి 3 రోజుల నుంచి 10 రోజుల వరకు పడుతుంది.

మీ ఫాస్ట్‌ట్యాగ్ పోయినా లేదా పాడైపోయినా వెంటనే జారీ చేసిన వారికి తెలియజేయండి. అలాంటి కేసులను త్వరితగతిన నిర్వహించడానికి నిర్దిష్ట విధానాలను పాటించాల్సి ఉంటుంది. అయితే, సెక్యూరిటీడిపాజిట్ రీఫండ్ ప్రక్రియపై ప్రభావం పడుతుంది. మీ ఫాస్ట్‌ట్యాగ్ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ పొందడం అనేది చాలా సులభమైన ప్రక్రియ. అయితే, మీ అకౌంట్ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి. రీఫండ్ పొందే నాటికి అకౌంట్లో ఎలాంటి బకాయిలు ఉండకూడదని గమనించాలి.

Read Also : Paytm Payments Bank : మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘన.. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రూ.5.49 కోట్ల జరిమానా..!