Child Aadhaar Card
Children Aadhaar Card : మీ పిల్లల ఆధార్ కార్డు ఇంకా అప్‌డేట్ చేయలేదా? అయితే, వెంటనే బయోమెట్రిక్స్‌తో అప్‌డేట్ చేయండి.. లేదంటే ఏ క్షణమైనా ఆధార్ కార్డు (Children Aadhaar Card) డియాక్టివేట్ అవ్వొచ్చు. దీనికి సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక కొత్త అడ్వైజరీని జారీ చేసింది. 7 ఏళ్లు నిండిన పిల్లల కోసం తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) పూర్తి చేయాలని యూఐడీఏఐ తల్లిదండ్రులను కోరుతోంది.
ఈ ప్రక్రియను తల్లిదండ్రులు పూర్తి చేయకపోతే వారి పిల్లల ఆధార్ కార్డును డియాక్టివేట్ చేస్తామని హెచ్చరించింది. ఆధార్ చట్టం 2016 ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పిల్లలు 5 ఏళ్లు వయస్సు తర్వాత తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) చేయించుకోవాలి. ఈ అప్‌డేట్ ప్రక్రియలో వారి పిల్లల ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్ స్కాన్, ఫేషియల్ ఫొటోలను అప్‌డేట్ చేయాలి. ఎందుకంటే.. ఈ వయస్సులో ఈ ఫీచర్లు స్పష్టంగా కనిపిస్తాయి.
అయితే, చాలా మంది తల్లిదండ్రులు ఈ రూల్ పాటించలేదని యూఐడీఏఐ గమనించింది. బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయకపోతే.. వారి పిల్లల ఆధార్ కార్డు డియాక్టివేట్ అవుతుందని తల్లిదండ్రులను హెచ్చరించింది.
“పిల్లల బయోమెట్రిక్ డేటా కచ్చితత్వం కోసం బయోమెట్రిక్ అప్‌డేట్ సకాలంలో పూర్తి చేయాలని సూచించింది. 7 ఏళ్ల వయస్సు తర్వాత కూడా పూర్తి చేయకపోతే.. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆధార్ నంబర్‌ను డియాక్టివేట్ చేయవచ్చు” అని యూఐడీఏఐ తెలిపింది.
7 ఏళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్స్ అప్‌డేట్ ఫ్రీ :
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ (Children Aadhaar Card) విషయంలో UIDAI అలర్ట్ చేస్తోంది. ఇప్పటివరకూ అప్‌డేట్ చేయని పిల్లల ఆధార్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్లకు యూఐడీఏఐ SMS పంపుతోంది. ఈ SMSలో యూఐడీఏఐ తల్లిదండ్రులను అవసరమైన బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేయాలని కోరుతోంది. ప్రస్తుత రూల్స్ ప్రకారం.. పిల్లలకి 5 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు వారి ఆధార్‌లో ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్, ఫొటోను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి.
5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల మధ్య పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం. కానీ, 7 ఏళ్ల వయస్సు తర్వాత రూ. 100 రుసుము చెల్లించాల్సి ఉంటుందని యూఐడీఏఐ తెలిపింది. “పిల్లల బయోమెట్రిక్ డేటా కచ్చితత్వం కోసం బయోమెట్రిక్ అప్‌డేట్ సకాలంలో పూర్తి చేయాలి. 7 ఏళ్ల వయస్సు తర్వాత కూడా బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేయకపోతే.. ప్రస్తుత నిబంధనల ప్రకారం… ఆధార్ నంబర్‌ను డియాక్టివేట్ చేయవచ్చు” అని UIDAI స్పష్టం చేసింది.