Vivo X Fold 5 Launch
Vivo X Fold 5 Launch : వివో లవర్స్ కోసం సరికొత్త వివో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. ఈ మడతబెట్టే ఫోన్ జూన్ 25న చైనాలో లాంచ్ కానుంది. డిజైన్, కలర్ ఆప్షన్లతో పాటు, కంపెనీ అధికారికంగా లాంచ్ తేదీని వెయిబో పోస్ట్ ద్వారా ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ X ఫోల్డ్ 3 కన్నా చాలా తేలికైనదిగా చెబుతోంది.
అదనంగా, ఈ హ్యాండ్‌సెట్ స్లిమ్ బెజెల్స్‌తో ఫ్లాట్ కవర్ డిస్‌ప్లేతో సెంట్రలైజడ్ హోల్-పంచ్ స్లాట్‌ను కలిగి ఉంటుంది. బ్యాక్ ప్యానెల్‌లో 3 కెమెరాలు, LED ఫ్లాష్ యూనిట్, Zeiss బ్రాండింగ్ ఉండవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ BIS జాబితాలో కూడా కనిపించింది. భారత మార్కెట్లో త్వరలో వివో ఎక్స్ ఫోల్డ్ 5 ఫోన్ లాంచ్ కానుంది.
భారత్‌లో వివో X Fold 5 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
వివో ఇంకా భారత మార్కెట్లో X ఫోల్డ్ 5 లాంచ్ తేదీని రివీల్ చేయలేదు. ఈ హ్యాండ్‌సెట్ వచ్చే జూలై మధ్యలో వివో X200 FEతో పాటు వచ్చే అవకాశం ఉంది.
వివో X ఫోల్డ్ 5 స్పెసిఫికేషన్లు (అంచనా) :
వివో X ఫోల్డ్ 5 ఫోన్ చైనా మోడల్ మాదిరి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8T LTPO డిస్‌ప్లేతో అల్ట్రా-హై రిఫ్రెష్ రేట్, అల్ట్రా-హై రిజల్యూషన్, 4500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో రావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ TUV రైన్‌ల్యాండ్ గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 3.0 సర్టిఫికేషన్ కూడా ఉండొచ్చు.
వివో X ఫోల్డ్ 5 ఫోన్ 8.03-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 6.53-అంగుళాల LTPO OLED కవర్ డిస్‌ప్లేతో రానుంది. హుడ్ కింద, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పాటు 16GB ర్యామ్, 512GB స్టోరేజీతో రావచ్చు.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. వివో X ఫోల్డ్ 5 ఫోన్ మూడు 50MP సెన్సార్లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుందని భావిస్తున్నారు. లోపలి, బయటి స్క్రీన్‌లపై డ్యూయల్ 32MP సెన్సార్లు కూడా ఉండవచ్చు. ఈ వివో ఫోన్ 3 స్టేజ్ అలర్ట్ స్లైడర్, 90W వైర్డు, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీతో రానుంది.
Read Also : Vivo X200 Sale : వివో ఆఫర్ అదుర్స్.. ఇలా చేస్తే వివో X200 ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇప్పుడే కొనేసుకోండి..!
వివో X ఫోల్డ్ 5 ధర (అంచనా) :
రాబోయే వివో X ఫోల్డ్ 5 ఫోన్ ధర వివో X ఫోల్డ్ 3 ప్రో కన్నా తక్కువగా ఉంటుందని అంచనా. భారత మార్కెట్లో వివో X ఫోల్డ్ 3 ప్రో 16GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 1,59,999కి లాంచ్ అయింది. ఫోల్డ్ 5 మోడల్ ఇంత కన్నా ఇంకా తక్కువగా ఉండొచ్చు.