Vivo T3 Series
Vivo T3 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో వివో రెండు టీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరను అధికారికంగా తగ్గించింది. వివో T3 ప్రో, వివో T3 అల్ట్రా అనే ఈ రెండు ఫోన్‌లు కొన్ని నెలల క్రితమే లాంచ్ అయ్యాయి. వివో T3 ప్రోను ఆగస్టులో లాంచ్ చేయగా, వివో టీ3 అల్ట్రా గతేడాది అక్టోబర్‌లో విడుదలైంది.
ఈ ఫోన్ల లాంచ్ సమయంలో వివో టీ3 ప్రో ధర రూ. 24,999 నుంచి ప్రారంభమైంది. అయితే, వివో టీ3 అల్ట్రా తక్కువ వేరియంట్ ధర రూ. 33,999కు పొందవచ్చు. అయితే, వివో ఇండియా ఈ రెండు మోడళ్లకు ధర తగ్గింపును ప్రకటించింది.
Read Also : Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ.. 100కి పైగా వాహనాల ప్రదర్శనలు!
వివో టీ3 ప్రో, వివో టీ3 అల్ట్రా ధరలివే :
వివో టీ3 ప్రో అన్ని వేరియంట్‌లలో రూ. 2వేల తగ్గింపును పొందింది. రూ.24,999కి లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ.22,999కి అందుబాటులో ఉంటుంది. మరోవైపు 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 నుంచి రూ.24,999కి తగ్గింది. అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ. 1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
వివో టీ3 అల్ట్రా విషయానికొస్తే.. ఈ ఫోన్ టాప్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 33,999 నుంచి రూ. 29,999కి ధరకు తగ్గింది. వివో టీ3 ప్రో మాదిరిగానే వివో టీ3 అల్ట్రా కూడా కొన్ని లిస్టెడ్ బ్యాంక్ ఆఫర్‌లను కలిగి ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్ ద్వారా చేసిన చెల్లింపులపై దాదాపు రూ. 2వేల తగ్గింపును పొందవచ్చు.
Vivo T3 Series
వివో టీ3 ప్రో ఫీచర్లు :
వివో టీ3 ప్రో 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, (Schott Xensation) గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.67-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ వెట్ టచ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ అందిస్తుంది.
వివో టీ3 అల్ట్రా: స్పెసిఫికేషన్‌లు :
వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్ 6.78-అంగుళాల 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేతో 1.5కె రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌తో పాటు 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 16 లక్షల కన్నా ఎక్కువ ఆకట్టుకునే (Antutu) బెంచ్‌మార్క్ స్కోర్‌ను సాధించిందని వివో పేర్కొంది.
80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,500mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. (OIS)తో కూడిన 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్921 ప్రధాన సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీలకు కచ్చితంగా సరిపోతుంది. ఏఐ ఎరేజర్, ఏఐ ఫోటో అప్‌గ్రేడ్ వంటి ఏఐ-పవర్‌తో పనిచేసే టూల్స్ నేరుగా ఫోన్‌లో ఫోటో ఎడిటింగ్ ఆప్షన్లను అందిస్తుంది.
Read Also : Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పో 2025లో హీరో సంచలనం.. 4 కొత్త బైక్‌లు, 2 కొత్త స్కూటర్లు విడుదల!