Post Office Scheme : మీకు జీతం పడగానే ఇలా పెట్టుబడి పెట్టండి.. రిటైర్మెంట్ తర్వాత ప్రతినెలా రూ.20,500కు పైగా వడ్డీ సంపాదించుకోవచ్చు!
Post Office Scheme : రిటైర్మెంట్ తర్వాత సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా ప్రతినెలా రూ. 20వేలకు పైగా కేవలం వడ్డీనే సంపాదించుకోవచ్చు.
 
                            Post Office Scheme
Post Office Scheme : మీకు వచ్చే నెల జీతం పడగానే ఏదైనా స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. మీరు కూడా ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది మీకోసమే.. ప్రస్తుతం పోస్టాఫీసులో అనేక అద్భుతమైన సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీ భవిష్యత్తులో రిటైర్మెంట్ సమయంలో ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా జీవించాలనుకుంటే ఇప్పటినుంచే పెట్టుబడి పెట్టడం చేయడం మొదలుపెట్టండి.
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడకుండా ఈ పెట్టుబడిపై వచ్చే వడ్డీ డబ్బుతోనే హాయిగా జీవించవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందిల్లా.. పెట్టుబడ పెట్టడమే.. ఇంతకీ ఏ పథకంలో పెట్టుబడి పడితే అధిక లాభాలు వస్తాయంటే.. పోస్టాఫీసు పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) ఒకటి. ఈ పథకంలో మీరు ఒకేసారి రూ. 30 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో వడ్డీ సంపాదించుకోవచ్చు.
సీనయర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ :
ఈ స్కీమ్ (SCSS) అకౌంట్ ఓపెన్ చేయడం అనేది ఏ పోస్టాఫీసులోనైనా ఈజీగా చేయొచ్చు. పైగా ఈ స్కీమ్ ప్రభుత్వ మద్దతుతో ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించారు. మీ పెట్టుబడికి ఫుల్ సేఫ్టీతో పాటు స్థిరమైన రాబడి పొందవచ్చు. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన చేసిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. మీ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి డిపాజిట్ అవుతుంది. సాధారణ ఖర్చులు లేదా రిటైర్మెంట్ తర్వాత భారీ మొత్తంలో వడ్డీని సంపాదించుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా సింగిల్ అకౌంట్ త్రైమాసిక వడ్డీలో రూ. 61,500 వరకు సంపాదించవచ్చు. ఎలాంటి మార్కెట్ రిస్క్ కూడా ఉండదు.
SCSS అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? :
సీనియర్ సిటిజిన్ సేవింగ్స్ అకౌంట్ (SCSS) అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీ సమీపంలోని పోస్టాఫీసు శాఖను సందర్శించి దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. మీరు అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫారమ్‌లో అవసరమైన అన్ని వ్యక్తిగత వివరాలను అందించాలి. మీ ఫొటోగ్రాఫ్‌ను కూడా అటాచ్ చేయాలి. ఐడెంటిటీ ప్రూఫ్ (పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్), అడ్రస్ ప్రూఫ్, వయస్సు రుజువు వంటి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి.
మీరు VRS (స్వచ్ఛంద పదవీ విరమణ పథకం) రిటైర్మెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అవసరమైన ప్రూఫ్స్‌తో పాటు మీరు పనిచేసిన కంపెనీ జారీ చేసిన రిటైర్మెంట్ ప్రూఫ్ కూడా సమర్పించాలి. ఫారమ్‌ను సమర్పించే సమయంలో మీరు డిపాజిట్ పేమెంట్ చెక్కు లేదా క్యాష్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
సీనియర్ సిటిజిన్ డిపాజిట్ నిబంధనలివే :
కనీస డిపాజిట్ : మీరు కనీసం రూ. 1,000 డిపాజిట్‌తో ప్రారంభించవచ్చు. మొత్తం రూ. 1,000 గుణిజాలలో ఉండాలి.
గరిష్ట డిపాజిట్ : ఒక వ్యక్తి అన్ని SCSS అకౌంట్లతో కలిపి గరిష్టంగా రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.
భార్యాభర్తల నిబంధనలు : భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా సింగిల్ అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇందులో గరిష్ట డిపాజిట్ రూ. 30 లక్షలు వరకు ఉంటుంది. ఇద్దరూ వేర్వేరు వ్యక్తిగత అకౌంట్లను కలిగి ఉంటే ప్రతి ఒక్కరూ వారి అకౌంట్లలో రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
SCSS అకౌంటులో వడ్డీ చెల్లింపు ఎలాగంటే? :
పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ ద్వారా ప్రస్తుతం 8.2శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. మార్చి 31, జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికం ఆధారంగా ప్రతి 3 నెలలకు వడ్డీ మీ అకౌంటులో క్రెడిట్ అవుతుంది. డిపాజిట్ తేదీ నుంచి వడ్డీ లెక్కిస్తారు. క్రెడిట్ వడ్డీ మొత్తం మీ సేవింగ్స్ అకౌంటులో మరుసటిరోజు అంటే వరుసగా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 లేదా జనవరి 1న జమ అవుతుంది. మీ సేవింగ్స్ అకౌంటుకు వడ్డీని ఆటోమాటిక్ క్రెడిట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు లేదా ECS (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్) ద్వారా మీ బ్యాంక్ అకౌంటులో నేరుగా పొందవచ్చు. అయితే, ఖాతాదారుడు ప్రతి త్రైమాసికంలో వడ్డీని విత్‌డ్రా చేయకపోతే మొత్తంపై అదనపు వడ్డీ పొందలేరు.
వార్షిక వడ్డీ రేటు : ఏడాదికి 8.2శాతం
మెచ్యూరిటీ కాలం : 5 ఏళ్లు
గరిష్ట డిపాజిట్ : రూ. 30,00,000
త్రైమాసిక వడ్డీ (ప్రతి 3 నెలలకు) : రూ.61,500
నెలవారీ సమాన వడ్డీ : రూ. 20,500
5 ఏళ్లలో మొత్తం వడ్డీ : రూ. 12,30,000
మొత్తం మెచ్యూరిటీ మొత్తం (వడ్డీ విత్‌డ్రా చేయకపోతే): రూ. 42,30,000
SCSS అకౌంట్ పొడిగింపునకు రూల్స్ ఇవే :
మీ SCSS అకౌంట్ అనేకసార్లు పొడిగించవచ్చు. ప్రతిసారీ అదనంగా 3 ఏళ్ల కాలానికి అకౌంట్ పొడిగించవచ్చు. మెచ్యూరిటీ తేదీ నుంచి ఏడాది లోపు చేయాలి. అకౌంట్ పొడిగింపు కోసం మీరు సూచించిన ఫారమ్‌ను నింపి పోస్టాఫీసులో సమర్పించాలి. పొడిగించిన కాలానికి వర్తించే వడ్డీ రేటు మెచ్యూరిటీ తేదీన అమలులో ఉన్న రేటు వర్తిస్తుంది. ఈ ప్రభుత్వ పొదుపు పథకం ద్వారా మరిన్ని ఏళ్లు క్రమం తప్పకుండా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.






