వివో X300 ప్రో 5జీ.. కెమెరా డీటెయిల్స్‌ లీక్ అయ్యాయి భయ్యా.. ఎలాగుందో తెలిసిందంటే వదలనే వదలరు..!

వివో X300 2025 అక్టోబర్‌లో ఇండియాలో విడుదలయ్యే అవకాశం ఉంది.  

వివో ఎక్స్ సిరీస్ కెమెరా, ప్రీమియం పనితీరు యూజర్లను ఆకర్షిస్తోంది. త్వరలో విడుదల కానున్న వివో X300 ప్రో 5జీ కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. తాజాగా డిజిటల్ చాట్ స్టేషన్ వంటి టిప్‌స్టర్లు ఈ ఫోన్ గురించి పలు వివరాలు తెలిపారు. రూమర్ల ప్రకారం వివో X300 ప్రో 5జీ శక్తిమంతమైన కెమెరా ఫ్లాగ్‌షిప్ గా వస్తుందని అర్థమవుతోంది.

వివో X300 ప్రో 5జీ కెమెరా స్పెసిఫికేషన్
వివో X300 ప్రో 5జీ కెమెరాలో ముఖ్యమైన అంశం 200ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్. ఇది 3.7ఎక్స్ ఆప్టికల్ జూమ్, మాక్రో షాట్లకు అనుకూలంగా ఉంటుంది. 50ఎంపీ సోనీ లైటియా ప్రధాన సెన్సార్, 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ ఉండేలా ఉంది. ఫ్రంట్‌లో కూడా 50ఎంపీ కెమెరా ఉంటుంది. జైస్ టీ కోటింగ్, ఓఐఎస్ సపోర్ట్ వల్ల ఫొటో, వీడియో నాణ్యత బాగుంటుంది.

వివో X300 ప్రో 5జీ డిస్‌ప్లే, డిజైన్
ఈ ఫోన్‌లో 6.82 అంగుళాల ఎల్టీపీవో అమొలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10 ప్లస్ సపోర్ట్‌తో వస్తుంది. ఈసారి డిస్‌ప్లే మరింత ప్రకాశవంతంగా, స్మూత్ అనుభూతిని ఇస్తుంది. కొన్ని రిపోర్టులు “ప్రో మినీ” అనే చిన్న వేరియంట్ ఉంటుందని చెబుతున్నాయి. దీనిలో 6.3 అంగుళాల ఫ్లాట్ 1.5కే స్క్రీన్ ఉండే అవకాశం ఉంది.

Also Read: ఇదేంటి భయ్యా? శాంసంగ్ ఫోల్డ్ ఫోన్లలో S పెన్ మళ్లీ వస్తుందా? ఎందుకు తీసేశారో, మళ్లీ ఎందుకు తెస్తున్నారో తెలుసా?

వివో X300 ప్రో 5జీ పనితీరు, ప్రాసెసర్
ఈసారి వివో తన X300 ప్రోలో మిడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ వినియోగించవచ్చని సమాచారం. ఈ చిప్‌సెట్ తాజా, ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరు ఇస్తుంది. గేమింగ్ అయినా, మల్టీటాస్కింగ్ అయినా సాఫీగా నడుస్తుంది. ఫోన్‌లో 12జీబి లేదా 16జీబి ర్యామ్, 256జీబి లేదా 512జీబి యూఎఫ్‌ఎస్ 4.0 నిల్వ ఉంటుంది.

వివో X300 ప్రో 5జీ బ్యాటరీ, ఛార్జింగ్
బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 6500ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుంది. “ప్రో మినీ”లో 7000ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉండొచ్చని సమాచారం. ఇంత పెద్ద బ్యాటరీకి 120వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 30వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.

ఇతర ఫీచర్లు, లాంచ్ టైంలైన్
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15పై పనిచేస్తుంది. ఫన్‌టచ్ ఓఎస్ 15 లేదా ఒరిజిన్ ఓఎస్ కొత్త వెర్షన్ ఉండొచ్చు. ఇన్‌డిస్‌ప్లే వేలిముద్ర సెన్సార్ ఉంటుంది. కొన్ని రిపోర్టులు ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్ అని చెబుతున్నాయి. 5జి, వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ, ఐపీ68, ఐపీ69 రేటింగ్ వంటి ఫీచర్లు దీనిని పూర్తిస్థాయి ఫ్లాగ్‌షిప్‌గా చేస్తాయి. వివో X300 2025 అక్టోబర్ లో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది.