Twitter Outage : ట్విట్టర్‌కు ఏమైంది.. నిలిచిపోయిన సర్వీసులు.. యూజర్ల ఇబ్బందులు

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ కు ఏమైంది.. ఒక్కసారిగా ట్విట్టర్ సర్వీసులు నిలిచిపోయాయి. చాలామంది యూజర్లకు ట్విట్టర్ పేజీ ఓపెన్ కాలేదు. ట్విట్టర్ అకౌంట్లలో సమస్యలు తలెత్తడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Twitter Outage : ట్విట్టర్‌కు ఏమైంది.. నిలిచిపోయిన సర్వీసులు.. యూజర్ల ఇబ్బందులు

Twitter Says Services Back After Being Down For Several Users (1)

Updated On : July 1, 2021 / 2:21 PM IST

Twitter Services Outage : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ కు ఏమైంది.. ఒక్కసారిగా ట్విట్టర్ సర్వీసులు నిలిచిపోయాయి. చాలామంది యూజర్లకు ట్విట్టర్ పేజీ ఓపెన్ కాలేదు. ట్విట్టర్ అకౌంట్లలో సమస్యలు తలెత్తడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్విట్టర్ పోస్టింగ్ లతో పాటు సెర్చింగ్ ఆప్షన్, షేరింగ్ కంటెంట్ చేసే సమయంలో సాంకేతికపరంగా సమస్యలు ఎదురైనట్టు యూజర్లు ఫిర్యాదులు చేశారు. అంతటా కాదు.. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ సమస్య తలెత్తినట్టు ఓ నివేదిక వెల్లడించింది.

ట్విట్టర్ సర్వీసులు నిలిచిపోవడానికి గల కారణాలపై ట్విట్టర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. చాలామంది యూజర్లకు కనీసం వారి ప్రొఫైల్ కూడా కనిపించలేదంటున్నారు. చాలాచోట్ల ట్విట్టర్ పేజీ కూడా లోడ్ కాలేదు.. వరుసగా ఫిర్యాదులు రావడంతో స్పందించిన ట్విట్టర్ దాదాపు గంట తర్వాత ట్విట్టర్ సర్వీసులకు సంబంధించి సాంకేతిక సమస్యలను పరిష్కరించింది. అనంతరం యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేసింది. ట్విట్టర్ సర్వీసులను తిరిగి పునరుద్దరించినట్టు ట్వీట్ ద్వారా తెలిపింది.