Vivo Y31T 5G Price : కొత్త వివో 5G ఫోన్ వస్తోంది.. అబ్బబ్బా.. ఫీచర్లు మాత్రం అరాచకం భయ్యా.. ధర ఇంతేనా?
Vivo Y31T 5G Price : వివో ఫోన్ వచ్చేస్తోంది.. భారత మార్కెట్లో వివో వై31టీ 5జీ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP బోకె కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాతో రానుంది.
Vivo Y31T 5G Price
- 50MP ప్రైమరీ కెమెరాతో వివో Y31T 5G ఫోన్
- స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, ఒరిజిన్ఓఎస్ 6
- 7,200mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరా
Vivo Y31T 5G Price : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. అతి త్వరలో భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వివో Y31T 5జీ కీలక స్పెసిఫికేషన్లను ఆ కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత వివో ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది.
వివో వై31టీ 5జీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,250 నిట్స్ టాప్ బ్రైట్నెస్ లెవల్ 6.75-అంగుళాల HD+ (720 x 1,608 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,200 mAh బ్యాటరీ ఉంటుంది.
వివో వై31టీ 5జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డెన్ మిస్ట్, సీషోర్, క్రిమ్సన్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
వివో ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
టిప్‌స్టర్ ప్రకారం.. రాబోయే వివో వై సిరీస్ ఫోన్ ధర లీక్ అయింది. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్‌తో వివో వై31టీ 5జీ బేస్ వేరియంట్ ధర రూ. 25,999గా ఉండనుంది. అయితే, కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ఇంకా రివీల్ చేయలేదు. భారత మార్కెట్లో వివో ఆన్లైన్ స్టోర్‌లో ఇదివరకే ఈ ఫోన్ లిస్టు అయింది. వివో Y31T 5జీ ఫోన్ 4GB + 128GB, 6GB + 128GB, 6GB + 256GB వేరియంట్లలో లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డెన్ మిస్ట్, సీషోర్, క్రిమ్సన్ రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వివో వై31టీ 5జీలో 120Hz రిఫ్రెష్ రేట్, 1,250 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 83 శాతం NTSC కవరేజ్‌తో 6.75-అంగుళాల HD+ (720 x 1,608 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆధారిత వివో ఒరిజిన్ఓఎస్ 6పై కూడా రన్ అవుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP బోకె కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. వివో వై31టీ 5జీ ఫోన్ 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 7,200mAh బ్యాటరీతో రన్ అవుతుంది. సేఫ్టీ కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.
