Vivo X200 Series Launch : వివో నుంచి 3 సరికొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఒక్కో మోడల్ ధర ఎంతంటే?

Vivo X200 Series Launch : ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో భాగంగా 3 హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. వివో X200, వివో X200 ప్రో, వివో X200 ప్రో మినీ మోడల్స్ ఉన్నాయి.

Vivo X200, X200 Pro, X200 Pro Mini With Dimensity 9400 Chipset and Origin OS 5 Launched ( Image Source : Google )

Vivo X200 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ వచ్చేసింది. చైనాలో వివో X200 సిరీస్ లాంచ్ అయింది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో భాగంగా 3 హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. వివో X200, వివో X200 ప్రో, వివో X200 ప్రో మినీ మోడల్స్ ఉన్నాయి.

గత రెండు వివో X100 సిరీస్‌తో కంపెనీ ప్రవేశపెట్టిన ఫీచర్లపై వివో ఎక్స్ 200 ప్రో మినీ అనేది పూర్తిగా కొత్త మోడల్ అని చెప్పవచ్చు. వివో ఎక్స్200 సిరీస్ కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్, ఆరిజిన్ ఓఎస్ 5 వంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. వివో సొంత వెర్షన్ సర్కిల్ టు సెర్చ్‌తో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఆధారితమైనది.

వివో ఎక్స్200 సిరీస్ ధర ఎంతంటే? :
చైనాలో వివో ఎక్స్200 ఫోన్ 12జీబీ+256జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర సీఎన్‌వై 4,300 (సుమారు రూ. 51వేలు) నుంచి ప్రారంభమవుతుంది. 12జీబీ+512జీబీ, 16జీబీ+512జీబీ, 16జీబీ+1టీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో కూడా అందుబాటులో ఉంది. అదే సమయంలో, వివో ఎక్స్200ప్రో 12జీబీ+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 5,999 (దాదాపు రూ. 63వేలు) నుంచి ప్రారంభమవుతుంది.

వివో ఎక్స్200ప్రో మినీ అదే కాన్ఫిగరేషన్ సీఎన్‌వై 4,699 (దాదాపు రూ. 56వేలు) ఖర్చవుతుంది. ఈ 3 స్మార్ట్‌ఫోన్‌లు మొత్తం 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. అందులో కార్బన్ బ్లాక్, టైటానియం గ్రే, మూన్‌లైట్ వైట్, సఫైర్ బ్లూ వంటి 3 హ్యాండ్‌సెట్‌లను ప్రీఆర్డర్ చేయొచ్చు. వివో ఎక్స్200, వివో ఎక్స్200ప్రో మినీ అక్టోబర్ 19న స్టోర్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. అయితే, వివో ఎక్స్200ప్రో మోడల్ అక్టోబర్ 25 నుంచి కొనుగోలు చేయవచ్చు.

వివో ఎక్స్200 సిరీస్ స్పెసిఫికేషన్లు :
వివో ఎక్స్200 ఫోన్ 6.67-అంగుళాల 10-బిట్ ఓఎల్ఈడీ ఎల్టీపీఎస్ క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్‌ను (Zeiss) నేచురల్ కలర్ సపోర్ట్‌తో కలిగి ఉంది. హెచ్‌డీఆర్ 10+, 4,500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్‌ కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్921 ప్రైమరీ కెమెరా, 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 టెలిఫోటో సెన్సార్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సపోర్టుగా 5,800mAh బ్లూవోల్ట్ బ్యాటరీ 90డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

వివో ఎక్స్200 ప్రో కొన్ని మార్పులు మినహా స్టాండర్డ్ మోడల్‌కు సమానమైన స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఎల్టీపీఓ ప్యానెల్. ఈ మోడల్‌లోని డిస్‌ప్లే 1.63మిమీ వద్ద సన్నగా ఉండే బెజెల్స్‌ను కలిగి ఉంది. ఈ కొత్త వివో ఎక్స్200 ప్రో మినీ మరింత కాంపాక్ట్ 6.31-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేను అందిస్తుంది.

వివో ఎక్స్200 లైనప్‌లోని 2 ప్రో మోడల్‌లు కొత్త 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-818 కెమెరా, 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లతో అమర్చి ఉన్నాయి. అయితే, టెలిఫోటో కెమెరాలో స్వల్ప మార్పులు ఉన్నాయి. వివో ప్రో మోడల్ కొత్త 200ఎంపీ జీస్ ఏపీఓ టెలిఫోటో కెమెరాను పొందగా, వివో ఎక్స్200 ప్రో మినీలో 50ఎంపీ సెన్సార్ ఉంది.

వివో ప్రో మోడల్స్‌లోని కెమెరా మాడ్యూల్స్‌కు X100 అల్ట్రాలో మాదిరిగా వివో వి3+ ఇమేజింగ్ చిప్ సపోర్టు ఇస్తుంది. 4కె హెచ్‌డీఆర్ సినిమాటిక్ పోర్ట్రెయిట్ వీడియో, 10-బిట్ లాగ్‌లో సెకనుకు 60 ఫ్రేమ్‌ల (fps) వరకు షూటింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. వివో ఎక్స్200 ప్రో, వివో ఎక్స్200ప్రో మినీ వరుసగా 6,000mAh, 5,800mAh బ్యాటరీల ద్వారా సపోర్టు అందిస్తుంది. ఈ రెండూ కూడా 90డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ అందిస్తాయి.

ఈ 3 మోడల్‌లు కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ కలిగి ఉన్నాయి. సెకండ్ జనరేషన్ 3ఎన్ఎమ్, 3.6GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో కూడిన కార్టెక్స్-X925 పెర్ఫార్మెన్స్ కోర్ కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇటీవలే ప్రవేశపెట్టిన వివో కొత్త ఆరిజిన్ ఓఎస్ 5పై రన్ అవుతాయి. సంస్థ సొంత వెర్షన్ సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఫీచర్లను తీసుకువస్తుంది. వివో ఆరిజిన్ ఐలాండ్ అనే డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కూడా తీసుకువచ్చింది.

Read Also : Google Pixel 9 Pro : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ప్రీ-ఆర్డర్‌ చేసుకోండి.. అక్టోబర్ 17నే సేల్.. ధర, స్పెసిఫికేషన్‌లు వివరాలివే!