Vodafone Idea : రిలయన్స్ జియోకు పోటీగా.. మొబైల్ గేమింగ్ మార్కెట్లోకి వోడాఫోన్ ఐడియా ఎంట్రీ..!
Vodafone Idea Vi Games Service : రిలయన్స్ జియోకు పోటీగా వోడాఫోన్ ఐడియా కొత్త సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో మాదిరిగా మొబైల్ గేమింగ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Vodafone Idea Enters Mobile Gaming Market With Vi Games Service
Vodafone Idea Vi Games Service : రిలయన్స్ జియోకు పోటీగా వోడాఫోన్ ఐడియా కొత్త సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో మాదిరిగా మొబైల్ గేమింగ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వోడాఫోఫ్ ఐడియా తమ యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు ఈ మొబైల్ గేమింగ్ సర్వీసును అందిస్తోంది. అందులోభాగంగానే వొడాఫాన్ ఐడియా వీఐ గేమ్స్ (Vi Games)ను లాంచ్ చేసింది. ప్రముఖ గేమింగ్ సంస్థ నజారా టెక్నాలజీస్ (Nazara Technologies)తో వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఇండియాలో గేమింగ్ సెక్టార్ కు డిమాండ్ పెరిగిపోతోంది. ఆన్ లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య భారీ సంఖ్యలో పెరిగిపోతున్నారు. ప్రస్తుత డిమాండ్ దృష్ట్యా పలు టెలికాం సంస్థలు గేమింగ్ సెక్టార్‌పై దృష్టిపెడుతున్నాయి. అలాగే గేమింగ్ సర్వీసుపై పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యాయి. ఈ కొత్త ఒప్పందంలో భాగంగా వొడాఫోన్ ఐడియా యూజర్లు వీఐ యాప్ (Vi) యాప్‌లోనే మొబైల్ గేమ్స్ ఆడుకోవచ్చు. Vi యాప్‌లో యూజర్లు 1200పైగా ఆండ్రాయిడ్, HTML 5 ఆధారిత మొబైల్ గేమ్స్‌ను ఆడుకోవచ్చు. అంతేకాదు.. క్యాజువల్, ఎడ్యుకేషన్, ఫన్, పజిల్, స్ట్రాటజీ, యాక్షన్, అడ్వెంచర్, రేసింగ్, స్పోర్ట్స్ మొబైల్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి.
అందులో మొత్తం 10 జానర్లకు చెందిన గేమ్‌లు ఉంటాయి. ఈ మొబైల్ గేమ్స్ మూడు కేటగిరీల్లో ఉంటాయి. 250 గేమ్స్ వరకు వోడాఫోన్ యూజర్లు ఉచితంగా ఆడవచ్చు. వీఐ గేమ్స్‌ను ఫ్రీ, ప్లాటినం, గోల్డ్ మూడు టారిఫ్ రిఫ్ స్ట్రక్చర్‌తో వొడాఫోన్ ఐడియా ప్రవేశపెట్టింది. ఈ VI Free Mobile Games యాప్ అందించే సర్వీసులో భాగంగా వోడాఫోన్ ఐడియా యూజర్లు.. ఈ గేమ్స్ ఆడాలంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్లాటినమ్ గేమ్స్ కేటగిరీలో ప్రీమియమ్ గేమ్స్ కూడా వోడాఫోన్ ఐడియా యూజర్లు ఆడుకోవచ్చు. ప్రతీ గేమ్ డౌన్‌లోడ్‌కు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే ప్రీపెయిడ్ యూజర్లు రూ.26 వరకు పే చేయాలి. గోల్డ్ గేమ్స్ కేటగిరీలో భాగంగా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.50, ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.56 టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. FICCI-EY నివేదిక ప్రకారం.. 2022లో మాత్రమే 500 మిలియన్ల మంది యూజర్లను దాటగలదని వోడాఫోన్ ఐడియా అంచనా వేసింది. భారత్ PC, మొబైల్ గేమింగ్ ఆదాయం 2025లో దాదాపు 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 11,500) చేరుకోవచ్చని మార్కెట్ కన్సల్టింగ్ సంస్థ నికో పార్ట్‌నర్స్ నివేదిక అంచనా వేసింది. Vodafone Idea ప్రస్తుతం నష్టాలను ఎదుర్కొంటోంది. గత కొన్ని నెలలుగా కొత్త సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతోంది. అందుకే వోడాఫోన్ ఐడియా తమ కంటెంట్ ద్వారా కొత్త కస్టమర్‌లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.
Read Also : Jio World Center: ‘జియో వరల్డ్ సెంటర్’ని ప్రారంభించిన రిలయన్స్ ఇండస్ట్రీస్