UPI Transaction Limit : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? గూగుల్ పే నుంచి పేటీఎం దాకా రోజుకు ఎంత డబ్బు పంపొచ్చు?

UPI Transaction Limit : ప్రతిరోజూ యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎం నుంచి యూపీఐ పేమెంట్స్ చేసే వినియోగదారులు ఇకపై పరిమితికి మించి చేయలేరు. రోజువారీ యూపీఐ లావాదేవీలపై పరిమితి గురించి ఇప్పుడు తెలుసుకోండి.

UPI Transaction Limit : ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్లకు భారత్‌లో గతంలో కన్నా ఇప్పుడు మరింత ప్రజాదరణ పెరిగింది. ఎన్‌సీపీఐ (NCPI) బ్యాంకుల నుంచి నిరంతరం దేశమంతటా యూపీఐ పేమెంట్లు జరుగుతున్నాయి. దాంతో చిరువ్యాపారుల నుంచి కస్టమర్‌లు నగదు లేకుండా చిన్నమొత్తంలో యూపీఐ ద్వారా ఈజీగా పేమెంట్లను చేసుకుంటున్నారు.

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ యాప్ ప్లాట్‌ఫారాలైనా గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ పే సహా ఇతర పాపులర్ యూపీఐ యాప్‌లతో సులభమైన యూజర్ ఇంటర్‌ఫేస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అందరూ ఈ యూపీఐ పేమెంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే, రోజంతా యూపీఐ సర్వీసులను ఉపయోగిస్తున్నప్పటికీ.. మీరు ఒక రోజులో యూపీఐ ద్వారా పరిమితికి మించి డబ్బులను పంపలేరని మీకు తెలుసా?

Read Also : Tech Tips in Telugu : గూగుల్ పే యూపీఐ లైట్.. UPI PIN లేకుండానే ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

సాధారణ యూపీఐ లావాదేవీ పరిమితి రోజుకు రూ. 1 లక్ష వరకు ఉంటుంది. 24 గంటల్లో రూ. 1 లక్ష కన్నా ఎక్కువ యూపీఐ పేమెంట్లను ఏ బ్యాంకు అనుమతించదు. అంతేకాదు.. మీరు ఒక రోజులో యూపీఐద్వారా బదిలీ చేయగల మొత్తం నగదు కూడా మీరు ఉపయోగిస్తున్న యాప్‌పై ఆధారపడి ఉంటుంది. అందులో గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎం సహా ప్రముఖ యాప్‌లలో ఒక్కోదానిపై ఒక్కోలా యూపీఐ లావాదేవీల పరిమితి ఉంటుంది. ఏయే డిజిటల్ యాప్‌లో రోజువారీ యూపీఐ లిమిట్ ఎంతవరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

పేటీఎం :
ఎన్‌పీసీఐ ప్రకారం.. పేటీఎం ఒక రోజులో రూ. 1 లక్ష వరకు మాత్రమే పేమెంట్ చేసేందుకు అనుమతిస్తుంది. అలా కాకుండా, యూపీఐ పేమెంట్ల విషయంలో పేటీఎంపై ఎలాంటి పరిమితి లేదని గమనించాలి.

daily UPI transaction limit

గూగుల్ పే :
గూగుల పే లేదా జీపే (GPay) వినియోగదారులు యూపీఐ ద్వారా ఒక్క రోజులో రూ. 1 లక్ష కన్నా ఎక్కువ నగదు పంపలేరు. అది కాకుండా, యాప్ వినియోగదారులను ఒక రోజులో 10 కన్నా ఎక్కువ లావాదేవీలు చేయడానికి అనుమతించదు. అంటే.. మీరు రూ. 1 లక్ష లావాదేవీ లేదా వివిధ మొత్తాలలో 10 లావాదేవీల వరకు చేయవచ్చు.

అమెజాన్ పే :
అమెజాన్ పే యూపీఐ ద్వారా రూ. 1 లక్ష వరకు పేమెంట్లు చేసేందుకు అనుమతిస్తుంది. ఈ యాప్ ఒక రోజులో 20 లావాదేవీలను అనుమతిస్తుంది. కొత్త వినియోగదారులు మొదటి 24 గంటల్లో రూ. 5వేల వరకు మాత్రమే లావాదేవీలు చేయగలరు.

ఫోన్‌పే :
ఫోన్‌పే పేమెంట్ యాప్‌లో కూడా గూగుల్ పేతో సమానమైన లావాదేవీ పరిమితులు ఉన్నాయి. వినియోగదారులు ఒక రోజుకు పేమెంట్ చేసే యూపీఐ పరిమితి రూ. 1 లక్ష ఉంటుంది. కానీ, యాప్‌లో ఒక రోజులో 10 లావాదేవీల పరిమితి లేదు. గంటల పరిమితి కూడా ఇందులో లేదని గమనించాలి. గూగుల్ పే, ఫోన్ పే రెండింటిలో ఎవరైనా రూ. 2వేల కన్నా ఎక్కువ మనీ రిక్వెస్ట్ పంపితే, యాప్ ఆ లావాదేవీని వెంటనే ఆపివేస్తుంది.

గూగుల్ పేలో మొబైల్ రీఛార్జ్‌లపై ఛార్జీలు :
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సర్వీసు ద్వారా మొబైల్ రీఛార్జ్ పేమెంట్లపై గూగుల్ పే అదనపు ఛార్జీలు విధిస్తోంది. ఇప్పటివరకూ వినియోగదారులు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల రీఛార్జ్ చేయడంతో పాటు బిల్లుల పేమెంట్లు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా చేసుకున్నారు. అయితే, ఇప్పటినుంచి గూగుల్ పేలో చేసే మొబైల్ రీఛార్జ్ పేమెంట్లపై అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ల్లో పేటీఎం, ఫోన్ పే సైతం ఇలానే అదనపు రుసుము విధిస్తున్నాయి. సెర్చ్ దిగ్గజం పేమెంట్ యాప్‌లో కన్వీనియన్స్ ఫీజులకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు.

గూగుల్ పే పేమెంట్ సర్వీసులో మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లపై రుసుమును వసూలు చేస్తోందని ఒక యూజర్ ఇటీవల ఆన్‌లైన్ ఫోరమ్‌లో నివేదించారు. యూజర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. జియో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌పై గూగుల్ పే యాప్ రూ. 3 కన్వీనియన్స్ ఫీజు విధించింది. స్క్రీన్‌షాట్ కన్వీనియెన్స్ రుసుము జీఎస్టీని కలిగి ఉంది. యూపీఐ, ఇతర కార్డుల లావాదేవీలపై కూడా రుసుము చెల్లించాల్సి ఉంటుందని యూజర్ తెలిపాడు.

Read Also : Tech Tips in Telugu : BHIM యూపీఐ ద్వారా UPI PIN రీసెట్ చేసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు