Top Upcoming Smartphones : ఫిబ్రవరి 2025లో రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు.. ఐక్యూ నియో 10ఆర్ నుంచి షావోమీ 15 సిరీస్ వరకు.. ఫుల్ లిస్టు ఇదిగో!

Top Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మరికొద్దిరోజులు ఆగండి.. వచ్చే ఫిబ్రవరిలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. టాప్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.  

Upcoming Smartphones in February 2025

Upcoming Smartphones in February 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో వచ్చే ఫిబ్రవరి 2025లో అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త మోడల్ ఫోన్లను లాంచ్ చేయనున్నాయి. ఈ నెలలో ఇప్పటికే కొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేశాయి. అందులో బ్యాటరీలు, కెమెరాలు, ఏఐ ప్రాసెసింగ్, పర్ఫార్మెన్స్ పరంగా ఆకర్షణీయంగా ఉండగా, వీటికి పోటీగా వచ్చే నెలలో నెక్స్ట్ జనరేషన్ అప్‌గ్రేడ్‌లను చూడవచ్చు.

జనవరి 2025లో, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్, పోకో ఎక్స్7 సిరీస్, రియల్‌మి 13ప్రో సిరీస్, వన్‌ప్లస్ 3 సిరీస్‌లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అన్నీ ఫోన్లలో పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్, ఏఐ ఫీచర్‌లు, మెరుగైన కెమెరాలను అందించాయి. అందులో ఐక్యూ నియో 10R, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్‌డీ వంటి కొన్ని కొత్త మోడల్స్ ఉంటాయని పలు నివేదికలు ధృవీకరించాయి.

Read Also : Best 5G Gaming Phones : కొత్త ఫోన్ కావాలా భయ్యా.. ఈ జనవరిలో టాప్ 5 బెస్ట్ 5జీ గేమింగ్ స్మార్ట్‌ఫోన్లు.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

అలాగే, నథింగ్ ఫోన్ 3, రియల్‌మి నియో 7, షావోమీ 15 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06, శాంసంగ్ గెలాక్సీ ఎం06, షావోమీ 15 అల్ట్రా ఫోన్, వివో వి50 సిరీస్ వంటి కొన్ని ఇతర ఫోన్లు కూడా భారత మార్కెట్లో ఫిబ్రవరి 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వివిధ బ్రాండ్‌లు కొత్త స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, డిజైన్ అప్‌గ్రేడ్‌లతో నెక్స్ట్-జెన్ స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఫోన్లలో బ్యాటరీలు పెద్దవిగా ఉంటాయని, మిడ్ రేంజ్ విభాగంలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.

భారత్‌లో ఐక్యూ నియో 10ఆర్ లాంచ్ తేదీ :
భారత మార్కెట్లో ఐక్యూ త్వరలో కొత్త నియో 10ఆర్‌ని మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో విడుదల చేయనుంది. 80 లేదా 90W ఫాస్ట్ ఛార్జింగ్, 144Hz డిస్‌ప్లేకు సపోర్టు ఇచ్చే 6,400mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఐక్యూ నియో 10ఆర్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 అని పుకారు ఉంది. ఈ ఐక్యూ ఫోన్ 1.5 నుంచి 1.7 మిలియన్ (AnTuTu) స్కోర్‌లతో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందించవచ్చు. ఈ ఐక్యూ ఫోన్ ధర దాదాపు రూ. 30వేలు ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ ఫిబ్రవరిలో భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు.

రియల్‌మి నియో 7 లాంచ్ తేదీ :
డిసెంబర్ 2024లో చైనాలో రియల్‌మి నియో 7 లాంచ్ అయింది. త్వరలో భారత మార్కెట్లోకి కూడా ఈ కొత్త ఫోన్ రానుంది. 7,000mAh బ్యాటరీ, గరిష్టంగా 16జీబీ ర్యామ్, 50ఎంపీ+8ఎంపీ బ్యాక్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 1టీబీ వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది. రియల్‌మి నియో 7 ఫిబ్రవరి 2025లో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

భారత్‌లో రియల్‌మి P3 ప్రో లాంచ్ తేదీ :
రియల్‌మి P3 ప్రో కనిష్టంగా 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే నెలలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ కలర్ ఆప్షన్లలో నెబ్యులా గ్లో, గెలాక్సీ పర్పుల్, సాటర్న్ బ్రౌన్ ఉన్నాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 710 AIE మొబైల్ ప్రాసెసర్‌తో రావచ్చు. అంతేకాదు.. రాబోయే ఈ కొత్త ఫోన్ రూ. 20వేల ధర పరిధిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ M06, శాంసంగ్ గెలాక్సీ F06 లాంచ్ తేదీ :
శాంసంగ్ గెలాక్సీ ఎం06, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. అయితే, ఈ ఫోన్ లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. పుకార్ల ప్రకారం.. ఈ రెండు ఫోన్లు 6.7-అంగుళాల డిస్‌ప్లే, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెకండరీ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించే అవకాశం ఉంది. ఈ రెండు ఫోన్లు ఫిబ్రవరి 2025లో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

భారత్‌లో నథింగ్ ఫోన్ 3 లాంచ్ తేదీ :
భారత మార్కెట్లో ఏఐ ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3 రానుంది. అదే గ్లిఫ్ లైట్ బ్యాక్‌గ్రౌండ్ డిజైన్‌తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ బ్యాక్ 2 కెమెరాలు, ఒక సెల్ఫీ కెమెరాతో రావచ్చు. ఈ నథింగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ద్వారా పవర్ అందించవచ్చు. 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ నథింగ్ ఫోన్ 3 మోడల్ రూ. 30వేల నుంచి రూ. 40వేల ధర పరిధిలో ఉండవచ్చని అంచనా.

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై ఒకే ఐఫోన్‌లో మల్టీపుల్ అకౌంట్లను యాక్సస్ చేయొచ్చు..!

భారత్‌లో షావోమీ 15 సిరీస్ లాంచ్ తేదీ :
షావోమీ 15 సిరీస్ గత ఏడాది చైనాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీతో లాంచ్ కానుంది. షావోమీ 15, షావోమీ 15 ప్రో మోడల్‌లను లైకా-పవర్డ్ కెమెరా సెటప్‌తో గత ఏడాది మాదిరిగానే రానున్నాయి. షావోమీ 15 సిరీస్ ఫిబ్రవరి 2025 నాటికి వస్తుందని అంచనా. కానీ ఇంకా ఆలస్యం కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు మించి, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్‌డీ ఇండియా లాంచ్ జనవరి 28, 2025న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

టెక్నో, ఐటెల్, లావా సహా ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలు రాబోయే నెలల్లో బడ్జెట్, మిడ్ రేంజ్ కేటగిరీలలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కూడా ప్రవేశపెట్టనున్నాయి. అంతేకాకుండా, ఈ ఏడాదిలో ఐఫోన్ 17, ఐఫోన్ 17ప్రో, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ సహా, ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 2024లో లాంచ్ అయ్యాయి. రియల్‌మి నార్జో 80 సిరీస్ కూడా 2025 ద్వితీయర్థంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.