Vivo Watch 5 : వివో స్మార్ట్ వాచ్ అదుర్స్.. ఏఐ ఫీచర్లతో eSIM మోడల్ భలే ఉందిగా.. 22 రోజుల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?

Vivo Watch 5 : ఏఐ ఫీచర్లతో వివో వాచ్ వచ్చేసింది.. హెల్త్ డేటాను ట్రాక్ చేయగలదు. ఫుల్ ఛార్జ్ 22 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Vivo Watch 5 : వివో స్మార్ట్ వాచ్ అదుర్స్.. ఏఐ ఫీచర్లతో eSIM మోడల్ భలే ఉందిగా.. 22 రోజుల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?

Vivo Watch 5

Updated On : June 26, 2025 / 9:34 PM IST

Vivo Watch 5 : వివో యూజర్ల కోసం సరికొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది. వివో Watch 5 పేరుతో eSIM వెర్షన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. గత ఏప్రిల్‌లో చైనాలో వివో X Fold 5 ఫోల్డబుల్ ఫోన్‌తో (Vivo Watch 5) పాటు లాంచ్ చేసింది. స్పోర్ట్స్ ట్రాకింగ్‌తో పాటు వివో వాచ్ 5 హెల్త్ డేటాను ట్రాక్ చేస్తుంది. సర్కిల్ డయల్, 1.43-అంగుళాల కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది.

వివో కంపెనీ ప్రకారం.. బ్లూటూత్‌ను మాత్రమే వాడితే 22 రోజుల వరకు, రెండు డివైజ్‌‌లకు eSIMని ఉపయోగిస్తున్నప్పుడు 14 రోజుల వరకు, eSIMని మాత్రమే ఉపయోగిస్తున్నప్పుడు 7 రోజుల వరకు నడుస్తుంది. బ్లూటూత్‌తో కూడిన వివో వాచ్ 5 ధర 799 యువాన్లు లేదా (దాదాపు రూ. 9,500), eSIM వేరియంట్ 999 యువాన్లు (సుమారు రూ. 12వేలు) కూడా అందుబాటులో ఉంది.

వివో వాచ్ 5 ఫీచర్లు :
వివో వాచ్ 5 సర్కిల్ డయల్‌తో 1.43-అంగుళాల కర్వడ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 1500 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ సపోర్ట్ చేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. బ్యాండ్ లేకుండా వాచ్ ఇప్పుడు 32 గ్రాముల బరువు మాత్రమే ఉంది. వివో ఫోన్ 24 గంటల హార్ట్ రేటు, బ్లడ్ ఆక్సిజన్, ఒత్తిడి, నిద్ర, రక్తపోటు, హార్ట్ హెల్త్ రేట్ రీసెర్చ్ వంటి ఇతర ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి.

Read Also : NPS Vatsalya vs SSY : పెట్టుబడి పెడుతున్నారా? NPS వాత్యల్స.. SSY స్కీమ్.. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏ పథకం మంచిదంటే..?

వివో వాచ్ స్ట్రాప్ లెదర్ లేదా సిలికాన్ ఉండొచ్చు. కొన్ని సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కలిగి ఉంది. BlueOS 2.0పై రన్ అవుతుంది. రన్నింగ్ ఫారమ్ మానిటరింగ్, రియల్ టైమ్‌లో యూజర్ల హార్ట్ రేట్ ఆధారంగా కొవ్వును కరిగించే వ్యాయామాలతో సరికొత్త ఏఐ స్పోర్ట్స్ కోచ్‌ను కలిగి ఉంది. థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ యాక్టివిటీని పరిమితంగా ఉండే వినియోగదారులు ఇప్పటికీ ఫుల్ యాప్ స్టోర్‌కు యాక్సెస్ కలిగి ఉంటారు.

ఈ వివో స్మార్ట్‌వాచ్‌లో నోటిఫికేషన్‌లు, ఆడియో కంట్రోల్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫంక్షన్‌లు ఉన్నాయి. అవుట్‌డోర్‌లను ట్రాక్ చేసేందుకు GPS, పేమెంట్ల కోసం NFC సపోర్టు కూడా ఉంది. వాటర్ ప్రొటెక్షన్ కోసం 5ATM రేటెడ్ డిజైన్‌ను కలిగి ఉంది. కొత్త ఏఐ స్మార్ట్ విండో ఫీచర్‌ను కలిగి ఉంది. iOS, Android డివైజ్‌లు రెండూ వివో వాచ్ 5 ఉపయోగించవచ్చు. చైనాలోని యూజర్ల కోసం వాచ్ లైవ్ WeChat సపోర్టు కలిగి ఉంది.

బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. వివో వాచ్ 5 బ్లూటూత్ మోడ్‌లో 22 రోజుల వరకు పనిచేస్తుంది. eSIM స్టాండ్-అలోన్ మోడ్‌లో 7 రోజుల వరకు, eSIM డ్యూయల్-డివైస్ మోడ్‌లో ఫుల్ ఛార్జ్‌లో 14 రోజుల వరకు ఉండవచ్చని కంపెనీ పేర్కొంది. మాగ్నెటిక్ పక్‌ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్ పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు దాదాపు 2 గంటల సమయం పడుతుంది.