Vijay Sales Valentine’s Day Deals : విజయ్ సేల్స్ వాలెంటైన్స్ డే డీల్స్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు..!
Vijay Sales Valentine's Day Deals : విజయ్ సేల్స్ వాలెంటైన్స్ డే సేల్‌తో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఆడియో ప్రొడక్టులు, అనేక స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vijay Sales Valentine's Day deals _ massive discounts on smartphones
Vijay Sales Valentine’s Day Deals : విజయ్ సేల్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా అనేక రకాల ప్రొడక్టులపై ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది. ఈ సేల్‌లో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, బార్డ్ ట్రిమ్మర్లు మరిన్నింటిపై తగ్గింపు అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి లేటెస్ట్ గాడ్జెట్‌ల వరకు కస్టమర్‌లు తమ ప్రియమైనవారికి బహుమతిగా అందించవచ్చు.
ముందుగా రెడ్‌మి 13సి 5జీ స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన ధర రూ. 10,999 వద్ద అందుబాటులో ఉంది. టెక్ ప్రియులు ఆపిల్ ఐప్యాడ్ 9వ జనరేషన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ సహా ధర రూ. 27,900కు పొందవచ్చు. మీ ప్రియమైనవారికి ఈ ఖరీదైన బహుమతిగా ఇవ్వొచ్చు. బోట్ ఇనిగ్మా ఆర్32 విమెన్ స్మార్ట్‌వాచ్ రూ. 3,199 ధరతో పొందవచ్చు.
పలు గాడ్జెట్లపై అదిరే డిస్కౌంట్లు :
అసూస్ మొబైల్ ROG 6 5జీ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 77,999 నుంచి రూ. 47,999కి తగ్గింపుతో పొందవచ్చు. బోట్ (Rockerz) 551 ఏఎన్‌సీ హెడ్‌ఫోన్ రూ.2,799 వద్ద కొనుగోలు చేయొచ్చు. రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్‌లో రూ. 999, ఫిలిప్స్ వన్ బ్లేడ్ బీయర్డ్ ట్రిమ్మర్ రూ. 1,199 ఉండగా, ఫిలిప్స్ 1000 సిరీస్ బాడీ ట్రిమ్మర్ రూ. 1,129 ధరకు ఆఫర్ అందిస్తోంది.
వేగా 3000 ఆల్ ఇన్ 1 హెయిర్ స్టైలర్ ధర రూ. 1,451, ఫిలిప్స్ 3000 సిరీస్ హెయిర్ డ్రైయర్ ధర రూ. 1,789పై కూడా సేల్ ఆఫర్ చేస్తోంది. ఫొటోగ్రఫీ ప్రియులు (Fujifilm) ఇన్‌స్టాక్స్ కెమెరాతో మంచి డీల్ పొందవచ్చు. ఇప్పుడు ఈ కెమెరా ధర రూ. 5,499కు కొనుగోలు చేయొచ్చు.

Vijay Sales Valentine’s Day deals
కేవలం రూ.6,699కే కొత్త ఫోన్లు :
విజయ్ సేల్స్ కొన్ని మొబైల్ ఫోన్‌లను రూ. 6,699 ధరకే అందిస్తోంది. టాబ్లెట్‌లను గరిష్టంగా 40శాతం తగ్గింపుతో, ఆడియో రేంజ్ రూ. 149 నుంచి పాపులర్ స్మార్ట్‌వాచ్‌లను రూ. 899 నుంచి అందిస్తోంది. ప్లేస్టేషన్ 5 కోసం సోనీ డ్యూయల్ సెన్స్ వైర్‌లెస్ కంట్రోలర్ గేమింగ్ డిలైట్ రూ. 5,790 వద్ద అందిస్తోంది.
8జీబీ ర్యామ్‌తో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1 చిప్ ల్యాప్‌టాప్‌తో సహా ల్యాప్‌టాప్‌లు రూ. 80,990కి పొందవచ్చు. హెచ్‌పీ 15ఎస్ ల్యాప్‌టాప్ (12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 1215యూ/8జీబీ ర్యామ్/512జీబీ ఎస్ఎస్‌డీ) తగ్గింపు ధర రూ. 39,990 వద్ద అందుబాటులో ఉంది.
అసూస్ ROG ఫోన్ 8 ప్రో 5జీ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 94,999 ఉండగా, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ రూ. 79,999 నుంచి ప్రారంభమవుతుంది. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో రియల్‌మి 12 ప్రో 5జీ, రెడ్‌మి నోట్ 13 5జీ, వన్‌ప్లస్ 12 5జీ ఉన్నాయి. వాలెంటైన్స్ డే సేల్ ఇప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.