Upcoming Smartphones : జూన్‌లో రాబోయే 10 కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే ఫోన్లు ఉన్నాయంటే? ఫుల్ డిటెయిల్స్..!
Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. వచ్చే జూన్‌లో 10 స్మార్ట్‌ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో రానున్నాయి. ఫుల్ లిస్ట్ మీకోసం..

Upcoming Smartphones
Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల (Upcoming Smartphones )స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే నెలలో మరిన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి.
ఈ ఫోన్లలో ప్రధానంగా వన్ ప్లస్, ఒప్పో, షావోమీ, నథింగ్ వంటి బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లతో రానున్నాయి. స్మార్ట్ ఏఐ, ఫాస్ట్ చిప్‌లు ఉన్నాయి.
Read Also : iPhone 16 Pro : ఐఫోన్ 16ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఇలా చేస్తే తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు..!
గేమింగ్, ఫోటోగ్రఫీతో పాటు ఫోల్డబుల్ ఫోన్లు ఉండనున్నాయి. జూన్‌లో లాంచ్ కాబోయే 10 స్మార్ట్‌ఫోన్‌లను ఓసారి వివరంగా పరిశీలిద్దాం.
1. వన్‌ప్లస్ 13s :
వన్‌ప్లస్ 13s అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 1.5K 120Hz OLED 6.32-అంగుళాల డిస్‌ప్లే, 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇందులో వన్‌ప్లస్ ఏఐ సూట్+ కూడా ఉంది. వచ్చే జూన్‌లో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
2. షావోమీ మిక్స్ ఫ్లిప్ 2 :
ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తుంటే.. షావోమీ మిక్స్ ఫ్లిప్ 2 అత్యంత ఆకర్షణగా ఉంటుంది.లోపల ఫోల్డ్ చేస్తే.. LTPO OLEDతో 6.85-బై-1-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ ఉన్నాయి.
లోపలి సైడ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఫోల్డ్ అవుతుంది. బ్యాక్-ఎండ్‌లో రెండు 50MP లెన్స్‌లు ఉన్నాయి. 67W ఛార్జింగ్‌తో 5100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. జూన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
3. ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G :
ఇన్ఫినిక్స్ జీటీ 30 ప్రో 5G ఫోన్ గేమింగ్ సామర్థ్యాలతో లాంచ్ కానుంది. ఇందులో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ వంటివి ఉన్నాయి.
ఇందులో 108MP మెయిన్ కెమెరా, 5500mAh బ్యాటరీ, 45W వద్ద వైర్డ్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ 10 కస్టమైజడ్ LED లైటింగ్ మోడ్‌లతో కూడా వస్తుంది. వచ్చే జూన్ 3న ఈ ఇన్ఫినిక్స్ GT 30ప్రో 5G లాంచ్ అవుతుంది
4. ఒప్పో రెనో 14 సిరీస్ :
ఒప్పో నుంచి రెనో 14, రెనో 14 ప్రో రెండు ఫోన్లలో రెడీగా ఉంది. ఈ ఫోన్లు జెమిని ఏఐ, అద్భుతమైన కెమెరా టెక్నాలజీ కలిగి ఉంది. ఏఐ ఫీచర్లు కూడా ఉండవచ్చు.
ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతాయి. కలర్ఓఎస్ 15 ఉంటుంది. అద్భుతమైన ఫొటోల కోసం ఈ ఫోన్ బెస్ట్ అని చెప్పొచ్చు. జూన్‌లో ఒప్పో రెనో 14 సిరీస్ లాంచ్ కానుంది
5. పోకో F7 5G :
పోకో మరోసారి F7 5Gతో వస్తోంది. రీబ్రాండెడ్ రెడ్‌మి టర్బో 4 ప్రోగా వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌పై రన్ అవుతుంది. 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
భారీ 7550mAh బ్యాటరీ కలిగి ఉంది. మంచి బ్యాటరీ లైఫ్‌తో గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వచ్చే జూన్ ప్రారంభంలో ఈ పోకో F7 5G ఫోన్ లాంచ్ కానుంది.
6. నథింగ్ ఫోన్ (3) : నథింగ్ నుంచి (Upcoming Smartphones ) మూడో జనరేషన్ ఫోన్ ఈ నెలలో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్, 6.67 అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 64MP మెయిన్ కెమెరాతో వస్తోంది. 100W ఫాస్ట్-ఛార్జింగ్ ఆప్షన్, 5,000mAh బ్యాటరీ కూడా ఉండనుంది.
7. సోనీ ఎక్స్‌పీరియా 1 VII :
సోనీ ఎక్స్‌పీరియా 1 VII ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. 6.5-అంగుళాల OLED HDR ప్యానెల్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ పొందుతుంది.
కెమెరా ఫీచర్ల విషయానికొస్తే.. ఏఐ ఆటో-ఫ్రేమింగ్, 48MP అల్ట్రావైడ్ లెన్స్ కలిగి ఉంది. డాల్బీ అట్మోస్ సౌండ్‌తో పాటు హై-రెస్ ఆడియో ప్లేబ్యాక్‌ను కలిగి ఉంది. జూన్ 4న సోనీ ఎక్స్‌పీరియా 1 VII ఫోన్ లాంచ్ అవుతుంది.
8. మోటోరోలా ఎడ్జ్ 2025 :
6.7-అంగుళాల సూపర్ HD pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ద్వారా పవర్ పొందుతుంది. 50MP కెమెరాను కలిగి ఉంటుంది.
ఏఐ కీ ద్వారా మోటో ఏఐ ఫీచర్లకు యాక్సెస్ లభిస్తుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. జూన్ 5న మోటోరోలా ఎడ్జ్ 2025 ఫోన్ లాంచ్ కానుంది.
9. ఆల్కాటెల్ V3 సిరీస్ :
అల్కాటెల్ V3 అల్ట్రా, V3 ప్రో, V3 క్లాసిక్ మోడళ్లను రిలీజ్ చేస్తోంది. భారత్‌లో ఫస్ట్ టైమ్ (NXTPAPER) డిస్‌ప్లే పేపర్ మాదిరిగా కనిపిస్తుంది. కళ్ళపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో దాదాపు రూ. 12,999 నుంచి ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే జూన్ 2న ఈ ఆల్కాటెల్ V3 సిరీస్ లాంచ్ కానుంది.
10. షిఫ్ట్‌ఫోన్ 8 :
షిఫ్ట్‌ఫోన్ 8 మోడల్ క్వాల్‌కామ్ QCM6490 ఆధారంగా రూపొందిన ఎకో ఫ్రెండ్లీ మాడ్యులర్ ఫోన్. IP67తో వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. షిప్ట్ Gmbh కంపెనీ నుంచి వచ్చింది. కెమెరా బీస్ట్‌లు, గేమింగ్ డిస్ట్రోలు కలిగి ఉంది. జూన్ 2025 నాటికి అందుబాటులోకి రానుంది.