Amazon Festival Sale 2024 : అమెజాన్ సేల్ ఆఫర్లు.. రూ. 20వేల లోపు టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Amazon Festival Sale 2024 : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వన్‌ప్లస్, శాంసంగ్, వివో, రియల్‌మి, టెక్నో, పోకో, ఐక్యూ వంటి బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లను రూ. 20వేల లోపు ధరకు సొంతం చేసుకోవచ్చు.

Top Smartphone Deals Under Rs. 20k During Amazon Great Indian Festival Sale
Amazon Festival Sale 2024 : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది. మీ బడ్జెట్ ధరలో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనేసుకోవచ్చు.
వన్‌ప్లస్, శాంసంగ్, వివో, రియల్‌మి, టెక్నో, పోకో, ఐక్యూ వంటి బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లను రూ. 20వేల లోపు ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ సేల్‌లో అదనపు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సమయంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ, పోకో ఎక్స్6, రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ, రెడ్‌మి 13సి 5జీ, వివో వై58 5జీ, టెక్నో పోవా వంటి అనేక ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. రూ. 20వేల లోపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్లపై ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 1,750 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు.
పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. తద్వారా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మరింత చౌకైన ధరకే పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో రూ. 20వేల లోపు స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
రూ. 20వేల లోపు ధరలో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ :
- ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ : రూ. 13,999
- శాంసంగ్ గెలాక్సీ ఎమ్15 5జీ ప్రైమ్ ఎడిషన్ : రూ. 11,999
- పోకో ఎక్స్6 5జీ : రూ. 17,499
- రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ : రూ. 16,998
- రెడ్‌మి 13సి 5జీ : రూ. 8,749
- వివో వై58 5జీ : రూ. 18,499
- టెక్నో పోవా 6 నియో : రూ. 13,999
- శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ : రూ. 14,999
- ఐక్యూ జెడ్9ఎస్ 5జీ : రూ. 17,499
- నోకియా జీ42 5జీ : రూ. 10,499