Vivo Pad 3 Pro Launch : వివో ప్యాడ్ 3 ప్రో సరికొత్త టాబ్లెట్ ఇదిగో.. వివో TWS 4 సిరీస్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Vivo Pad 3 Pro Launch : ఈ కొత్త టాబ్లెట్‌తో పాటు, చైనీస్ కంపెనీ వివో టీడబ్ల్యూఎస్ 4 సిరీస్ రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్‌లను కూడా ఆవిష్కరించింది.

Vivo Pad 3 Pro Launch : వివో ప్యాడ్ 3 ప్రో సరికొత్త టాబ్లెట్ ఇదిగో.. వివో TWS 4 సిరీస్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Vivo Pad 3 Pro With MediaTek Dimensity 9300 SoC, Vivo TWS 4 Series Launched

Vivo Pad 3 Pro Launch : కొత్త ట్యాబ్ కొనేందుకు చూస్తున్నారా? చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో నుంచి సరికొత్త ప్యాడ్ 3 టాబ్లెట్ వచ్చేసింది. ఈ కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ గత ఏడాదిలో వివో ప్యాడ్ 2కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తుంది. మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

వివో ప్యాడ్ 3ప్రో 66డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 11,500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. వివో పెన్సిల్ 2 స్టైలస్‌కు సపోర్టు ఇస్తుంది. 8 స్పీకర్‌లతో కూడిన ఆడియో యూనిట్‌ను కలిగి ఉంది. ఈ కొత్త టాబ్లెట్‌తో పాటు, చైనీస్ కంపెనీ వివో టీడబ్ల్యూఎస్ 4 సిరీస్ రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్‌లను కూడా ఆవిష్కరించింది.

వివో ప్యాడ్ 3 ప్రో, వివో టీడబ్ల్యూఎస్ 4 సిరీస్ ధర ఎంతంటే? :
వివో ప్యాడ్ 3 ప్రో 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర సీఎన్‌వై 3,999 (దాదాపు రూ. 46వేలు), 12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ సీఎన్‌వై 3,599 (దాదాపు రూ. 41,500)గా ఉంటుంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ మోడల్ సీఎన్‌వై 3,299 (దాదాపు రూ. 38వేలు), 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ సీఎన్‌వై 2,999 (దాదాపు రూ. 34,500) ఉంటుంది.

Read Also : WhatsApp International Payments : వాట్సాప్ భారతీయ యూజర్ల కోసం అంతర్జాతీయ పేమెంట్లు.. ఇదేలా పనిచేస్తుందంటే?

ఈ డివైజ్ బో జియా జి(పర్పుల్), కోల్డ్ స్టార్ గ్రే (గ్రే), స్ప్రింగ్ టైడ్ బ్లూ (బ్లూ) కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. చైనాలో ఏప్రిల్ 3 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. వివో TWS 4 సిరీస్ మొత్తం 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ సీఎన్‌వై 399 (దాదాపు రూ. 4,600) ధరకు పొందవచ్చు. అయితే, వివో టీడబ్ల్యూఎస్ 4 హై-ఫై ధర సీఎన్‌వై 499 (సుమారు రూ. 5,500)తో డార్క్ బ్లూ, ఫార్ పీక్ వైట్ షేడ్స్‌లో లభ్యమవుతుంది.

