Infinix Hot 30 5G Launch : భారీ బ్యాటరీతో ఇన్ఫినిక్స్ హాట్ 30 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంత? ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనాల్సిందే..!

Infinix Hot 30 5G Launch : భారీ బ్యాటరీతో సరికొత్త ఇన్ఫినిక్స్ 5G ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.

Infinix Hot 30 5G Launch : భారీ బ్యాటరీతో ఇన్ఫినిక్స్ హాట్ 30 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంత? ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనాల్సిందే..!

Infinix Hot 30 5G with 6000mAh battery launched in India

Updated On : July 14, 2023 / 9:52 PM IST

Infinix Hot 30 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇన్ఫినిక్స్ (Infinix) స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రూ. 15వేల లోపు ధరలో Infinix Hot 30 5Gని కంపెనీ లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ (6000mAh), 120Hz డిస్‌ప్లేతో ఈ 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ MediaTek Dimensity 5G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. కొత్తగా లాంచ్ చేసిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ఓసారి పరిశీలిద్దాం. 8GB+8GB ఎక్స్‌ప్యాండబుల్ RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే యూజర్ల కోసం ఈ ఫోన్ భారీ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 30 5G లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగిన సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ పేర్కొంది.

ఇన్ఫినిక్స్ హాట్ 30 5G ధర, బ్యాంక్ ఆఫర్లు :
Infinix కొత్త హాట్ 30 ఫోన్ రెండు వేరియంట్‌లలో లాంచ్ చేసింది. 4GB RAM (4GB ఎక్స్‌పాండబుల్ ఆప్షన్‌), 128GB ఇంటర్నల్ స్టోరేజ్, మరో 8GB RAM (8GB ఎక్స్‌పాండబుల్ ఆప్షన్‌తో), 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. స్మార్ట్‌ఫోన్ బేస్ 4GB వేరియంట్ ధర రూ.12,499 కాగా, హై వేరియంట్ ధర రూ.13,499గా ఉంది.

Read Also : Twitter Users Earn Money : మస్క్ మామ మంచోడే.. ట్విట్టర్ డబ్బులు ఇస్తోంది.. యూజర్లకు ఈ అర్హతలు ఉంటే చాలు.. ఎంత సంపాదించవచ్చు?

లాంచ్ ఆఫర్‌లో భాగంగా, ఇన్ఫినిక్స్ బ్యాంక్ ఆఫర్, 6 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్‌తో రూ.1000 స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇన్ఫినిక్స్ హాట్ 30 5G అరోరా బ్లూ, నైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 30 సేల్ ఈ-కామర్స్ సైట్ (Flipkart)లో జూలై 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇన్పిఫిక్స్ హాట్ 30 5G స్పెసిఫికేషన్స్ :
ఇన్పిఫిక్స్ (Infinix Hot 30 5G) ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. Hot 30 కంపెనీ లేటెస్ట్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్ XOS 13పై రన్ అవుతుంది. Android 13పై ఆధారపడి ఉంటుంది. ఇన్ఫినిక్స్ 2ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్, ఒక ఏడాది Android అప్‌గ్రేడ్‌లను కూడా అందిస్తుంది. హార్డ్‌వేర్ ముందు, డివైజ్ 8GB RAM వరకు సపోర్టు, 8GB ఎక్స్ ప్యాండబుల్ ఆప్షన్‌తో MediaTek డైమెన్సిటీ 6020 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

Infinix Hot 30 5G with 6000mAh battery launched in India

Infinix Hot 30 5G with 6000mAh battery launched in India

ఈ ఫోన్ డ్యూయల్ స్పీకర్లు, DTS సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. మ్యూజిక్, వీడియోలు, గేమింగ్ మెరుగైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇన్ఫినిక్స్ హాట్ 30 5G ఫోన్ 18W టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ పవర్ మారథాన్ టెక్‌ని కలిగి ఉంది. స్టాండ్‌బై మోడ్‌లో 53 గంటల కాలింగ్, 21 గంటల వీడియో స్ట్రీమింగ్, 13 గంటల గేమింగ్, 35 రోజుల బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుందని పేర్కొంది.

కెమెరా ముందు ఇన్ఫినిక్స్ Hot 30 5G ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాతో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. క్వాడ్-LED ఫ్లాష్, 2K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. LED ఫ్లాష్‌తో కూడిన 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ పరంగా చూస్తే.. Infinix Hot 30 5G డ్యూయల్ 5G SIM కార్డ్‌లకు సపోర్టు ఇస్తుంది. దాదాపు 14 5G బ్యాండ్‌లకు సపోర్టు ఇస్తుంది.

Wi-Fi, బ్లూటూత్, టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అదనంగా, ఈ ఫోన్ స్ప్లాష్ నిరోధకతకు IP53 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ Hot 30 5G NFC పేమెంట్ ఫీచర్‌ను కలిగి ఉంది. వినియోగదారులు ఒకే ట్యాప్‌తో పేమెంట్లు చేసేందుకు వీలు కల్పిస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఫేస్ అన్‌లాక్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : Amazon Prime Day Deals : స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్.. అమెజాన్ నుంచి విజయ్ సేల్స్.. ఏ ప్లాట్‌ఫారంలో ఏ ఫోన్ ధర ఎంత ఉందంటే?