Vivo Y28s 5G Price : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత్‌లో వివో Y28s 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Vivo Y28s 5G Price : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వివో వై28ఎస్ 5జీ ఇప్పుడు భారత మార్కెట్లో 4జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 13,499, 6జీబీ, 8జీబీ వేరియంట్‌లు వరుసగా రూ. 14,999, రూ, 16,499కు పొందవచ్చు.

Vivo Y28s 5G Price : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత్‌లో వివో Y28s 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Vivo Y28s 5G Price in India Reduced: See New Price, Availability

Updated On : October 6, 2024 / 11:09 PM IST

Vivo Y28s 5G Price : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో వివో సరికొత్త Y28s 5జీ ఫోన్ ధర తగ్గింది. ఈ ఏడాది జూలైలోనే వివో Y28e 5జీ ఫోన్ లాంచ్ అయింది. వివో వై28ఎస్ 5జీ ధరను రూ. 500 తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా 8జీబీ వరకు ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. 6.56-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్, ఐపీ64-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది.

భారత్‌లో వివో వై28ఎస్ 5జీ కొత్త ధర ఎంతంటే? :
వివో వై28ఎస్ 5జీ ఇప్పుడు భారత మార్కెట్లో 4జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 13,499, 6జీబీ, 8జీబీ వేరియంట్‌లు వరుసగా రూ. 14,999, రూ, 16,499కు పొందవచ్చు. అదేవిధంగా 128జీబీ స్టోరేజీ వేరియంట్ కూడా అదే ధరలో పొందవచ్చు. వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ షేడ్స్‌లో అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది. వివో వై28ఎస్ 5జీ 4జీబీ ఆప్షన్ ధర రూ. 13,999, 6జీబీ, 8జీబీ వెర్షన్లు వరుసగా రూ. 15,499, రూ. 16,999కు పొందవచ్చు.

వివో వై28ఎస్ 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
వివో వై28ఎస్ 5జీ ఫోన్ 6.56-అంగుళాల హెచ్‌డీ+ (720×1,612 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 840నిట్స్ హై బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ ఇఎమ్ఎమ్సీ 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది.

కెమెరా విభాగంలో వివో వై28ఎస్ 5జీ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08ఎంపీ సెకండరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. వివో వై28ఎస్ 5జీ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 15డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, వై-ఫై ఉన్నాయి. సెక్యూరిటీ విషయానికి వస్తే.. హ్యాండ్‌సెట్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64 రేటింగ్‌తో వస్తుంది.

Read Also : Xiaomi 15 Pro Leak : మూడు కలర్ ఆప్షన్లలో కొత్త షావోమీ 15 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే స్పెసిఫికేషన్‌లు లీక్..!