2025లో టాప్‌ 5 బెస్ట్‌ 108MP కెమెరా ఫోన్లు ఇవే.. తీస్తే వీటితోనే ఫొటోలు తియ్యాలి భయ్యా..

షార్ప్‌నెస్‌, లో లైట్‌ పెర్ఫార్మెన్స్‌, జూమ్‌ స్కోప్‌ అద్భుతం.

2025లో టాప్‌ 5 బెస్ట్‌ 108MP కెమెరా ఫోన్లు ఇవే.. తీస్తే వీటితోనే ఫొటోలు తియ్యాలి భయ్యా..

Updated On : July 8, 2025 / 8:32 AM IST

మార్కెట్లో ఈ ఏడాది ఫొటోగ్రఫీ లవర్స్‌ను అలరిస్తూ, 108MP కెమెరాతో పలు స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. డీఎస్ఎల్ఆర్ లెవెల్‌ క్లారిటీ, సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్‌ను చిన్న ఫోన్‌లోనే అందిస్తున్న టాప్‌ 108MP కెమెరా ఫోన్లు ఇవే..

Samsung Galaxy S24 Ultra
200MP ప్రధాన సెన్సార్ ద్వారా 108MP అవుట్‌పుట్‌ ఇస్తుంది. లేసర్‌ ఆటోఫోకస్, OIS, పెరిస్కోప్‌ జూమ్, స్మార్ట్‌ ఇమేజింగ్‌ ఇంజిన్‌ కలిసిన ఈ ఫోన్‌ 8K వీడియోలు, హై-రిజల్యూషన్‌ స్టిల్స్‌ కోసం బెస్ట్‌. షార్ప్‌నెస్‌, లో లైట్‌ పెర్ఫార్మెన్స్‌, జూమ్‌ స్కోప్‌ అద్భుతం.

OnePlus 12 Pro
108MP మెయిన్‌ సెన్సార్‌తోపాటు 50MP అల్ట్రావైడ్‌, 50MP టెలిఫొటో, మోనోక్రోమ్‌ షూటర్ ఉంటుంది. హాసెల్‌బ్లాడ్‌ ట్యూనింగ్‌ వల్ల ఫిల్మ్‌లా కనిపించే టోన్లు, సహజమైన బ్లర్‌ ఇస్తుంది. పోర్ట్రెయిట్లు, ల్యాండ్‌స్కేప్స్‌ తీసే వారికే ఇది.

Also Read: iQOO Neo 10 5G స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్లు.. Oppo Reno 14 కొంటారా? iQOO Neo 10 కొంటారా? మీకు ఏది బెస్ట్‌?

Honour X9c 5G
ఇండియాలో జూలై 1న లాంచ్‌ అయిన ఈ మిడ్‌రేంజ్‌ ఫోన్‌ 108MP కెమెరా, OIS, 5MP అల్ట్రావైడ్‌తో వచ్చింది. AI Erase, మోషన్‌ సెన్సింగ్‌ వంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌ ధర రూ.21,999 మాత్రమే.

Infinix GT 30 Pro
108MP రియర్‌ సెన్సార్‌తో పాటు 1.5K AMOLED స్క్రీన్‌, MediaTek Dimensity చిప్ ఉంది. ఇది గేమింగ్‌ యూజర్లకు బాగా నచ్చుతోంది. అద్భుతమైన డిజైన్‌తో ఫొటోగ్రఫీ తీసుకోవచ్చు.

Redmi Note 13 5G
బజెట్‌ సెగ్మెంట్‌లో బిగ్‌ హిట్‌ అయింది ఈ స్మార్ట్‌ఫోన్. 108MP మెయిన్‌ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 2MP మాక్రో ఉన్నాయి. 120Hz AMOLED, Dimensity 6080 చిప్‌, 5,000mAh బ్యాటరీతో రూ.18,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

ధరలు ఇలా..

  • Samsung Galaxy S24 Ultra – ఫుల్‌ ఫీచర్‌డ్‌ ప్రో ఫొటోగ్రఫీ ఫోన్‌ (ధర: రూ.1,30,000)
  • OnePlus 12 Pro – కలర్స్‌తో నిండిన పోర్ట్రెయిట్లు, ల్యాండ్‌స్కేప్స్‌ (ధర: రూ.70,000-రూ.80,000)
  • Honour X9c 5G – DSLR లెవెల్‌ క్వాలిటీ, బడ్జెట్‌ బెస్ట్‌ (ధర: రూ.21,999)
  • Redmi Note 13 5G – 108MP కెమెరా (ధర: రూ.17,999)