Upcoming Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ నుంచి వివో వరకు నవంబర్‌లో రాబోయే 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. గెట్ రెడీ!

5 Upcoming Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. నవంబర్ నెలలో 5 అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి..

1/6Upcoming Phones
5 Upcoming Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం వచ్చే నవంబర్ నెలలో సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. ఈసారి నవంబర్ నెలలో భారీ మొత్తంలో కొత్త స్మార్ట్‌ఫోన్లు ఆకట్టుకోనున్నాయి. వన్‌ప్లస్, ఐక్యూ నుంచి రియల్‌మి, ఒప్పో, వివో వరకు అనేక మెయిన్ బ్రాండ్లు నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన తర్వాత దేశ మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ నవంబర్‌లో లాంచ్ అవుతున్న 5 అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
2/6OnePlus 15
వన్‌ప్లస్ 15 : వన్‌ప్లస్ అధికారికంగా నవంబర్ 13న వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15R లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. వన్‌ప్లస్ 15 మోడల్ 165Hz రిఫ్రెష్ రేట్, సిరామిక్ గార్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. హుడ్ కింద, అడ్రినో 840 జీపీయూతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ ద్వారా పవర్ పొందవచ్చు. ఈ వన్‌ప్లస్ వైడ్, అల్ట్రా-వైడ్, పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌లతో సహా ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌ కలిగి ఉండవచ్చు. భారత మార్కెట్లో వన్‌ప్లస్ 15 రూ.70వేల కన్నా తక్కువ ధరకే లభించవచ్చు.
3/6iqoo 15
ఐక్యూ 15 : ఐక్యూ రాబోయే ఫ్లాగ్‌షిప్ ఐక్యూ 15 నవంబర్ 26న భారత మార్కెట్లోకి అరంగేట్రం చేయనుంది. 144Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.85-అంగుళాల భారీ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉండొచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, ఆండ్రాయిడ్ 16పై OriginOS 6తో రన్ అవుతుంది. కెమెరా వారీగా ఐక్యూ 15, వన్‌ప్లస్ 15 మాదిరిగానే సెటప్‌ 32MP సెల్ఫీ షూటర్‌ అందిస్తుందని చెబుతున్నారు. భారత మార్కెట్లో ధర దాదాపు రూ.54,999గా ఉంటుందని అంచనా.
4/6Realme GT 8 Pro
రియల్‌మి జీటీ 8 ప్రో (అంచనా) : ఈ నవంబర్‌లో రియల్‌మి GT 8 ప్రోను భారత మార్కెట్లో తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం R1 గేమింగ్ చిప్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండవచ్చు. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 2K ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ కలిగి ఉంటుంది. ఇవన్నీ 7000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ దాదాపు రూ.59,999 ధరకు రిటైల్ అవుతుందని భావిస్తున్నారు.
5/6Oppo Find X9 Pro
ఒప్పో ఫైండ్ X9 ప్రో (అంచనా) : ఒప్పో రాబోయే ఫైండ్ X9 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ ప్యానెల్‌ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. హుడ్ కింద, ఆర్మ్ G1-అల్ట్రా జీపీయూతో మీడియాటెక్ డైమన్షిటీ 9500పై రన్ అవుతుందని భావిస్తున్నారు. 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 80W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 7500mAh బ్యాటరీతో వస్తుంది. భారత మార్కెట్లో ఈ ఒప్పో ధర దాదాపు రూ. 99,999 కావచ్చు.
6/6Vivo X300 Pro
వివో X300 ప్రో (అంచనా) : రాబోయే లైనప్‌లో వివో X300 ప్రో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ ARM G1-అల్ట్రా జీపీయూ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. కెమెరా లీక్‌లతో ట్రిపుల్-లెన్స్ సెటప్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP ప్రైమరీ, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ సూచిస్తున్నాయి. ఇందులో 50MP సెల్ఫీ కెమెరా, 6510mAh బ్యాటరీ, 90W వైర్డు ప్లస్ 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు కూడా ఉండవచ్చు. వివో X300 ధర రూ. 69,999 నుంచి ప్రారంభమై ప్రో మోడల్‌కు రూ. 99,999 వరకు ధర ఉండవచ్చు.