TRAI New Guidelines : మొబైల్ నంబర్ పోర్టింగ్ కోసం ట్రాయ్ కొత్త రూల్స్.. జూలై 1 నుంచే అమల్లోకి..!

TRAI New Guidelines : మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం ట్రాయ్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వచ్చే జూలై 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

TRAI New Guidelines : మొబైల్ నంబర్ పోర్టింగ్ కోసం ట్రాయ్ కొత్త రూల్స్.. జూలై 1 నుంచే అమల్లోకి..!

TRAI Introduces New Guidelines for Mobile Number Porting

Updated On : March 18, 2024 / 4:49 PM IST

TRAI New Guidelines : మొబైల్ యూజర్లకు అలర్ట్.. మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి సంబంధించి టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. గత వారమే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) నిబంధనలలో మార్పులను ప్రకటించింది. తాజా సవరణ ప్రకారం.. సిమ్ కార్డ్ స్వాప్ చేసినా పోర్టబుల్ చేసినా అనుబంధిత మొబైల్ నంబర్‌ను వేరే టెలికాం ఆపరేటర్‌కు 7 రోజుల పాటు పోర్ట్ చేయడం సాధ్యం కాదు.

Read Also : Wet iPhone Rice : మీ ఐఫోన్ నీళ్లలో తడిసిందా? ఆరబెట్టేందుకు బియ్యంలో వేయవద్దు? యూజర్లకు ఆపిల్ హెచ్చరిక? ఎందుకంటే?

ఎమ్ఎన్‌పీ నిబంధనలను ప్రవేశపెట్టిన తర్వాత ఇది 9వ కొత్త సవరణగా చెప్పవచ్చు. ఈ కొత్త నిబంధనలు దేశంలో సిమ్ స్వాప్ మోసాన్ని నిరోధించడమే లక్ష్యంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. ట్రాయ్ ప్రకారం.. పోర్టబిలిటీపై కొత్త నిబంధనలు వచ్చే జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి.

మోసపూరిత సిమ్ మార్పిడికి చెక్ :
భారత టెలికాం రెగ్యులేటర్ గతవారమే టెలికమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (9వ సవరణ) నిబంధనలు, 2024ను విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. కస్టమర్‌లు గత ఏడు రోజులలో తమ సిమ్ కార్డ్‌ను మార్చుకున్నా లేదా రీప్లేస్ చేసినా వారి మొబైల్ నంబర్‌ను వేరే టెలికాం ఆపరేటర్‌కు పోర్ట్ చేయడానికి అనుమతించరు. మోసపూరిత సిమ్ మార్పిడి లేదా ఇతర అంశాల ద్వారా మొబైల్ నంబర్‌లను పోర్టింగ్ చేసే పద్ధతిని అరికట్టడానికి ఈ నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ట్రాయ్ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.

ఇలా చేస్తే.. యూపీసీ కేటాయింపు కుదరదు :
ఒక టెలికాం ఆపరేటర్ నుంచి మరో మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడానికి అవసరమైన యూనిక్ పోర్టింగ్ కోడ్ (UPC) కేటాయింపు అభ్యర్థనను తిరస్కరించే విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. సిమ్ స్వాప్ లేదా మొబైల్ నంబర్‌ను మార్చిన తేదీ నుంచి 7 రోజుల గడువు ముగిసేలోపు యూపీసీ కోసం అభ్యర్థన చేసినట్టయితే యూపీసీని కేటాయించరాదని ట్రాయ్ కొత్త నిబంధనల్లో పేర్కొంది. గతంలో ఎమ్ఎన్‌పీ నిబంధనలను మొదటిసారిగా 2009లో ట్రాయ్ ప్రవేశపెట్టింది.

ఎమ్ఎన్‌పీ సౌకర్యం ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను మార్చాల్సిన అవసరం లేకుండానే సర్వీస్ ప్రొవైడర్‌ను మార్చుకోవచ్చు. Port <10 అంకెల మొబైల్ నంబర్> ఫార్మాట్‌లో 1900కి (SMS) పంపడం ద్వారా పోర్టింగ్ చేసుకోవచ్చు. తద్వారా యూపీసీ క్రియేట్ అవుతుంది. మొబైల్ యూజర్లు ఎస్ఎమ్ఎస్ ద్వారా పొందవచ్చు. చివరిగా ఎమ్ఎన్‌పీ అభ్యర్థన కోసం ఉపయోగించవచ్చు.

Read Also : iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?