Ayushman Card : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆయుష్మాన్ కార్డు కోసం ఇలా అప్లయ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
Ayushman Card : ఆయుష్మాన్ కార్డు కోసం అప్లయ్ చేసుకున్నారా? ఈ కార్డుకు ఎవరు అర్హులు.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. ఎలా అప్లయ్ చేయాలంటే?

Ayushman Card
Ayushman Card : సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి (Ayushman Card) జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద ప్రత్యేక ఆరోగ్య బీమాను అందిస్తోంది.
ఆయుష్మాన్ వే వందన కార్డు ద్వారా వృద్ధులకు ఆరోగ్యపరమైన సౌకర్యాలను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆయుష్మాన్ కార్డు పొందాలంటే ఏం కావాలి? అర్హతలేంటి? ఏయే ప్రయోజనాలు ఉన్నాయి.. ఎలా అప్లయ్ చేసుకోవాలి అనేది పూర్తి వివరంగా తెలుసుకుందాం..
ఆయుష్మాన్ కార్డుతో బీమా :
మీరు 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారైతే సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య కవరేజీకి అర్హులు. మీ జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రభుత్వ లేదా ఎంప్యానెల్డ్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు.
ఈ పథకం కింద మందులు, పరీక్షలు, ICU, సర్జరీలు మరిన్నింటితో సహా 27 స్పెషాలిటీలు, 1,961 మెడికల్ ప్రొసెజర్స్ అందిస్తుంది. వ్యక్తుల ఆదాయంతో సంబంధం ఉండదు.
రిటైర్మెంట్ (Ayushman Card )అయినా లేదా ఇప్పటికీ జాబ్ చేస్తున్నా లేదా స్థిరమైన ఆదాయం లేకపోయినా ఇప్పటికీ ఈ పథకం నుంచి ప్రయోజనం పొందవచ్చు. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? :
వయస్సు 70 ఏళ్లు పైబడిన ఎవరైనా ఈ కార్డుకు అర్హులు. ఆదాయంతో సంబంధం లేదు. ముఖ్యంగా వృద్ధులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
- గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఆయుష్మాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
- లబ్ధిదారుడి (beneficiary)గా లేదా ఆపరేటర్ (operator)గా లాగిన్ అవ్వండి.
- క్యాప్చా, మొబైల్ నంబర్, అథెంటికేషన్ మెథడ్ వంటి వివరాలను ఎంటర్ చేయండి.
- లబ్ధిదారుని రాష్ట్రం, ఆధార్ వివరాలను ఇవ్వండి.
- OTP ఆధారిత eKYC ప్రక్రియను పూర్తి చేయండి.
- వ్యక్తిగత వివరాలతో డిక్లరేషన్ ఫారమ్ సమర్పించండి.
- దరఖాస్తుదారుడి మొబైల్ నంబర్, OTP ఎంటర్ చేయండి.
- కేటగిరీ, పిన్ కోడ్ వంటి వివరాలను సమర్పించండి.
- కుటుంబ సభ్యుల గురించి సమాచారాన్ని ఇవ్వండి (వర్తిస్తే)
- ఒకసారి వెరిఫై పొందిన తర్వాత ఆయుష్మాన్ కార్డ్ యాప్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.