వివో ప్యాడ్ 3 ప్రో స్పెసిఫికేషన్స్ :
వివో ప్యాడ్ ఆర్జిన్ఓఎస్ 4పై రన్ అవుతుంది. 30హెచ్‌జెడ్ నుంచి 144హెచ్‌జెడ్ వరకు అనుకూల రిఫ్రెష్ రేట్, 900నిట్స్ గరిష్ట ప్రకాశం, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 13-అంగుళాల (2,064×3,096 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ హెచ్‌డీఆర్10 సపోర్టును కూడా అందిస్తుంది. హుడ్ కింద వివో టాబ్లెట్ 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్ఓసీని కలిగి ఉంది. దానితో పాటు 16జీబీ (LPDDR5X) ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తుంది. ఈ టాబ్లెట్ 37,000ఎమ్ఎమ్ చదరపు గ్రాఫైట్ హీట్ సింక్‌తో త్రీ-డైమెన్షనల్ హీట్ డిస్సిపేషన్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఆప్టిక్స్ పరంగా వివో ఐప్యాడ్ 3 ప్రో ఫోన్ 13ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 8ఎంపీ కెమెరా సెన్సార్ కూడా ఉంది. టాబ్లెట్‌లో ఏఏసీ, డబ్ల్యూఏవీ, ఓజీజీ, ఏపీఈ, ఎఫ్ఎల్‌ఏసీ వంటి ఆడియో ఫార్మాట్‌లకు సపోర్టు ఇస్తుంది. మొత్తం 8 స్పీకర్‌లతో కూడిన ఆడియో సిస్టమ్ ఉంది. ఈ టాబ్లెట్ వివో పెన్సిల్ 2 స్టైలస్ ద్వారా ఇన్‌పుట్‌కు సపోర్టు ఇస్తుంది. మాగ్నెటిక్ పోగో పిన్స్ ద్వారా కీబోర్డ్ కేస్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

వివో ప్యాడ్ 3ప్రో వై-ఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ ఓటీజీ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో కూడిన కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంది. ఇందులో కలర్ టెంపరేచర్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, హాల్ సెన్సార్ ఉన్నాయి. అంతేకాకుండా, 66డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 11,500ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే.. బ్యాటరీ 70 రోజుల స్టాండ్‌బై టైమ్‌ని అందిస్తుంది. ఈ టాబ్లెట్ కొలతలు 289.56×198.32×6.64ఎమ్ఎమ్, బరువు 678.9 గ్రాములు ఉంటుంది.

వివో TWS 4 సిరీస్ స్పెసిఫికేషన్లు :
వివో టీడబ్ల్యూఎస్ 4 సిరీస్‌లో వనిల్లా టీడబ్ల్యూఎస్ 4, టీడబ్ల్యూఎస్ 4 హై-ఫై ఉన్నాయి. గతంలో ఎల్‌డీఏసీ, ఏపీటీఎక్స్ అడాప్టివ్, ఏఏసీ, ఎస్‌బీసీ, ఎల్‌సీ3 కోడెక్‌లకు సపోర్టు ఇస్తుంది. అయితే, రెండోది ఎల్‌డీఏసీ, ఏపీటీఎక్స్ అడాప్టివ్, ఏపీటిక్స్ లాస్‌లెస్, ఏఏసీ, ఎస్‌బీసీ, ఎల్‌సీ3 ఆడియో కోడెక్‌లకు సపోర్టు ఇస్తుంది. 12.2ఎమ్ఎమ్ డ్రైవర్లను కలిగి ఉన్నారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)ని కలిగి ఉన్నాయి. యాంబియంట్ నాయిస్‌ను 55డీబీ వరకు తగ్గిస్తుంది.

టీడబ్ల్యూఎస్ 4 క్వాల్‌కామ్ ఎస్3 జనరేషన్ 2 సౌండ్ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. టీడబ్ల్యూఎస్ 4 హై-ఫై ఎస్3 జనరేషన్ 3 సౌండ్ ప్లాట్‌ఫారమ్‌పై రన్ అవుతుంది. వివో ఫోన్‌లతో 44 మిల్లీసెకన్ల గేమింగ్ లో-లేటెన్సీ సపోర్టుతో వస్తాయి. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని పొందవచ్చు. ఇయర్‌బడ్‌లు ఐపీ54-సర్టిఫైడ్ డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఇయర్‌బడ్స్‌లో 54ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. గరిష్టంగా 11 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Read Also : OnePlus Nord CE 4 Launch : ఏప్రిల్ 1నే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లాంచ్.. ఫుల్ స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?