OnePlus Phones : ఈ 2 వన్‌‌ప్లస్ ఫోన్లపై నిలిచిపోయిన సాఫ్ట్‌‌వేర్ అప్‌డేట్స్!

OnePlus Phones : వన్‌ప్లస్ ఇండియాలో వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు చివరి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను స్వీకరిస్తున్నాయని అధికారికంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఎండ్ సూచిస్తున్నట్లు ప్రకటించింది.

OnePlus Phones : వన్‌ప్లస్ ఇండియాలో వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు చివరి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందుకుంటున్నాయని అధికారికంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ నిలిచిపోనుందని ప్రకటించింది. ఏప్రిల్ 2020లో విడుదలైన ఈ ఫోన్‌లకు ప్రారంభంలో 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు, 3 ప్రధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్‌లు అందుకోనున్నాయి. లేటెస్ట్ చివరి అప్‌డేట్.. బిల్డ్ నంబర్ ఆక్సిజన్ఓఎస్ 13.1.0.587, ఏప్రిల్ 2024 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ని కలిగి ఉంది.

Read Also : BSNL Cinemaplus : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం కొత్త ఓటీటీ ప్లాన్లు.. కేవలం రూ.49కే సినిమాప్లస్‌ సబ్‌స్ర్కిప్షన్!

ప్రస్తుతం, ఈ అప్‌డేట్ భారత్‌లో రిలీజ్ కానుంది. రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాలకు అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ ప్రకారం.. ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్ క్రమంగా రిలీజ్ అవుతుంది. అంటే.. మొదట్లో కొద్ది శాతం మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మరింత మంది యూజర్లకు విస్తరించనుంది. Settings > About Device > OxygenOS > అప్‌డేట్స్ ద్వారా యూజర్లు మాన్యువల్‌గా అప్‌డేట్‌ కోసం చెక్ చేయవచ్చు.

వన్‌ప్లస్ 8 సిరీస్‌కు సాఫ్ట్‌వేర్ సపోర్టు ఇచ్చినందుకు వన్‌‌ప్లస్ తమ యూజర్లకు కృతజ్ఞతలు తెలిపింది. యాక్టివ్‌గా ఫీడ్‌బ్యాక్ అందించడం, బగ్‌లను నివేదించడం, ఆక్సిజన్‌ఓఎస్‌ను ఆప్టిమైజ్ చేసినందుకు యూజర్లకు కృతజ్ఞతలు తెలిపింది. వన్‌ప్లస్ యూజర్లకు వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8ప్రో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ముగిసినప్పటికీ, యూజర్ ఫీడ్‌బ్యాక్‌కు కట్టుబడి ఉన్నామని, భవిష్యత్తులో మెరుగైన ప్రొడక్టులను అందిస్తామని హామీ ఇచ్చింది. ఆక్సిజన్ఓఎస్ 13.1.0.587 రిలీజ్ త్వరలో ఉండవచ్చు.

Read Also : Reliance Jio Number : కొత్త జియో నెంబర్ ఏంటో మర్చిపోయారా? ఈ 5 పద్ధతుల్లో మీ నెంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు