Top 3 Smartphones : కొత్త ఫోన్ కావాలా? రూ. 8వేల లోపు టాప్ 3 స్మార్ట్‌ఫోన్‌లివే.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
Top 3 Smartphones : మీరు తక్కువ బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? రూ. 8వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో మూడు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Top 3 Smartphones
Top 3 Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అతి తక్కువ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ఫోన్ల కన్నా ఈ సరసమైన ఫోన్లను ఎంచుకోవడం బెటర్. ధర తక్కువగా ఉండి ఫీచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి. స్టైల్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ పరంగా మీ బడ్జెట్ ధరలోనే కొన్ని స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం మూడు స్మార్ట్‌ఫోన్లు కేవలం రూ.8వేల లోపు ధరలో లభ్యమవుతున్నాయి. కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. రియల్‌మి నార్జో N61, మోటోరోలా G05, శాంసంగ్ గెలాక్సీ M05 ఈ మూడు ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.
రియల్‌మి నార్జో N61 :
రియల్‌మి నార్జో N61 ఫోన్ స్లిమ్ బాడీ ప్రొఫైల్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ట్రెండీగా ఉంది. ఈ ఫోన్ 6.74-అంగుళాల IPS డిస్‌ప్లేతో వస్తుంది. రియల్‌మి ఫోన్‌ను నేరుగా సూర్యకాంతిలో ఉంచినప్పుడు బ్రైట్‌నెస్ లెవల్ మిడ్ లెవల్ కన్నా తక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్, యూనిసోక్ T612 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
బ్రౌజింగ్, చాట్, గేమ్‌ల వంటి రోజువారీ వినియోగానికి ఈ స్పెసిఫికేషన్ బాగానే ఉంది. 32MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా సోషల్ మీడియా సెల్ఫీలకు బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ కారణంగా బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. అదనపు స్టోరేజీ కోసం స్పెషల్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంది.
మోటోరోలా G05 :
మోటోరోలా G05 స్క్రీన్, కెమెరా ఫీచర్లు ప్రీమియం మాదిరిగా ఉంటాయి. 6.67-అంగుళాల స్క్రీన్ 1000 నిట్స్ వరకు హై బ్రైట్‌నెస్ మోడ్ అందిస్తుంది. మెరుగైన క్లాక్ స్పీడ్‌తో మీడియాటెక్ హీలియో G81 అల్ట్రా చిప్‌ను కూడా కలిగి ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయంలో వేగంగా పనిచేస్తుంది.
50MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలతో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. 5200mAh సెల్‌తో బ్యాటరీ లైఫ్ ఆకట్టుకుంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ప్లస్ పాయింట్. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, NFC సపోర్టు కూడా అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ M05 :
శాంసంగ్ గెలాక్సీ M05 ఫోన్ బ్యాటరీతో పాటు క్వాలిటీ కెమెరాను అందిస్తుంది. 6.7-అంగుళాల PLS LCDని కలిగి ఉంది. రోజువారీ వినియోగానికి మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్ కలిగి ఉంది. ముఖ్యంగా యాప్స్, గేమింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది.
ఆకర్షణీయమైన ఫొటోల కోసం 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరాతో వస్తుంది. 5000mAh బ్యాటరీ 25W గరిష్ట రేటుతో చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. మీరు ఎక్కువ సమయం ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. తక్కువ డౌన్‌టైమ్‌లను ఉంటుంది. కానీ, ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ రీడర్ లేదు.
ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ అంటే.. స్క్రీన్, ఫాస్ట్ ఛార్జింగ్, NFC ఫీచర్ల కోసం మోటోరోలా G05 అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. రియల్‌మి నార్జో N61 ఫోన్ కూడా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. బ్యాటరీ లైఫ్, పర్ఫార్మెన్స్ కోసం శాంసంగ్ గెలాక్సీ M05 కొనుగోలు చేయొచ్చు. ఈ మూడు ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఏదైనా కొనేసుకోవచ్చు.