Tecno Megapad 10 Launch : భారీ బ్యాటరీతో హెచ్‌డీ ప్లస్ స్ర్కీన్‌తో టెక్నో మెగాప్యాడ్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Tecno Megapad 10 Launch : టెక్నో 18డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టుతో మెగాప్యాడ్ 10లో 7,000mAh బ్యాటరీని అందిస్తుంది. బ్యాటరీ 2.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 8 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.

Tecno Megapad 10 With HD Plus Screen

Tecno Megapad 10 Launch : కొత్త ట్యాబ్ కొనేందుకు చూస్తున్నారా? గ్లోబల్ మార్కెట్లోకి టెక్నో మెగాప్యాడ్ 10 మోడల్ వచ్చేసింది. ఈ టాబ్లెట్‌లో మీడియాటెక్ హెలియో జీ80 చిప్‌సెట్ 4జీబీ ర్యామ్ 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. 10.1-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే 13ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరా, 18డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీతో వస్తుంది. టాబ్లెట్ స్ప్లిట్-స్క్రీన్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. అయితే, టెక్నో మెగాప్యాడ్ ధర, లభ్యత వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

టెక్నో మెగాప్యాడ్ 10 ఫీచర్లు :
టెక్నో మెగాప్యాడ్ 10 మోడల్ 10.1 -అంగుళాల హెచ్‌డీ+ (800 x 1,280 పిక్సెల్‌లు) స్క్రీన్‌ను 450నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయి, 80 శాతం స్క్రీన్-టు-బాడీ-రేషియో కలిగి ఉంది. డిస్‌ప్లే ఐ కంఫర్ట్ మోడ్‌తో పాటు డార్క్ మోడ్‌ను అందిస్తుంది. ఈ టాబ్లెట్ 4జీబీ ర్యామ్‌తో మీడియాటెక్ హెలియో జీ80 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అధికారిక జాబితా ప్రకారం.. 128జీబీ, 256జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ ఆప్షన్లతో టాబ్లెట్‌ వస్తుంది. పైన ఆండ్రాయిడ్ 14-ఆధారిత (HiOS) స్కిన్‌తో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. టెక్నో మెగాప్యాడ్ 10 ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటు 13ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. టాబ్లెట్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్ యూనిట్లు కూడా ఉన్నాయి. టాబ్లెట్ స్ప్లిట్ స్క్రీన్, షేప్‌ఫ్లెక్స్ స్నిప్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. రెండోది స్క్రీన్‌షాట్‌లను సర్కిల్‌లు, మరిన్ని వంటి అనేక షేపులలో కత్తిరించేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

టెక్నో 18డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టుతో మెగాప్యాడ్ 10లో 7,000mAh బ్యాటరీని అందిస్తుంది. బ్యాటరీ 2.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 8 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ ఎల్‌టీఈ డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అధికారిక జాబితా ప్రకారం.. టెక్నో మెగాప్యాడ్ 10లో షాంపైన్ గోల్డ్ స్పేస్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. టాబ్లెట్ పరిమాణం 240.7 x 159.5 x 7.35ఎమ్ఎమ్, బరువు 447గ్రాముల బరువు ఉంటుంది. టాబ్లెట్ ధర, లభ్యత వివరాలు త్వరలో ప్రకటించనుంది.

Read Also : Redmi Note 14 Series : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి నోట్ 14 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు ఉండొచ్చుంటే?