Toyota Qualis: ఏ రిపేర్ లేకుండానే 8 లక్షల కిలోమీటర్లు తిరిగేసిన క్వాలిస్

ఇండియాలో లాంచ్ చేసిన టయోటా ఫస్ట్ మోడల్స్ లో క్వాలిస్ ఒకటి. జపనీస్ టెక్నాలజీతో రెడీ అయిన వెహికల్..

Toyota Qualis: ఏ రిపేర్ లేకుండానే 8 లక్షల కిలోమీటర్లు తిరిగేసిన క్వాలిస్

Toyota Qualis Clocks Over 8 Lakh Kms

Updated On : April 12, 2021 / 6:16 PM IST

Toyota Qualis: ఇండియాలో లాంచ్ చేసిన టయోటా ఫస్ట్ మోడల్స్ లో క్వాలిస్ ఒకటి. జపనీస్ టెక్నాలజీతో రెడీ అయిన వెహికల్ ప్రైవేట్, కమర్షియల్ సెక్టార్లలో మంచి సక్సెస్ సాధించింది. మహీంద్రా బొలెరో, టాటా సుమో లాంటి వాడితో పోటీపడి 2000-2004 కాలంలో హవా చేసింది. దీనిని రీప్లేస్ చేస్తూ.. ఇన్నోవా దిగింది.

ఇక ఇప్పుడు రోడ్ మీద చాలా అరుదుగా కనిపిస్తుంది. దేశంలో చక్కగా మెయింటైన్ చేసిన వాహనాలే ఇంకా నడుస్తున్నాయి. ఎప్పుడో లాంచ్ అయిన ఈ మోడల్ ఒక్క రిపేర్ కూడా లేకుండా 8లక్షల కిలోమీటర్ల వరకూ నడిచేసిందని దాని యజమాని చెప్తున్నాడు.

2000 సంవత్సరంలో లాంచ్ అయిన కొత్తలోనే కేరళలోనే ఫామస్ డీలర్‌షిప్ నిప్పోన్ టయోటా నుంచి దీనిని కొనుగోలు చేశాడు. 20ఏళ్లు అయిన వెహికల్ కు కలర్ కాస్త ఫేడ్ అవడం తెలిసిందే. కాకపోతే ఇంజిన్ లో మాత్రం ఎటువంటి సమస్య రాలేదని దాని ఓనర్ చెప్తున్నారు. ప్రస్తుతం ఇది 8.22 లక్షల కిలోమీటర్లు తిరగగలిగిందని గొప్పగా చెప్పుకుంటున్నాడు.

టయోటా ఇంజిన్లు బుల్లెట్ ప్రూఫ్ ఉంటాయని తెలిసిందే. ఈ వెహికల్ లాగే చాలా ఇన్నోవాలు, ఫార్చూనర్లు కూడా లక్షల కిలోమీటర్లు ప్రయాణించినా ఇంజిన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి.