Year End Sale 2024 : కొత్త బైక్ కొంటున్నారా? ట్రయంఫ్ స్పీడ్ టీ4 బైకుపై రూ. 18వేలు తగ్గింపు.. డోంట్ మిస్..!

Triumph Speed T4 : ఆసక్తిగల కస్టమర్లు ట్రయంఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో కూడా ఈ బైకును కొనుగోలు చేయవచ్చు.

Triumph Speed T4 Listed Under Year End Discount

Triumph Speed T4 : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2024 ఇయర్ ఎండ్ డిస్కౌంట్ కింద ట్రయంఫ్ స్పీడ్ టీ4 మోడల్ తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించేందుకు ట్రయంఫ్ ఇండియా ఎంట్రీ-లెవల్ మోడల్ స్పీడ్ టీ4ని ఆకర్షణీయమైన డిస్కౌంట్ వద్ద జాబితా చేసింది. ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఈ మోటార్‌సైకిల్ ధర రూ. రూ. 18వేలు తగ్గింపు అందిస్తోంది.

అసలు ధర రూ. 2.17 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు బదులుగా రూ. 1.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. అయితే, కంపెనీ పరిమిత కాలానికి ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. డిసెంబర్ 14న ఈ డిస్కౌంట్ సేల్ ప్రారంభమైంది. స్టాక్ ఉన్నంత వరకు ఈ నెలలో ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు దేశవ్యాప్తంగా అధీకృత డీలర్‌షిప్‌లను సందర్శించి బెనిఫిట్స్ పొందవచ్చు. ట్రయంఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో కూడా ఈ బైకును కొనుగోలు చేయవచ్చు.

ట్రయంఫ్ స్పీడ్ టీ4 స్పెషిఫికేషన్లు :
అన్నీ మోడల్స్‌తో పోలిస్తే.. ట్రయంఫ్ స్పీడ్ టీ4 400తో చాలా తేడాలను కలిగి ఉంది. మునుపటి మోడల్ ఆధారంగా ఉందని చెప్పవచ్చు. ఇది ఒకేలా గుండ్రని ఆకారపు ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్‌తో వస్తుంది. రెండు చివర్లలో ఆకర్షణీయమైన ఎల్ఈడీ ఇండికేషన్లతో అమర్చారు.

బయాస్-ప్లై టైర్‌లపై ప్రయాణిస్తుంది. సౌకర్యం విషయానికి వస్తే.. పిలియన్ కోసం గ్రాబ్ హ్యాండిల్స్‌తో ఒకే సీటింగ్ అమరికను పొందుతుంది. ఇది కాకుండా, కంపెనీ ఫ్రంట్ సైడ్ సంప్రదాయ టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూనిట్‌ను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ షాక్ అబ్జార్బర్ సపోర్టు అందిస్తుంది.

పవర్ ట్రైన్ :
బైక్ ఆకట్టుకునే 399సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ని ఉపయోగిస్తుంది. 7000rpm వద్ద గరిష్టంగా 30.6bhp శక్తిని, 5000rpm వద్ద 36Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యూనిట్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ప్రతి రైడ్‌లో మృదువైన గేర్ షిఫ్ట్‌ను అందిస్తుంది.

ఇంధన సామర్థ్యం :
మైలేజీ విషయానికొస్తే.. రైడింగ్ స్టైల్, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి వినియోగదారులు దాదాపు 30kmpl ఎంజాయ్ చేయవచ్చని బ్రాండ్ క్లెయిమ్ చేసింది.

Read Also : Credit Card Holders : క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ జాగ్రత్త.. బిల్లు లేటుగా చెల్లించేవారు సుప్రీంకోర్టు తీర్పు తప్పక తెలుసుకోండి..!