టెక్నో తాజాగా స్పార్క్ గో 2ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరకు మంచి ఫీచర్లు ఉన్న ఫోన్‌ను కొనాలని అనుకునే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ బాగా నచ్చుతుంది. ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
ధర, కలర్స్, పనితీరు
స్పార్క్ గో 2 ధర రూ.6,999. 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌లో లభ్యమవుతోంది. ఇంక్ బ్లాక్, టైటానియం గ్రే, వేల్ వైట్, టర్కాయిజ్ గ్రీన్ కలర్స్‌లో వచ్చింది.
స్పార్క్ గో 2లో 6.67 అంగుళాల LCD స్క్రీన్, HD+ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. రూ.6,999 ధరకు ఇంత అధిక రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్ అరుదు. యూనిసాక్ T7250 చిప్‌తో పనిచేస్తుంది. 4GB RAM, అదనంగా 4GB వర్చువల్ RAM, microSD ద్వారా 64GB స్టోరేజ్ పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 సాఫ్ట్‌వేర్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ డ్యుయల్ LED ఫ్లాష్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ముందు భాగంలో డ్యుయల్ LED ఫ్లాష్ ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, రెండు స్టీరియో స్పీకర్లు, డ్యుయల్ DTS ఆడియో ట్యూనింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: నా ఇన్‌టెన్షన్ అదికాదు.. అందుకే నేను అలా అన్నాను..: ఆ కామెంట్స్‌పై దిల్ రాజు క్లారిటీ
బ్యాటరీ, కనెక్టివిటీ
ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ 15W టైప్ C ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. డ్యుయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.2, Wi-Fi (2.4GHz), IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
మంచి స్క్రీన్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, స్మార్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో స్పార్క్ గో 2 చాలా బాగుంది. స్టూడెంట్స్, కొత్తగా ఫోన్ కొనేవారు, తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ ఉన్న ఫోన్ కావాలనుకునే వారికి ఇది నచ్చుతుంది.