అమెజింగ్ ఫీచర్లు : Vivo X27 ప్రొ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతోంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ కావడంతో స్మార్ట్ ఫోన్ల సేల్స్ కు ఫుల్ గిరాకీ వచ్చేసింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఎక్కడ చూసిన కొత్త ఫోన్లతో మార్కెట్ కిటకిటలాడుతోంది.

  • Published By: sreehari ,Published On : March 20, 2019 / 01:30 PM IST
అమెజింగ్ ఫీచర్లు : Vivo X27 ప్రొ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Updated On : March 20, 2019 / 1:30 PM IST

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతోంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ కావడంతో స్మార్ట్ ఫోన్ల సేల్స్ కు ఫుల్ గిరాకీ వచ్చేసింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఎక్కడ చూసిన కొత్త ఫోన్లతో మార్కెట్ కిటకిటలాడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతోంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ కావడంతో స్మార్ట్ ఫోన్ల సేల్స్ కు ఫుల్ గిరాకీ వచ్చేసింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఎక్కడ చూసిన కొత్త ఫోన్లతో మార్కెట్ కిటకిటలాడుతోంది. ఆకర్షణీయమైన ఫీచర్ల ఫోన్లను సొంతం చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ లవర్స్ అంతా క్యూ కట్టేస్తున్నారు. మొబైల్ కంపెనీలు కూడా తమ కొత్త ఫోన్లను రిలీజ్ చేసి భారీ మొత్తంలో బిజినెస్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రముఖ మొబైల్ కంపెనీలు శాంసంగ్, హెచ్ఎండీ గ్లోబల్, Xiaomi లు తమ కొత్త సిరీస్ ఫోన్లను మార్కెట్లలో విడుదల చేశాయి. వీటికి పోటీగా ప్రముఖ మొబైల్ మేకర్ VIVO నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. 

అదే.. Vivo X27 Pro. ఇండియాలో V15 Pro వేరియంట్ ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ వర్షన్ కు అపడేటడ్ వర్షన్ వివో ఎక్స్ 27ను సిరీస్ ను విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్ ఫోన్ ఇండియా మార్కెట్ లో అందుబాటులో లేదు. ప్రస్తుతం చైనా మొబైల్ మార్కెట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. చైనా మార్కెట్ లో రిలీజ్ చేసిన వివో.. ఎక్స్ 27 సిరీస్ ను ఇండియాలో కూడా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆండ్రాయిడ్ 9.0 పై, వివో Funtouch OS 9పై ఈ స్మార్ట్ ఫోన్ సాఫ్ట్ వేర్ రన్ అవుతుంది.

ఇండియాలో రిలీజ్ అయిన వివో వి15 ప్రొ ధర రూ.28వేల 990 ఉండగా, చైనాలో Vivo X27 pro ధర 3,600 సీఎన్ వై (రూ. 37వేలు) వరకు ఉంటుంది. యూజర్లను ఆకట్టకునే సింగిల్ పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో పాటు ట్రిపుల్ రియల్ కెమెరాలు ఉన్నాయి. ఫింగర్ టచ్ తో ఫోన్ అన్ లాక్ చేసే ఆప్షన్ ఉంది. 16మెగాఫిక్సల్ సెన్సార్ తో నైట్ మోడ్ తో ఈజీగా ఫొటోలు తీసుకోవచ్చు. Vivo X27 Pro లో ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.. 

స్పెషిఫికేషన్లు.. ఇవిగో..
* 6.7 అంగుళాల డిసిప్లే
*  48 మెగా ఫిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్ 586 ప్రైమరీ సెన్సార్
* 13మెగా ఫిక్సల్ సెకండరీ సెన్సార్
* వైడ్ యాంగల్ లెన్స్, 5 మెగాఫిక్సల్ డెప్త్ సెన్సార్
* 20.5:9 రేషియో ఫుల్ హెచ్ డీ + రిజుల్యుషన్
* ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 710 ఎస్ఓసీ
*  8GB RAM, 256 GB     
* pop  సెల్ఫీ కెమెరా, 16 మెగాఫిక్సల్ సెన్సార్
*  ఇన్ డిసిప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
*  32మెగా ఫిక్సల్ సెన్సార్ 
*  ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)
*  4000 ఎంఎహెచ్ బ్యాటరీ
*  4జీ ఎల్టీఈ, వై-పై, బ్లూటూత్
*  ఇన్ డిసిప్లే ఫింగర్ ఫ్రింట్ స్కానర్
*  జీపీఎస్, ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, USB
*  ఆండ్రాయిడ్ 9.0పై 
*  వివో Funtouch OS 9 ఆన్ టాప్