FASTag Users Alert : ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు అలర్ట్.. కేవైసీ గడువు మార్చి 31 వరకు పొడిగింపు.. ఇలా సింపుల్‌గా అప్‌డేట్ చేసుకోండి!

FASTag Users Alert : ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు అలర్ట్.. ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ కేవైసీ అప్‌డేట్ గడువు తేదీని మళ్లీ పొడిగించారు. వచ్చే మార్చి 31 వరకు ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేసుకోవచ్చు.

FASTag Users Alert : ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు అలర్ట్.. కేవైసీ గడువు మార్చి 31 వరకు పొడిగింపు.. ఇలా సింపుల్‌గా అప్‌డేట్ చేసుకోండి!

FASTag Users Alert : Deadline To Update KYC Extended

FASTag Users Alert : ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ‘వన్ వెహికల్, వన్ ఫాస్ట్‌ట్యాగ్’ గడువు తేదీని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మళ్లీ పొడిగించింది. పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్‌ట్యాగ్ యూజర్‌లకు ఇప్పుడు నో యువర్-కస్టమర్ (KYC) అప్‌డేట్ చేసుకోవడానికి మరో నెల సమయం ఉంది. వాస్తవానికి ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయడానికి ఫిబ్రవరి 29 వరకు గడువు తేదీ ఉండగా.. తాజాగా గడువు తేదీని మార్చి 31, 2024 వరకు పొడిగించింది.

Read Also : Paytm FASTag FAQs : పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు అలర్ట్.. మార్చి 15 లోపు ఈ బ్యాంకులకు మారిపోండి.. లేదంటే అంతే సంగతులు!

సవరించిన గడువు మార్చి 31 నాటికి కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడంలో విఫలమైతే ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది. కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడానికి వాహన యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ లేదా ఓటర్ ఐడీ కార్డ్ వంటి గుర్తింపు రుజువులతో సహా నిర్దిష్ట డాక్యుమెంట్లను సమర్పించాలి.

అంతేకాదు.. ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు వంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం. బ్యాంక్-లింక్ చేసిన అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయడం, ‘మై ప్రొఫైల్’ సెక్షన్ కు వెళ్లడం, కేవైసీ సబ్-సెక్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా కేవైసీని అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ సమయంలో అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి? :

  • మీరు ఫాస్ట్‌ట్యాగ్ యూజర్ అయితే మీ కేవైసీ వివరాలను ఇంకా అప్‌డేట్ చేయకపోతే.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి.
  • ముందుగా ఫాస్ట్ ట్యాగ్ అధికారిక వెబ్‌సైట్‌ (fastag.ihmcl.com)ను విజిట్ చేయండి.
  • అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి.
  • మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి.
  • హోమ్‌పేజీలో, ‘My Profile’ సెక్షన్‌లో ‘KYC’ ట్యాబ్‌ను ఎంచుకోండి.
  • అవసరమైన మీ వివరాలను ఎంటర్ చేయండి. ఆపై వెరిఫై చేయండి.
  • ఆ తర్వాత, ‘Submit ఆప్షన్ ట్యాప్ చేయండి.

Read Also : FASTag KYC Deadline : మీ ఫాస్ట్‌ ట్యాగ్ కేవైసీ అప్‌డేట్ చేశారా? ఈ నెల 29 వరకు ఛాన్స్.. ఎలా అప్‌డేట్ చేయాలి? స్టేటస్ ఇలా తెలుసుకోండి!