Vivo X-Fold 5 vs Samsung Galaxy Z Fold 7: ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో మీకు ఏది బెటర్‌? కళ్లుచెదిరే ఫీచర్లు..

వివో ఎక్స్-ఫోల్డ్ 5 ఫోల్డబుల్స్‌లో 6,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. 80W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫోల్డబుల్ ఫోన్లలో భారత్‌లో అందుబాటులో ఉన్న తాజా మోడళ్లు వివో ఎక్స్-ఫోల్డ్ 5, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7. ఈ రెండు ఫోన్లు ఫోల్డబుల్ డిజైన్, అత్యాధునిక పనితీరు, మెరుగైన డిస్‌ప్లేలు, ఏఐ ఫీచర్లతో ఉన్నాయి. మీ అవసరాలు, బడ్జెట్‌కు సరిపోయే ఫోల్డబుల్ ఫోన్‌ను ఎంచుకోవడానికి వివో ఎక్స్-ఫోల్డ్ 5, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 స్పెసిఫికేషన్లను పోల్చి చూడండి.

వివో ఎక్స్-ఫోల్డ్ 5  217 గ్రాముల బరువు ఉంటుంది. ఈ డివైస్‌లో IPX8, IPX9, IPX9+ నీటి నిరోధకత ఉంది. కానీ వివో స్థాయిలో నీటి నిరోధకత లేదు.

డిస్‌ప్లే
వివో ఎక్స్-ఫోల్డ్ 5లో 6.53 అంగుళాల కవర్ డిస్‌ప్లే 2748 x 1172 రిజల్యూషన్, 8.03 అంగుళాల ఫోల్డబుల్ అమోలెడ్ ఇన్నర్ స్క్రీన్ 2480 x 2200 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్నాయి. రెండు ప్యానెల్స్ 4,500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. జీస్ మాస్టర్ కలర్ కాలిబ్రేషన్, టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7లో 6.5 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X కవర్ స్క్రీన్ 2520 x 1080 రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 8 అంగుళాల ఫోల్డింగ్ ఇన్నర్ డిస్‌ప్లే ఉన్నాయి.

కెమెరా
వివో ఎక్స్-ఫోల్డ్ 5లో 50MP ట్రిపుల్ బ్యాక్ కెమెరా.. ప్రైమరీ సెన్సార్, అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్‌తో జీస్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇన్నర్, కవర్ స్క్రీన్‌లలో 20MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7లో రెండు 10MP ఫ్రంట్ కెమెరాలు, 200MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

ఛార్జింగ్, బ్యాటరీ
వివో ఎక్స్-ఫోల్డ్ 5 ఫోల్డబుల్స్‌లో 6,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. 80W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7లో 4,400mAh బ్యాటరీ ఉంది. 25W వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వివో బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ వేగం వల్ల దీర్ఘకాల ఉపయోగానికి సరిపోతుంది.

Also Read: ఓ రేంజ్‌లో ఉన్నాయిగా.. ఒప్పో నుంచి భారత్‌లో 2 స్మార్ట్‌ఫోన్లు విడుదల..

ఏఐ ఫంక్షన్లు, నెట్‌వర్కింగ్
వివోలో గూగుల్ జెమినీ అసిస్టెంట్‌తో పాటు ఏఐ ఇమేజ్ ఎక్స్‌పాండర్, ఏఐ మ్యాజిక్ మూవ్, ఏఐ ఎరేస్, ఏఐ రిఫ్లెక్షన్ ఎరేస్ వంటి ఫీచర్లతో ఏఐ ఫోటోగ్రఫీ ప్యాకేజీ ఉంది. శాంసంగ్ వన్ యూఐ 8 ఆండ్రాయిడ్ 16లో అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి, కానీ వివో ప్రత్యేక ఏఐ ఇమేజ్ సామర్థ్యాలు లేవు.

రెండు డివైస్‌లు 5G, వై-ఫై 7, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ సామర్థ్యాల వంటి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తాయి. శాంసంగ్ బ్లూటూత్ 5.4ను సపోర్ట్ చేస్తుంది. ఇది వేగవంతమైన డేటా బదిలీ, తక్కువ లేటెన్సీకి సహాయపడుతుంది.

ధరలు
వివో ఎక్స్-ఫోల్డ్ 5 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ మోడల్ ధర Rs.1,49,999. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది: 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ధర.1,74,999; 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ ధర.1,86,999; 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ ధర.2,16,999.