WhatsApp New Feature : వాట్సాప్‌లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై ఒకే ఐఫోన్‌లో మల్టీపుల్ అకౌంట్లను యాక్సస్ చేయొచ్చు..!
WhatsApp New Feature : ఐఓఎస్ కోసం వాట్సాప్ మల్టీ అకౌంట్ సపోర్టుతో మల్టీ అకౌంట్ డివైజ్ సపోర్టు అందించనుంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో వాట్సాప్ అకౌంట్ల మధ్య సులభంగా మారవచ్చు.

WhatsApp for iOS Testing Multi-Account Support
WhatsApp New Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. యూజర్లను ఆకట్టకునేందుకు వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకురానుంది. ఫీచర్ ట్రాకర్ క్లెయిమ్‌ల ప్రకారం.. ఒకే డివైజ్‌లో మల్టీ అకౌంట్లను యాక్సస్ చేసేందుకు వినియోగదారులను అనుమతించనుంది.
ప్రస్తుతం iOS యాప్ యూజర్ల కోసం వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ అకౌంట్ ఒకే ఫోన్‌పై ఆపరేట్ చేసేందుకు అనుమతించనుంది. వివిధ అకౌంట్లలతో మల్టీ డివైజ్‌లు వాడటం లేదా ఐఓఎస్ కోసం వాట్సాప్ సరికొత్త వెర్షన్ల వినియోగాన్ని తగ్గించనుంది. ఇందులో భాగంగానే మల్టీ అకౌంట్ ఫీచర్ ద్వారా మల్టీ అకౌంట్ డివైజ్ సపోర్టు అందించనుంది.
పర్సనల్ లేదా బిజినెస్ ఏదైనా :
ఈ కొత్త ఫీచర్ సాయంతో వినియోగదారులు సాధారణ యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) ఎంపికతో విభిన్న వాట్సాప్ అకౌంట్ల మధ్య మారవచ్చు. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ (WABetaInfo) ప్రకారం.. మెటా ప్లాట్‌ఫారమ్‌ల మెసేజింగ్ క్లయింట్ యాప్ ఫ్యూచర్ వెర్షన్‌లో రిలీజ్ చేసేందుకు మల్టీ అకౌంట్ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ఐఓఎస్ బీటా యాప్ వెర్షన్ 25.2.10.70 కోసం వాట్సాప్‌లో గుర్తించింది.
పేరు సూచించినట్లుగా.. పర్సనల్ లేదా బిజినెస్ అయినా ఒకే ఐఫోన్‌లో మల్టీ వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేసేందుకు వినియోగదారులను అనుమతించనుంది. ఫీచర్ ట్రాకర్ ద్వారా షేర్ చేసిన స్క్రీన్‌షాట్ యాప్ సెట్టింగ్‌లలో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని సూచిస్తుంది. ఇక్కడ వినియోగదారులు కొత్త వాట్సాప్ అకౌంట్లను యాడ్ చేయలేరు. కానీ, రెండు వాట్సాప్ అకౌంట్ల మధ్య మారడానికి యాప్ రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
ఐఫోన్ బీటా టెస్టర్లు యాక్సస్ చేయలేరు :
ప్రస్తుతం, వినియోగదారులు ఇప్పటికీ ఒకే ఐఫోన్‌లో మల్టీ వాట్సాప్ అకౌంట్లను ఉపయోగిస్తున్నారు. అందులో ఒకటి సాధారణంగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇందులో ఏ బిజినెస్ అకౌంట్లను వాడకపోయినా తమ ఫోన్లలో ఉంటాయి. డబ్ల్యూఏబీటాఇన్ఫో (WABetaInfo) ప్రకారం.. ప్రస్తుతం ఈ కొత్త ఫంక్షనాలిటీ ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉందని, ఆపిల్ టెస్ట్ ఫ్లయిట్ ప్రోగ్రామ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న బీటా టెస్టర్‌లకు కూడా ప్రస్తుతం యాక్సెస్ ఉండదని సూచిస్తుంది.
WhatsApp Multi-Account Support Coming to iOS
• WhatsApp is expanding its multi-account support feature, initially tested on Android, to iOS devices with the latest iOS update, version 25.2.10.70, allowing users to manage multiple accounts within a single app.
• This new… pic.twitter.com/KRmtGReemc
— MD Engineer (@mdengineer_) January 26, 2025
ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ ఇదిగో :
రాబోయే కొన్ని వారాల్లో ఐఓఎస్ బీటా యూజర్ల కోసం మరిన్ని వాట్సాప్ ఫీచర్లను విడుదల చేయనుంది. ముఖ్యంగా, ఇదే విధమైన ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.17.8 కోసం వాట్సాప్ బీటాలో గుర్తించారు. గూగుల్ పే బీటా ప్రోగ్రామ్ ద్వారా రిజిస్టర్ చేసిన బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. ఏదేమైనప్పటికీ, ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వివిధ ప్లాట్‌ఫారమ్‌ల కోసం అనేక కొత్త ఫీచర్‌లపై పనిచేస్తోంది. అవన్నీ పబ్లిక్ రిలీజ్‌లో ఉండవని గమనించడం చాలా ముఖ్యం.
కొత్త అప్‌డేట్‌తో, వాట్సాప్ యూజర్లు కొత్త ప్రైమరీ అకౌంట్ సెటప్ చేసే అవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా ఇప్పటికే ఉన్న లింక్ చేయవచ్చు. ఈ డ్యూయల్ మెథడ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. మల్టీ డివైజ్‍లు లేదా అదనపు యాప్‌ల అవసరం లేకుండా వినియోగదారులు వారి అవసరాలకు అత్యంత అనుకూలమైన విధానాన్ని ఎంచుకునేందుకు అనుమతిస్తుంది.
ప్రతి అకౌంట్ సొంత నోటిఫికేషన్‌లు, చాట్‌లు, బ్యాకప్‌లు, సెట్టింగ్‌లను మేనేజ్ చేస్తుంది. మరింత ప్రైవసీని నిర్ధారిస్తుంది. ఇకపై ఒక సిమ్ వాట్సాప్‌కి మరో సిమ్ వాట్సాప్ బిజినెస్‌కు ఎంచుకోవాల్సిన చేయాల్సిన అవసరం లేదు. డ్యూయల్ సిమ్ వినియోగదారులకు ఈ కొత్త ప్రత్యేకంగా ఉంటుంది. ప్రైమరీ యాప్‌లోనే మల్టీ అకౌంట్లను ఈజీగా యాక్సస్ చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా, వాట్సాప్ యాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.