Vi Revises Rs 409 And Rs 475 Prepaid Recharge Plans Check Details
Vodafone Idea : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ. 500లోపు రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను సవరించింది. రూ. 409, రూ. 475 ప్రీపెయిడ్ ప్యాక్స్‌ను హైడేటాతో అందిస్తోంది. మిగిలిన డేటా బెనిఫిట్స్ ఒకేలా ఉండనున్నాయి. టెలికాం దిగ్గజం ఇతర కాల్, SMS బెనిఫిట్స్‌తో ఎక్కువ డేటాను అందించనుంది. కొత్త Vi ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లకు సంబంధించి వివరాలను వెల్లడించింది.
Vi రూ.409 ప్రీపెయిడ్ ప్లాన్ :
కొత్త Vi రూ. 409 ప్రీపెయిడ్ ప్లాన్ 3.5GB రోజువారీ డేటాతో అందిస్తోంది. యూజర్లు నెలవారీ ప్రాతిపదికన 98GB డేటా పొందవచ్చు. యూజర్లు రోజుకు 100 SMSలు, ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. మీరు అందించిన SMS బెనిఫిట్స్ పూర్తికాగానే.. లోకల్ SMSలకు రూ. 1, STD SMSలకు రూ.1.5 ఛార్జ్ చేస్తుంది. కొత్త Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లలో అర్ధరాత్రి 12:00AM నుంచి ఉదయం 6:00AM వరకు ఉచిత డేటా అందిస్తోంది. అదే సమయంలో డేటా లిమిట్ లేదు. Vi మూవీలు, TV యాప్‌కి కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ వారాంతపు డేటా సపోర్ట్ చేస్తుంది. మీరు Vi ధర రూ. 409 రీఛార్జ్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన రోజు నుంచి 28 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది.
Vi Revises Rs 409 And Rs 475 Prepaid Recharge Plans Check Details
Vi రూ 475 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
రూ. 475 Vi ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కస్టమర్‌లు ఎక్కువ డేటాను పొందవచ్చు. మిగిలిన బెనిఫిట్స్ ఒకే విధంగా ఉంటాయి. రోజుకు 100 SMS, 4GB రోజువారీ డేటాను అందిస్తుంది. SMS లిమిట్ దాటితే SMS ఛార్జీలు వర్తిస్తాయి. Vi ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్ బెనిఫిట్స్ అందిస్తుంది. టెలికాం దిగ్గజం Vi మూవీలు, టీవీ యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రాత్రి డేటా, వారాంతపు డేటా రోల్‌ఓవర్ డేటా బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Vi నుంచి కొత్తగా ప్రీపెయిడ్ ప్యాక్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
Read Also : Netflix Subscription Plan : మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ యాడ్ సపోర్టెడ్ ప్లాన్..!