రూ.30 వేలలోపే కెవ్వుకేక అనిపించే ఫీచర్లతో అందుబాటులో ఉన్న OnePlus స్మార్ట్‌ఫోన్లు ఇవే.. కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి మామ..
మీ ప్రాధాన్యతలను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోండి..

ప్రీమియం అనుభూతినిచ్చే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, మీ బడ్జెట్ రూ.30,000 లోపే ఉందా? అయితే, బడ్జెట్ సెగ్మెంట్‌లో ప్రీమియం ఫీచర్లతో అందుబాటులో ఉన్న OnePlus స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే. OnePlus Nord 4, Nord 3 5G, 10R 5G ఫోన్‌లు మంచి ఫీచర్లతో వచ్చాయి. ఈ మూడింటిలో మీ అవసరానికి, మీ బడ్జెట్‌కు ఏది సరిగ్గా సరిపోతుందో చూడండి..
OnePlus Nord 4
ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీ, శక్తిమంతమైన పర్ఫార్మెన్స్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ కోరుకుంటారో, వారికి Nord 4 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది ఫ్యూచర్ ప్రూఫ్ ఫీచర్లతో వస్తుంది.
ముఖ్యమైన ఫీచర్లు
ప్రాసెసర్: శక్తిమంతమైన Snapdragon 7+ Gen 3 చిప్‌సెట్. గేమింగ్, హెవీ యాప్స్ వాడకంలో ఎక్కడా లాగ్ ఉండదు.
డిస్‌ప్లే: ప్రొఫెషనల్ AMOLED స్క్రీన్ కళ్లకు ఇంపుగా, కలర్‌ఫుల్‌గా ఉంటుంది. Aqua Touch, ProXDR వంటి ఆధునిక ఫీచర్లు దీని సొంతం.
బ్యాటరీ, ఛార్జింగ్: భారీ 5500mAh బ్యాటరీ, మెరుపువేగంతో చార్జ్ చేసే 100W ఫాస్ట్ ఛార్జింగ్. ఒక్కసారి చార్జ్ చేస్తే రోజంతా నిశ్చింతగా ఉండొచ్చు.
ఇతర ఫీచర్లు: Android 14, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4K 60fps వీడియో రికార్డింగ్ సపోర్ట్.
ధర: సుమారు రూ.24,999 (Croma, Flipkart)తో అందుబాటులో ఉంది.
గమనిక: ఇందులో మెమరీ కార్డ్ స్లాట్, హెడ్‌ఫోన్ జాక్ లేవు.
Also Read: ఈ 3 స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? ఏ ఫోన్ కెమెరా మెరుగ్గా పనిచేస్తుంది?
OnePlus Nord 3 5G
“నాకు లేటెస్ట్ ఫీచర్ల కన్నా, స్థిరమైన పనితీరు ముఖ్యం. అన్నీ సమానంగా ఉండాలి” అని అనుకునేవారికి Nord 3 ఒక మంచి ఆప్షన్.
ముఖ్యమైన ఫీచర్లు
ప్రాసెసర్: MediaTek Dimensity 9000 ప్రాసెసర్ రోజువారీ పనులకు, మల్టీ టాస్కింగ్‌కు చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.
డిస్‌ప్లే: 6.74-అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే మంచి వివిడ్ ఇమేజ్ క్వాలిటీ అందిస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్: 5000mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
కెమెరా: ఫొటోగ్రఫీకి సరిపోయే మంచి కెమెరా సెటప్.
ధర: సుమారు రూ.21,998 (Amazon)తో అందుబాటులో ఉంది.
గమనిక: Nord 4 తో పోలిస్తే బ్రైట్‌నెస్ కొద్దిగా తక్కువగా ఉంటుంది, కానీ పనితీరులో రాజీ లేదు.
OnePlus 10R 5G
మీరు ఎక్కువగా గేమింగ్ ఆడతారా? ఒకేసారి పది యాప్‌లు వాడతారా? అయితే మీ పర్ఫార్మెన్స్ అవసరాలకు 10R 5G ఇప్పటికీ ఒక కింగ్ లాంటిదే.
ముఖ్యమైన ఫీచర్లు
ప్రాసెసర్: గేమింగ్ కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేసిన Dimensity 8100 Max చిప్‌సెట్. హై-ఎండ్ గేమింగ్‌లో కూడా లాగ్స్ ఉండవు.
బ్యాటరీ, ఛార్జింగ్: 5000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. గంటల తరబడి ఫోన్ వాడేవారికి చాలా ఉపయోగపడుతుంది.
కెమెరా: Nord 3లాగే బ్యాలెన్స్‌డ్ కెమెరా సెటప్ ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్: Android 12తో వచ్చినా చాలా స్థిరమైన పనితీరును అందిస్తుంది.
ధర: సుమారు రూ.19,999 (Flipkart) – పై మూడింటిలో అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఫో.
మీ అవసరానికి ఏది బెస్ట్?
విభాగం | OnePlus Nord 4 | OnePlus Nord 3 5G | OnePlus 10R 5G |
---|---|---|---|
ఫోకస్ | లేటెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ బ్యాటరీ, పర్ఫార్మెన్స్ | బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు, మంచి బడ్జెట్ | హెవీ గేమింగ్, పవర్-ప్యాక్డ్ యూసేజ్ |
ప్రాసెసర్ | Snapdragon 7+ Gen 3 | Dimensity 9000 | Dimensity 8100 Max |
ఛార్జింగ్ | 100W ఫాస్ట్ ఛార్జింగ్ | 80W ఫాస్ట్ ఛార్జింగ్ | 80W ఫాస్ట్ ఛార్జింగ్ |
ఆపరేటింగ్ సిస్టమ్ | Android 14 | Android 13 (అప్‌గ్రేడబుల్) | Android 12 (స్టేబుల్) |
ధర | రూ.24,999 | రూ.21,999 | రూ.19,999 |
మీ ప్రాధాన్యతలను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోండి.