International UPI Payments : విదేశీ ప్రయాణాల్లో యూపీఐ పేమెంట్లను ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

International UPI Payments : విదేశాలకు వెళ్లే సమయంలో యూపీఐ లావాదేవీలను సులభంగా పూర్తి చేయొచ్చు. భారత్ సహా అనేక దేశాల్లో యూపీఐ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. యూపీఐ సర్వీసులను ఎలా యాక్టివేట్ చేయాలంటే?

Travelling Abroad : విదేశాలకు వెళ్తున్నారా? అయితే, అంతర్జాతీయ ప్రయాణాల్లో కూడా యూపీఐ లావాదేవీలను ఈజీగా నిర్వహించుకోవచ్చు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ సేవలు ఇప్పుడు భారత్ మాత్రమే కాకుండా అనేక దేశాలలో అందుబాటులో ఉన్నాయి. అందులో శ్రీలంక, మారిషస్, భూటాన్, ఒమన్, నేపాల్, ఫ్రాన్స్, యుఎఇ దేశాలు ఉన్నాయి. ఎన్‌పీసీఐ (NPCI) ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL), నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ విభాగం కూడా 10 ఆగ్నేయాసియా దేశాలలో క్యూఆర్-ఆధారిత యూపీఐ పేమెంట్లను ప్రారంభించేందుకు ఇతర దేశాలతో ఒప్పందంపై సంతకం చేసింది.

Read Also : UPI Transaction Limit : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? గూగుల్ పే నుంచి పేటీఎం దాకా రోజుకు ఎంత డబ్బు పంపొచ్చు?

ఈ దేశాల్లో మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం, సింగపూర్, కంబోడియా, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్, హాంకాంగ్ ఉన్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలు, అమెరికాలో కూడా యూపీఐ సర్వీస్ సపోర్టును అందించేందుకు భారత్ కృషి చేస్తోంది. మీరు ఈ దేశాలలో ప్రయాణిస్తున్నట్లయితే.. రూపాయిని స్థానిక కరెన్సీకి మార్చకుండా ఎంచుకోవచ్చు.

యూపీఐ ద్వారా పేమెంట్లు చేయడానికి మీ ఫోన్ యాప్‌ని ఉపయోగించవచ్చు. మీరు ప్రయాణించే ముందు యూపీఐ సర్వీసులను ఇలా యాక్టివేట్ చేయవచ్చు. అంతర్జాతీయ ప్రయాణానికి ముందు యూపీఐ పేమెంట్లను యాక్టివేట్ చేసుకోవాలంటే? ఫోన్‌పేలో యూపీఐ ఇంటర్నేషనల్‌ని ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

  • యూపీఐ యాప్‌ను ఓపెన్ చేసి.. మీ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయండి.
  • పేమెంట్ సెట్టింగ్స్ సెక్షన్ కింద యూపీఐ ఇంటర్నేషనల్‌ ఆప్షన్ ఎంచుకోండి.
  • అంతర్జాతీయ యూపీఐ పేమెంట్ల కోసం మీ బ్యాంక్ అకౌంట్ పక్కన ఉన్న యాక్టివేట్ బటన్‌ను క్లిక్ చేయండి.
  • యాక్టివేషన్‌ను నిర్ధారించడానికి మీ యూపీఐ పిన్‌ని ఎంటర్ చేయండి.

గూగుల్ పేని ఉపయోగించి అంతర్జాతీయ పేమెంట్లు చేయడం ఎలా? :

  • గూగుల్ పే యాప్‌ని ఓపెన్ చేసి ‘క్యూఆర్ కోడ్‌ స్కాన్’ ఆప్షన్ ట్యాప్ చేయండి.
  • ఇంటర్నేషనల్ మర్చంట్ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి.
  • చెల్లించాల్సిన విదేశీ కరెన్సీలో మొత్తాన్ని ఎంటర్ చేయండి.
  • అంతర్జాతీయ వ్యాపారికి చెల్లించడానికి మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.
  • యూపీఐ ఇంటర్నేషనల్ యాక్టివేట్ స్క్రీన్ కనిపిస్తుంది.
  • ‘యూపీఐ ఇంటర్నేషనల్‌ యాక్టివేట్’ ఆప్షన్ ట్యాప్ చేయండి.

యూపీఐ ఇంటర్నేషనల్‌కు సపోర్టు ఇచ్చే బ్యాంకు అకౌంట్ల కోసం వినియోగదారులు అంతర్జాతీయ లావాదేవీలను యాక్టివేట్ చేయవచ్చని గమనించాలి. ఇంకా, బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ భారతీయ కరెన్సీలో ఉంటుంది. అంటే.. లావాదేవీలపై విదేశీ మారకపు మార్పిడి రేటు, బ్యాంక్ రుసుము వర్తిస్తాయి.

Read Also : 5 UPI Payment Rules : 2024లో యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? 5 యూపీఐ పేమెంట్ రూల్స్ గురించి తప్పక తెలుసుకోండి!

ట్రెండింగ్ వార్తలు