Vivo X300 Series : కొత్త వివో X300 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే మాత్రం ఫిదానే.. ధర ఎంతో తెలిస్తే వచ్చిన వెంటనే కొనేస్తారు!
Vivo X300 Series : వివో X300 సిరీస్ వచ్చేస్తోందోచ్.. భారత మార్కెట్లో వివో X300, వివో X300 ప్రో ఫోన్ లాంచ్ కానుంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
 
                            Vivo X300 Series
Vivo X300 Series : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. వివో నుంచి సరికొత్త వివో X300 సిరీస్ గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అతి త్వరలో భారత మార్కెట్లోకి కూడా వివో X300, వివో X300 ప్రో వెర్షన్ లాంచ్ కానుంది. గత ఏడాదిలో X సిరీస్ లైనప్ మాదిరిగానే వివో X300 సిరీస్‌లో వివో X300, వివో X300 ప్రో మోడల్ ఉండవచ్చు.
అధికారిక వివరాలు ఇంకా రివీల్ కాలేదు. కానీ, ఈ రెండు ఫోన్లలో కొన్ని భారీ కెమెరా, డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, డిజైన్ అప్‌గ్రేడ్‌లు (Vivo X300 Series) ఉండొచ్చు. మీరు వివో ఫ్యాన్ అయితే రాబోయే ఫ్లాగ్‌షిప్ సిరీస్ కోసం చూస్తుంటే వివో X300 సిరీస్ భారత్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వివో X300 సిరీస్ భారత్ లాంచ్ టైమ్‌లైన్ :
వివో X300 సిరీస్ డిసెంబర్ మొదటి వారంలో లాంచ్ అవుతుందని చెబుతున్నారు. అయితే, కచ్చితమైన తేదీ ఇంకా రివీల్ కాలేదు. ఈ వివో ఫోన్లు వివో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ ఛానల్ పార్టనర్లకు అందుబాటులో ఉంటాయని అంచనా.
వివో X300, వివో X300 ప్రో డిజైన్ :
ఈ రెండు వివో ఫోన్లు గత మోడల్స్ మాదిరిగానే డిజైన్ కలిగి ఉంటాయని అంచనా. Zeiss బ్రాండింగ్‌తో భారీ సర్కిల్ కెమెరా మాడ్యూల్‌లను చూడొచ్చు. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. వివో X300 హాలో పింక్, ఫాంటమ్ బ్లాక్‌లను పొందవచ్చు. అయితే, వివో X300 ప్రో డ్యూన్ బ్రౌన్, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో రావచ్చు.
వివో X300 ప్రో, వివో X300 స్పెసిఫికేషన్లు (అంచనా) :
రాబోయే వివో X300 ప్రో మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K ఫ్లాట్ BOE Q10+ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. అయితే, స్టాండర్డ్ వివో X300 చిన్న 6.31-అంగుళాల 1.5K ఫ్లాట్ BOE Q10+ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ ప్యానెల్ కలిగి ఉంటుంది. విజువల్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంది. హుడ్ కింద, రెండు ఫోన్లలో మెరుగైన స్పీడ్, సామర్థ్యం కోసం LPDDR5X ర్యామ్, మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతాయని భావిస్తున్నారు.
బ్యాటరీ విషయానికొస్తే.. వివో X300 ప్రో 5,440mAh బ్యాటరీని కలిగి ఉండొచ్చు. వివో X300 5,360mAh యూనిట్ కలిగి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రెండు మోడళ్లు 90W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ వైపు ఈ కొత్త వివో X300 సిరీస్ చైనాలో ఆండ్రాయిడ్ 15-ఆధారిత OriginOS 5తో పాటు ప్రపంచ మార్కెట్లకు ఫన్‌టచ్OS 15తో వస్తుందని భావిస్తున్నారు.
కెమెరాల విషయానికొస్తే.. లీక్‌ల ప్రకారం వివో X300 ప్రోలో OISతో 50MP సోనీ LYT-828 మెయిన్ సెన్సార్, 50MP శాంసంగ్ JN1 అల్ట్రా-వైడ్ లెన్స్, OISతో 200MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉండవచ్చని సూచిస్తున్నాయి. స్టాండర్డ్ వివో X300లో 200MP శాంసంగ్ HPB ప్రైమరీ సెన్సార్, 50MP LYT-602 పెరిస్కోప్ టెలిఫోటో, ప్రో వేరియంట్‌లో అదే 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయని భావిస్తున్నారు.
ఈ రెండు మోడళ్లలోనూ జీస్-బ్రాండెడ్ కెమెరాలు ఉంటాయని అంచనా. వివో X300 ప్రోలో జీస్ V3+, Vs1 ఇమేజింగ్ చిప్‌లు ఉంటాయని భావిస్తున్నారు. అయితే, వివో X300 కేవలం V3+ చిప్‌తో మాత్రమే రావచ్చు. ఈ రెండు ఫోన్లలో 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండొచ్చు.
భారత్‌లో వివో X300, వివో X300 ప్రో ధర :
వివో X300, వివో X300 ప్రో ధర దాదాపు రూ. 69,999గా ఉంటుందని అంచనా. వివో X300 ప్రో ధర దాదాపు రూ. 99,999గా ఉండవచ్చని చెబుతున్నారు. అధికారిక ధరలు కాదని గమనించాలి.






