Tech Tips in Telugu : గూగుల్ పే యూపీఐ లైట్.. UPI PIN లేకుండానే ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
Google Pay UPI Lite : గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్.. గూగుల్ పే (Google Pay) UPI Lite ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో (UPI PIN)ని ఎంటర్ చేయకుండానే సులభంగా పేమెంట్లు చేసుకోవచ్చు.

Google Pay introduces UPI Lite, now allows users to make payments without UPI PIN
Google Pay UPI Lite : ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే (Google Pay) ఎట్టకేలకు తమ ప్లాట్‌ఫారమ్‌లో UPI Lite వెర్షన్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ చిన్న మొత్తంలో పేమెంట్లను వేగంగా పూర్తి చేసేందుకు అనుమతిస్తుంది. UPI లైట్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన డిజిటల్ పేమెంట్ సర్వీసు, సెప్టెంబర్ 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. వినియోగదారులు తమ UPI లైట్ అకౌంట్ నుంచి ఒక్కసారి ప్రెస్ చేయడం ద్వారా రూ. 200 వరకు డబ్బును పంపేందుకు అనుమతిస్తుంది. అయితే, గూగుల్ పేలో యూపీఐ PINని ఎంటర్ చేయాల్సిన పనిలేదు. నిత్యావసర వస్తువులైన కిరాణా సామాగ్రి, స్నాక్స్, క్యాబ్ రైడ్‌లకు త్వరిత పేమెంట్లు చేయడానికి UPI లైట్ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పుడు UPI లైట్‌తో డిజిటల్ పేమెంట్లను చాలా వేగంగా పూర్తి చేయడమే కంపెనీ లక్ష్యమని గూగుల్ పే పేర్కొంది. గూగుల్ పేలో UPI లైట్ రూపొందించింది. ఇందులో వినియోగదారులు UPI పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే సింగిల్ క్లిక్‌తో UPI లావాదేవీలను చేసేందుకు వీలు కల్పిస్తుంది. LITE అకౌంట్ యూజర్ బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. కానీ, రియల్ టైమ్ జారీ చేసే బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌పై ఆధారపడదు. గరిష్ట లావాదేవీల సమయంలో కూడా (UPI LITE) అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.
యూపీఐ లైట్ అకౌంట్ రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2వేల వరకు లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు..వినియోగదారులు రూ. 200 వరకు ఇన్‌స్టంట్ యూపీఐ లావాదేవీలను నిర్వహించడానికి అనుమతిస్తుంది. యూపీఐ లైట్ ద్వారా తక్కువ లావాదేవీ వివరాలతో బ్యాంక్ పాస్‌బుక్ పొందవచ్చు. యూపీఐ లైట్ పోటీదారులైన (Paytm), (PhonePe) ప్లాట్‌ఫారమ్ యాప్‌లలో అదే ఫీచర్‌ను రిలీజ్ చేశాయి. ముఖ్యంగా, ప్రస్తుతం 15 బ్యాంకులు రాబోయే నెలల్లో మరిన్ని బ్యాంకులతో UPI LITEకి సపోర్టు అందించనున్నాయి.

Google Pay introduces UPI Lite, now allows users to make payments without UPI PIN
గూగుల్ నుంచి VP ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ అంబరీష్ కెంఘే మాట్లాడుతూ.. ‘గూగుల్ పేలో యూపీఐ ఉపయోగాన్ని పెంపొందించడంలో NPCI, RBIతో పాటు భారత ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండటం విశేషం. ప్రత్యేక ఆఫర్‌లు, దేశంలో డిజిటల్ పేమెంట్లను మరింతగా పెంచుతాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో UPI LITE కాంటాక్టు వినియోగదారులకు అనుకూలమైన కాంపాక్ట్, సూపర్‌ఫాస్ట్ పేమెంట్ల ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. చిన్న మొత్తంలో లావాదేవీలను సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని పేర్కొన్నారు.
గూగుల్ పేలో UPI Lite ఎలా యాక్టివేట్ చేయాలి? :
గూగుల్ పే యూజర్లు ఎలాంటి KYC అథెంటికేషన్ లేకుండా సాధారణ ప్రక్రియ ద్వారా యూపీఐ లైట్ ఫీచర్‌ని సులభంగా యాక్టివేట్ చేయవచ్చు. గూగుల్ పేలో UPI లైట్‌ని యాక్టివేట్ చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించవచ్చు.
* మీ మొబైల్ డివైజ్‌లో గూగుల్ పేలో యాప్‌ని ఓపెన్ చేయండి.
* సాధారణంగా స్క్రీన్ రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న ప్రొఫైల్ ఐకాన్ లేదా మీ ప్రొఫైల్ ఫొటోను గుర్తించి Tap చేయండి. మీ ప్రొఫైల్ పేజీ ఓపెన్ అవుతుంది.
* మీ ప్రొఫైల్ పేజీలో ‘UPI Lite’ యాక్టివేషన్ ఆప్షన్ కోసం కిందికి స్క్రోల్ చేయండి. లేదా నావిగేట్ చేసి దానిపై నొక్కండి.
UPI LITE గురించి సూచనలు, వివరాలతో కొత్త స్క్రీన్ లేదా విండో కనిపిస్తుంది. అందించిన సమాచారాన్ని చదవండి. యూపీఐ లైట్ యాక్టివేట్ చేసేందుకు ఆప్షన్ Tap చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం లేదా మీ వివరాలను ధృవీకరించడం వంటి లింక్ ప్రాసెస్ ద్వారా గూగుల్ పే మార్గనిర్దేశం చేస్తుంది. ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలో అవ్వండి. ప్రాంప్ట్ అయ్యే అవసరమైన డేటాను ఎంటర్ చేయండి. లింకింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత UPI LITE విజయవంతంగా యాక్టివ్ అయిందని సూచించే Confirm మెసేజ్ లేదా నోటిఫికేషన్‌ను పొందవచ్చు. మీ యూపీఐ లైట్ అకౌంట్ ఫండ్స్ యాడ్ చేయొచ్చు. గూగుల్ పే యాప్‌ని ఓపెన్ చేసి.. యూపీఐ లైట్ సెక్షన్ లేదా వ్యాలెట్ నావిగేట్ చేయండి.
ఫండ్స్ యాడ్ చేసేందుకు ఆప్షన్ నొక్కండి. గరిష్టంగా రూ. 2వేల వరకు కావలసిన మొత్తాన్ని ఎంటర్ చేయండి. లావాదేవీని నిర్ధారించిన తర్వాత Continue బటన్‌పై క్లిక్ చేయండి. మీ యూపీఐ లైట్ అకౌంట్ బ్యాలెన్స్‌కు Funds యాడ్ అవుతాయి. మీ UPI Lite అకౌంట్లో ఫండ్స్ యాడ్ చేసేందుకు గరిష్టంగా రోజుకు పరిమితి రూ. 4వేలు మాత్రమేనని గుర్తుంచుకోండి. అదనంగా, రూ. 200కి సమానమైన లేదా అంతకంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు UPI Lite అకౌంట్ డిఫాల్ట్‌గా సెట్ అవుతుంది. అలాంటి లావాదేవీల కోసం UPI PIN ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.