FASTag New Rules : వాహనదారులకు బిగ్ అలర్ట్.. టోల్‌ప్లాజాల వార్షిక పాస్‌పై కొత్త గైడ్‌లైన్స్ ఇవే.. మీ సందేహాలకు NHAI వన్ షాట్ ఆన్సర్..!
FASTag New Rules : మీ FASTag బ్యాలెన్స్ మైనస్‌లో ఉంటే.. ముందుగా రీఛార్జ్ చేసుకోవాలి. లేదంటే.. రూ. 3వేలు టోల్ పాస్ మీ FASTagకు యాడ్ కావు..

FASTag New Rules
FASTag New Rules : దేశంలో అతి త్వరలో కొత్త (FASTag) టోల్ పాస్ విధానం అమల్లోకి రాబోతుంది. నేషనల్ హైవేలపై ఆగస్టు 15 నుంచి మీరు రూ. 3వేలకు ఒక ఏడాది (FASTag New Rules) వరకు టోల్ పాస్ పొందవచ్చు. ఈ పాస్ పొందాలంటే వాహనదారులకు e-KYC తప్పనిసరి. అసలు e-KYC లేకుండా మీ ఫాస్టాగ్ పనిచేయదు. మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ మైనస్‌లో ఉంటే.. వెంటనే రీఛార్జ్ చేసుకోండి.
ఆన్‌లైన్‌లో లేదా మీ బ్యాంకును విజిట్ చేసి ఇ-కేవైసీ ప్రాసెస్ చేయవచ్చు. ఇంకా ఒక నెల కన్నా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ఏఐ (NHAI) ఫాస్టాగ్ కు సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. టోల్ పాస్ వాడకం, వ్యాలిడిటీ, ఇతర సందేహాలపై NHAI క్లారిటీ ఇచ్చింది.
రూ.3000 వార్షిక ఫాస్టాగ్ టోల్ పాస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పాస్‌తో, మీరు ఏడాది మొత్తం 200 ట్రిప్పుల వరకు టోల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫాస్టాగ్ ఉన్న వారికే టోల్ పాస్ తీసుకోవచ్చు. వార్షిక పాస్ తీసుకోవడం అనేది తప్పనిసరి కాదని వాహనదారులు గమనించాలి.
వార్షిక పాస్‌కు అప్లయ్ చేయడం ఎలా? :
ఫాస్టాగ్ కలిగిన వాహనదారులు వార్షిక పాస్ కోసం రాజ్‌మార్గ్ యాత్రా మొబైల్ యాప్ లేదా NHAI వెబ్‌సైట్‌లో యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్, ఫాస్టాగ్ నంబరు వెరిఫై చేసిన తర్వాత ఎన్‌హెచ్‌ఏఐ వార్షిక పాస్‌ను జారీ చేస్తుంది. ఇందుకోసం రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
రాజ్‌మార్గ్ యాత్రా యాప్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయాలని గుర్తుంచుకోవాలి. ఒకసారి పేమెంట్ కంప్లీట్ అయ్యాక 2 గంటలలోపు రిజిస్టర్ ఫాస్టాగ్‌లో వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది. కొత్త ఫాస్టాగ్ అవసరం లేదు.
NHAI రూల్స్ ప్రకారం..
- వెహికల్ విండ్ షీల్డ్‌పై సరిగ్గా స్టిక్ చేయాలి.
- వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌కు లింక్ అయి ఉండాలి.
- బ్లాక్‌లిస్టులో ఉండకూడదు.
- ప్రస్తుతం ఫాస్టాగ్ ఉంటే దానిపైనే వార్షిక పాస్‌ను తీసుకోవచ్చు.
నాన్-కమర్షియల్ వెహికల్స్‌కు మాత్రమే (FASTag New Rules) :
వార్షిక పాస్ అనేది ప్రైవేట్ నాన్ కమర్షియల్ వెహికల్స్ మాత్రమే వర్తిస్తుంది. అంటే.. కారు, జీపు, వ్యాన్ వంటివి ఉంటాయి. అలా కాకుండా ఏదైనా కమర్షియల్ వెహికల్స్ కోసం తప్పుడు సమాచారంతో వార్షిక పాస్ తీసుకుంటే ఎలాంటి నోటీసులు లేకుండానే NHAI ఆ పాస్ క్యాన్సిల్ చేస్తుంది. నేషనల్ హైవేలు, నేషనల్ ఎక్స్‌ప్రెస్ వేలపై ఫీజు టోల్ ప్లాజాలలో మాత్రమే ఈ వార్షిక పాస్ పనిచేస్తుంది.
ఎక్స్‌ప్రెస్ వే, రాష్ట్ర రహదారులు(SH)లపై ఉన్న ఫీజు ప్లాజాలో ఈ వార్షిక పాస్ చెల్లదు. ప్రస్తుత ఫాస్టాగ్ రుసుము మాత్రమే చెల్లించాలి. వార్షిక పాస్ యాక్టివేట్ అయినప్పటినుంచి ఏడాది లేదా 200 ట్రిప్పుల వరకు ఈ పాస్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అదే పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రతి టోల్‌ప్లాజా క్రాసింగ్‌ను సింగిల్ ట్రిప్‌గా పరిగణిస్తారు. అదే రూటులో రిటర్న్ వస్తే అప్పుడు రెండు ట్రిప్‌లు పూర్తి అయినట్టు. క్లోజ్డ్ టోలింగ్ ఫీజు ప్లాజాలలో ఎంట్రీ, ఎగ్జిట్ రెండు కూలిపి ఒక ట్రిప్‌గా లెక్కిస్తారు.
వార్షిక టోల్ పాస్ సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా అందుకుంటారు. ఫాస్టాగ్ వ్యాలెట్‌లో లోడ్ చేసిన రూ.3 వేల క్యాష్ ద్వారా వార్షిక పాస్ చెల్లించలేరు. ఇందుకోసం రాజ్‌మార్గ్ యాత్రా మొబైల్ యాప్ లేదా NHAI వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుంది.