Tech Tips in Telugu : మీ ఐఫోన్ పోయిందా? డోంట్ వర్రీ.. ఈ ఎమర్జెన్సీ షార్ట్‌కట్‌‌తో క్షణాల్లో ట్రాక్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Tech Tips in Telugu : మీ పోగొట్టుకున్న ఐఫోన్ కేవలం టెక్స్ట్ ద్వారా వెంటనే కనిపెట్టేయొచ్చు. లొకేషన్, సౌండ్, వార్నింగ్ ఆటోమాటిక్‌గా ఆన్ చేయొచ్చు. ఈ కస్టమ్ ఐఫోన్ షార్ట్‌కట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

Lost Your iPhone

Tech Tips in Telugu : మీ ఐఫోన్ పోయిందా? అయితే, డోంట్ వర్రీ.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ ఐఫోన్ ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. లక్షలు పోసి కొన్న ఐఫోన్ పోయిందంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది.

ఖరీదైన ఫోన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఏదో పనిలో పడి ఐఫోన్ ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటారు. లేదంటే ఎవరైనా దొంగిలించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఐఫోన్ ఎలా తిరిగి తెచ్చుకోవాలో చాలామందికి అవగాహన ఉండదు.

Read Also : LIC Scheme : LICలో అద్భుతమైన స్కీమ్.. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు.. 40ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ తీసుకోవచ్చు..!

మీరు తొందరలో ఐఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే కంగారు పడక్కర్లేదు. అయితే, ఇదంతా మీ ఐఫోన్ దగ్గర ఉన్నప్పుడు చేయాల్సిన పని. ఐఫోన్ పోయిన తర్వాత చేయడం కష్టం. ప్రతి ఐఫోన్ యూజర్ ముందుగా తమ ఐఫోన్‌లో ఈ ఎమర్జెన్సీ షార్ట్‌కట్ సెట్ చేసుకుని ఉండాలి.

మీ ఐఫోన్‌లో కస్టమ్ షార్ట్‌కట్‌ క్రియేట్ చేయడం ద్వారా మీ ఐఫోన్ లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. మీరు ఎంచుకున్న వ్యక్తి ఐఫోన్ నుంచి సులభంగా ఈ ప్రాసెస్ చేయొచ్చు. అది కూడా కేవలం ఒక సాధారణ టెక్స్ట్‌ మెసేజ్‌తో ట్రాక్ చేయొచ్చు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఎమర్జెన్సీ షార్ట్‌కట్ ఎలా సెటప్ చేయాలి? : 

  • మీ iPhoneలో Shortcuts యాప్ ఓపెన్ చేయాలి.
  • ఇప్పుడు ‘Create Shortcut’పై ట్యాప్ చేయండి.
  • మీకు అర్థమయ్యేలా “Find My Phone” లేదా “Emergency Locator” అనే ఏదైనా పేరు టైప్ చేయండి.
  • ఇప్పుడు, బ్లూటూత్ ఆన్ చేయండి.
  • Wi-Fi కూడా ON చేయండి.
  • మీ వాల్యూమ్‌ను సెట్ చేయండి. కానీ, మీ ఫోన్ బిగ్గరగా రింగ్ అయ్యేలా మీడియా నుంచి రింగ్‌టోన్‌కు మార్చడం మర్చిపోవద్దు.
  • కరెంట్ లోకేషన్ పొందండి.
  • మెసేజ్ పంపండి : మీరు నమ్మే వ్యక్తి కాంటాక్టు ఎంచుకుని, “Hey, I’ve lost my phone. Here’s where it is!” అని టైప్ చేయండి.
  • అన్నీ సెట్ చేసిన తర్వాత “Show When Run” టోగుల్‌ను ఆఫ్ చేయండి.

ఆటోమేషన్‌ ఎలా సెటప్ చేయాలంటే? :

  • షార్ట్‌కట్స్ యాప్‌లోని ఆటోమేషన్ ట్యాబ్‌కి వెళ్లి ‘Create Personal Automation’ ట్యాప్ చేయండి.
  • ఏదైనా మెసేజ్ ఎంచుకోండి. మీరు మెసేజ్ పంపే కాంటాక్ట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • ట్రిగ్గర్ చేసే పదాన్ని టైప్ చేయండి.. “మీరు ఎక్కడ ఉన్నారు?” మాదిరిగా ఏదైనా ఉండొచ్చు.
  • Nexe ఆప్షన్ తర్వాత Run Immediately టర్న్ ఆన్ చేయండి.
  • ఆపై Done ట్యాప్ చేయండి.

అంతే.. ఇప్పుడు, మీరు ఎంచుకున్న వ్యక్తి ఆ నిర్దిష్ట పదాన్ని మీకు టెక్స్ట్ చేసినప్పుడల్లా, మీ ఐఫోన్ రెస్పాండ్ అవుతుంది. అవసరమైన వాటిని ఆన్ చేయండి. రింగ్‌టోన్‌ను ప్లే చేయండి. లైవ్ లొకేషన్‌ ఆన్ అవుతుంది.

Read Also : VIVO 5G Smartphones : వివో లవర్స్‌కు కోసం రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

మీరు నిజంగా మీ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా సోఫా కింద పడిపోయినా ఈ చిన్న షార్ట్‌కట్ మీకు అద్భుతంగా సాయపడుతుంది. ఓసారి మీరు ఈ ట్రిక్ ట్రై చేయండి. ఈ సెటప్ చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ, ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో ఇదే మిమ్మల్ని కాపాడవచ్చు.