Upcoming Phones August
Upcoming Phones August 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మరికొద్ది రోజులు ఆగండి.. ఆగస్టు 2025లో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ (Upcoming Phones August) కానున్నాయి. ఫ్లాగ్‌షిప్ ఫోన్ల నుంచి బడ్జెట్-ఫ్రెండ్లీ మోడళ్ల వరకు భారత మార్కెట్లో లాంచ్ కానున్న టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్, వివో V60, ఒప్పో K13 టర్బో సిరీస్, పోకో F7 అల్ట్రా, రెడ్‌మి 15C ఫోన్లు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ :
ఆగస్టు 20న గూగుల్ పిక్సెల్ 10 లైనప్‌ను ఆవిష్కరించేందుకు రెడీగా ఉంది. ఈ సిరీస్‌లో 4 వేరియంట్‌లు ఉంటాయి. పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, 10 ప్రో XL, 10 ప్రో ఫోల్డ్ రానున్నాయి. ఈ పిక్సెల్ ఫోన్ల ధరలు రూ. 79,999 నుంచి రూ. 1,79,999 వరకు ఉండవచ్చు.
వివో V60 :
ఆగస్టు 12న వివో V60ని లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. 6.67-అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌తో రావచ్చు. ఈ వివో ఫోన్ ధర భారత మార్కెట్లో రూ.40వేల కన్నా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
ఒప్పో K13 టర్బో సిరీస్ :
ఆగస్టు 15 నుంచి ఆగస్టు 20 మధ్య ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రోలను లాంచ్ చేయనుంది. ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్, RGB లైటింగ్ వంటి ఫీచర్లతో ఒప్పో K13 రూ.25వేల కన్నా తక్కువ ధరకు లాంచ్ కానుంది. అలాగే, ఒప్పో టర్బో ప్రో ధర రూ.30వేల కన్నా తక్కువగా ఉండొచ్చు.
పోకో F7 అల్ట్రా :
పోకో F7 అల్ట్రా ఆగస్టు చివరి నాటికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 599 డాలర్లు (రూ. 51వేలు) ధరతో లాంచ్ అయింది. భారత మార్కెట్లో 12GB + 256GB వేరియంట్ ధర దాదాపు రూ. 55వేల నుంచి రూ. 60వేల వరకు ఉండవచ్చు.
రెడ్‌మి 15C :
రెడ్‌మి 15C ఫోన్ ఆగస్టు మధ్యలో భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు. ఈ ఫోన్ హెలియో G81 చిప్‌సెట్, 4GB ర్యామ్, 6000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఉండవచ్చు.