Tesla Adds Hindi To Its Interface
Tesla adds Hindi to its interface : ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి త్వరలో ఎలక్ట్రిక్ కార్లతో ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ దృష్ట్యా టెస్లా ఈవీ వెహికల్స్ మోడ్రాన్ టెక్నాలజీతో భారతీయ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రముఖ ఈవీ వెహికల్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత్‌లో టెస్లా కార్యకలాపాల్ని పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాబోయే టెస్లా ఈవీ కార్లలో యూజర్ ఇంటర్ ఫేస్ UI (infotainment)ను అనేక భాషల్లో అందిస్తోంది. అందులో తాజాగా హిందీ ల్వాంగేజీని కూడా చేర్చింది టెస్లా. హిందీ మాట్లాడే టెస్లా కస్టమర్లు తమ ఈవీ వాహనాన్ని సొంత భాషలో కమాండ్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి లాంగ్వేజ్ అప్ డేట్స్ స్క్రీన్ షాట్ ను టెస్లా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అందులో టెస్లా కారు కమాండ్స్ హిందీలో ఉన్నాయి. భారత్ లో ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ ఒకటి. అందుకే హిందీ మాట్లాడే కస్టమర్లకు మరింత చేరువయ్యేలా టెస్లా కారులో ఈ కొత్త UI ఇంటర్ ఫేస్ లాంగ్వేజీలను ప్రవేశపెట్టింది. భారతీయ భాషల్లోనే కాదు.. టెస్లాలో విదేశీ భాషలైన రష్యన్, గ్రీక్, క్రొయేషియన్, ఫిన్నీస్ కూడా UI Infoainment లో చేర్చింది. టెస్లా కారులోని ఇన్ఫోటైన్ మెంట్ భాషలకు సంబంధించి అప్ డేట్స్ స్ర్కీన్ షాట్ లను ట్విట్టర్ యూజర్ ఒకరు షేర్ చేశారు. టెస్లా కారులోని కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ లో భాగంగా ఈ కొత్త లాంగ్వేజీలను యాడ్ చేసింది. ఈ ఏడాది జనవరిలోనే టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే భారత్‌లో ఐటీహబ్ గా పేరొందిన బెంగళూరు కేంద్రంగా టెస్లా ఇండియా పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. దీనికి హెడ్‌గా ప్రశాంత్ ఆర్.మీనన్‌ను ఎంపిక చేశారు.
New Languages: Russian, Hindi, Greek, Croatian, Finnish (only last two in changelog but all 5 present, here's a Russian UI as the example) pic.twitter.com/HPibif8tmr
— green (@greentheonly) July 16, 2021
భారత్‌లో టెస్లా మోడల్ 3 కార్ ట్రయల్స్ నిర్వహించింది. అతి త్వరలోనే భారత మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. టెస్లా మోడల్-3 రెడ్ కలర్ కార్‌ను బెంగళూరులో డెలివరీ చేసింది. దేశంలో సొంత తయారీ కేంద్రాన్ని ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. భారత్‌లో తొలిసారి విడుదల చేయనున్న ఈ కారు ధర రూ.70 లక్షల వరకు ఉండొచ్చని టాక్.