Smartphones: ఈ 5 స్మార్ట్‌ఫోన్లు అదుర్స్‌.. వీటిని ఎందుకు కొనొచ్చంటే?

ఈ ఫోన్‌లకు డిమాండ్ బాగా ఉంది.

ఛార్జింగ్ వేగంగా ఎక్కాలి.. బ్యాటరీ సామర్థ్యం బాగా ఉండాలి.. ధర మరీ అంతగా ఎక్కువగా ఉండొద్దు.. చాలా తక్కువగానూ ఉండొద్దు.. ఇటువంటి స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా? అయితే, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, ఐక్యూ నియో 10, వివో టీ4ఎక్స్, రియల్‌మీ జీటీ 7 ఫీచర్ల గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్‌లకు డిమాండ్ బాగా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ
సామసంగ్ సిరీస్‌లో వచ్చిన ఈ ఫోన్‌కి 4700mAh సామర్థ్యంతో పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. దీంట్లో 25W వైర్డ్, 15W వైర్లెస్, 4.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్‌ను రూ.34,990కే అమెజాన్‌లో కొనుగోలు చేయొచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. అదనంగా 15W వైర్లెస్, 5W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీంట్లో 6000mAh సామర్థ్యంతో పెద్ద బ్యాటరీ వస్తుంది. ధర రూ.24,677 మాత్రమే.

ఐక్యూ నియో 10
వివో టెక్ బ్రాండ్‌కు చెందిన ఈ ఫోన్‌లో భారీగా 7000mAh సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 120W ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది. అమెజాన్‌లో దీన్ని రూ.26,998కి కొనుగోలు చేయవచ్చు.

వివో టీ4ఎక్స్
వివో నుండి వచ్చిన ఈ మోడల్‌లో 6500mAh సామర్థ్యంతో బ్యాటరీ ఉంది. దీంట్లో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. తగ్గింపు ధరలో దీని ప్రారంభ ధర రూ.13,999గా ఉంది.

రియల్‌మీ జీటీ 7
ఈ రియల్‌మీ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో అత్యుత్తమ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇందులో 120W రికార్డ్ ఛార్జింగ్ వేగం ఉంది. అదనంగా 7000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ వస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర రూ.39,998.

ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇవి బెస్ట్ ఆప్షన్లు.