Vivo X200 FE vs Vivo X200: ఈ 2 స్మార్ట్‌ఫోన్లు ఖతర్నాక్ ఉన్నాయ్ బాస్‌.. రెండింట్లో ఏది బెస్ట్‌? తెలుసుకోండిలా..

Vivo X200 5G ఎవరికి బెస్ట్? Vivo X200 FE ఎవరికి బెస్ట్?

వివో తన X-సిరీస్‌లో మరో రెండు శక్తిమంతమైన ఫోన్లను ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. అవే Vivo X200 FE, Vivo X200 5G.

Vivo X200 FE జూలై 14న లాంచ్ అయింది. అయితే, Vivo X200 5G మాత్రం 2024 అక్టోబర్ 14నే మార్కెట్‌లోకి వచ్చింది. ఈ రెండు ఫోన్లు ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో బలమైన ఫీచర్లతో వచ్చాయి. కానీ, వాటి ప్రత్యేకతలు వేర్వేరు. వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. మీకు ఏ ఫోన్ సరిపోతుందో తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ చదవండి..

డిస్‌ప్లే: ఫ్లాట్ vs కర్వ్డ్
Vivo X200 FE 

  • స్క్రీన్: 6.31-అంగుళాల ఫ్లాట్ LTPO AMOLED డిస్‌ప్లే. ఫ్లాట్ స్క్రీన్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్.
  • బ్రైట్‌నెస్: 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. అంటే, ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
  • రిజల్యూషన్: 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

Vivo X200 5G 

  • స్క్రీన్: 6.67-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే. ఇది ఫోన్‌కు ప్రీమియం లుక్ ఇస్తుంది.
  • బ్రైట్‌నెస్: 4500 నిట్స్ బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్‌తో వీడియోలు చూసేందుకు అద్భుతంగా ఉంటుంది.
  • రిజల్యూషన్: 1260×2800 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్‌.
  • ప్రీమియం ఫీల్, కర్వ్డ్ డిస్‌ప్లే కావాలనుకునేవారికి X200 5G సరైనది. గేమింగ్, ఫ్లాట్ స్క్రీన్ సౌకర్యాన్ని కోరుకునేవారికి, ఎండలో ఎక్కువగా వాడేవారికి X200 FE బెస్ట్ ఆప్షన్.

Also Read: వివో X300 ప్రో 5జీ.. కెమెరా డీటెయిల్స్‌ లీక్ అయ్యాయి భయ్యా.. ఎలాగుందో తెలిసిందంటే వదలనే వదలరు..!

పనితీరు 

  • Vivo X200 FE: MediaTek Dimensity 9300+ చిప్‌సెట్‌తో వచ్చింది. ఇది ఫ్లాగ్‌షిప్ స్థాయిలో వేగవంతమైన పనితీరును అందిస్తుంది.
  • Vivo X200 5G: ఇంకా కొత్తదైన, శక్తివంతమైన MediaTek Dimensity 9400 చిప్‌సెట్‌తో వచ్చింది. ఇందులో AI ఫీచర్లు మరింత మెరుగ్గా పనిచేస్తాయి.
  • తేడా: రోజువారీ పనులకు, గేమింగ్‌కు రెండు ఫోన్లు అద్భుతంగా ఉంటాయి. కానీ, లేటెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ AI పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే X200 5G ముందుంటుంది.

కెమెరా: సెల్ఫీ కింగ్ vs అల్ట్రావైడ్ ఛాంపియన్

Vivo X200 FE 

  • ప్రైమరీ కెమెరా: 50MP (Sony IMX921)
  • జూమ్ కెమెరా: 50MP టెలిఫోటో (3x ఆప్టికల్, 100x డిజిటల్ జూమ్)
  • సెల్ఫీ కెమెరా: 50MP (హైలైట్)

Vivo X200 5G 

  • ప్రైమరీ + జూమ్: X200 FE లానే ఉంటాయి.
  • అల్ట్రావైడ్ కెమెరా: 50MP (హైలైట్)
  • సెల్ఫీ కెమెరా: 32MP

తేడా: మీరు సెల్ఫీలపై ఎక్కువ దృష్టి పెడితే, X200 FE మీకోసమే. అదే సమయంలో ప్రకృతి దృశ్యాలను, గ్రూప్ ఫొటోలను ఇష్టపడితే, X200 5G 50MP అల్ట్రావైడ్ కెమెరా మీకు బాగా నచ్చుతుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ 

  • Vivo X200 FE: 6500mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్. రోజంతా సులభంగా వస్తుంది.
  • Vivo X200 5G: 5800mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్. ఈ కొత్త టెక్నాలజీ వల్ల బ్యాటరీ సైజు చిన్నగా ఉన్నా ఎక్కువ సేపు ఛార్జింగ్ నిలుస్తుంది.
  • తేడా: ఎక్కువ బ్యాటరీ లైఫ్ ప్రాధాన్యత అయితే X200 FE బెస్ట్. కొత్త టెక్నాలజీ, సమర్థవంతమైన బ్యాటరీని కోరుకుంటే X200 5G మంచిది.

ధరలు

  • Vivo X200 FE ధర – రూ.54,999 నుంచి స్టార్ట్‌
  • Vivo X200 5G ధర – రూ.65,999 నుంచి స్టార్ట్‌

మీకు ఏ ఫోన్ బెస్ట్?

Vivo X200 FE ఎవరికి బెస్ట్?

  • ఫ్లాట్ డిస్‌ప్లే ఇష్టపడేవారికి.
  • అద్భుతమైన సెల్ఫీలు కావాలనుకునేవారికి.
  • భారీ బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి.
  • కొంచెం తక్కువ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకునేవారికి.

Vivo X200 5G ఎవరికి బెస్ట్?

  • ప్రీమియం కర్వ్డ్ డిస్‌ప్లే కావాలనుకునేవారికి.
  • లేటెస్ట్, శక్తివంతమైన ప్రాసెసర్ కోరుకునేవారికి.
  • మెరుగైన అల్ట్రావైడ్ కెమెరా అవసరమైన వారికి.
  • కొత్త టెక్నాలజీని ప్రయత్నించాలనుకునేవారికి.