Jio World Center: ‘జియో వరల్డ్ సెంటర్‌’ని ప్రారంభించిన రిలయన్స్ ఇండస్ట్రీస్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శుక్రవారం దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక బహుముఖ డెస్టినేషన్ అయిన జియో వరల్డ్ సెంటర్‌ని ప్రారంభించింది.

Jio World Center: ‘జియో వరల్డ్ సెంటర్‌’ని ప్రారంభించిన రిలయన్స్ ఇండస్ట్రీస్

Nita Ambani

Jio World Center: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శుక్రవారం దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక బహుముఖ డెస్టినేషన్ అయిన జియో వరల్డ్ సెంటర్‌ని ప్రారంభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతా అంబానీ ప్లాన్ చేసిన ఈ కేంద్రం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో 18.5 ఎకరాల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఫలితంగా దేశానికి, పౌరులకి ప్రపంచ స్థాయి గుర్తింపుని ఇవ్వనుంది.

ముందుగా ధీరుభాయ్ అంబానీ స్క్వేర్, ముంబై నగరంలోని మ్యూజికల్ ఫౌంటైన్ ఆఫ్ జాయ్‌తో ఆవిష్కరించి భారతదేశంలోని అతిపెద్ద, అత్యుత్తమ జియోవరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ సెంటర్లని ప్రస్తుత, వచ్చే సంవత్సరాలలో దశలవారీగా ప్రారంభించాలని ప్లాన్ చేశారు.

జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, భారతదేశం యొక్క అత్యుత్తమ, అతిపెద్ద కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సౌకర్యాలను అందిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్స్ ఎకో సిస్టమ్‌లో భారతదేశాన్ని ముందంజలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ భారతదేశాన్ని, ముంబై నగరానికి శాశ్వత సహాయకారిగా ఉంటుంది.

జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్… వినియోగదారుల ప్రదర్శనలు, సమావేశాలు, ప్రదర్శనలు, మెగా కచేరీలు, గొప్ప విందులు మరియు వివాహాలతో సహా విశిష్ట వ్యాపార మరియు సామాజిక కార్యక్రమాలకు భారతదేశపు అగ్రగామి వేదికగా ఏర్పాటు చేయబడింది. ఈ మల్టీ డైమెన్షనల్ వేదిక భారతదేశంలో సాంకేతికతతో కూడిన పరివర్తనాత్మక ప్రదేశాలతో ప్రపంచ ప్రమాణాలను సెట్ చేస్తుంది.

Read Also: జియో వరల్డ్ సెంటర్ వేదికగా 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సదస్సు

జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకతలు:
* 161460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 3 ఎగ్జిబిషన్ హాళ్లు 16,500 మంది అతిథులకు సదుపాయం
* 107640 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండు సమావేశ మందిరాలు 10,640 మంది అతిథులకు వసతి
* 32290 చదరపు అడుగుల సువిశాలమైన బాల్ రూమ్ 3200 మంది అతిథులకు చోటు
* 29062 చదరపు అడుగుల మొత్తం వైశాల్యంతో 25 సమావేశ గదులు
* అన్ని లెవెల్స్ లో 139930 చదరపు అడుగుల వైశాల్యం గల ప్రీ-ఫంక్షన్ కాన్కోర్స్
* అత్యాధునిక 5G నెట్‌వర్క్ సాయంతో హైబ్రిడ్ మరియు డిజిటల్ అనుభవం
* రోజుకు 18,000 కంటే మించి భోజనాలను అందించే సామర్థ్యం గల అతిపెద్ద వంటగది
* 5,000 కార్ల పార్కింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్‌లో భారతదేశంలో అతిపెద్ద ఆన్-సైట్ పార్కింగ్ సదుపాయం

భారతదేశంలో మొట్టమొదటి డెస్టినేషన్ జియో వరల్డ్ సెంటర్ లో సాంస్కృతిక కేంద్రం, మ్యూజికల్ ఫౌంటెన్, ఉన్నత స్థాయి రిటైల్ అనుభవం, కెఫేలు, చక్కటి డైనింగ్ రెస్టారెంట్లు, సర్వీస్డ్ అపార్ట్మెంట్లు, ఆఫీసులు, అత్యాధునిక కన్వెన్షన్ ఫెసిలిటీ ఉన్నాయి.

కేంద్రం కోసం తన దార్శనికతను పంచుకున్న నీతా అంబానీ మాట్లాడుతూ, “జియో వరల్డ్ సెంటర్ అద్భుతమైన దేశానికి.. న్యూ ఇండియా ఆకాంక్షలకు ప్రతిబింబం. అతిపెద్ద సమావేశాల నుంచి సాంస్కృతిక అనుభవాల నుంచి పాత్ బ్రేకింగ్ రిటైల్, భోజన సౌకర్యాల వరకు, జియో వరల్డ్ సెంటర్ ముంబై కొత్త మైలురాయిగా నిలుస్తుంది, ఇది భారతదేశం వృద్ధిలో కొత్త అధ్యాయానికి నాందిగా నిలుస్తుంది,” అన్నారు.

Read Also: “గ్లాన్స్”లో రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్ “జియో”

ధీరూభాయ్ అంబానీ స్క్వేర్
ముంబై నగరంలో మైలురాయిగా నిలిచింది ధీరూభాయ్ అంబానీ స్క్వేర్. రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీకి, ముంబై నగరానికి దీనిని అంకితం చేశారు. ఇందులోకి ఉచిత ప్రవేశంతో పాటు బహిరంగ ప్రదేశం కలిగి ఉండి పర్యాటకులకి, స్థానిక పౌరులకి తప్పక చూడవలసిన గమ్యస్థానంగా మారింది.

ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ ఫౌంటైన్ ఆఫ్ జాయ్ చుట్టూ ఫౌంటైన్ ఆఫ్ జాయ్‌లో నీరు, లైట్లు, మ్యూజిక్ అన్నీ కలిసి అద్భుతంగా ఉంటుంది. ఈ ఫౌంటైన్ భారతదేశం, దేశాన్ని గుర్తుచేసే అనేక రంగులకి చిహ్నంగా ఉంటుంది. ఇందులో ఎనిమిది ఫైర్ షూటర్లు, 392 వాటర్ జెట్లు, 600 కు పైగా ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. సంగీతానికి అనుగుణంగా నృత్యం చేసే విక

సిస్తున్న తామర రేకులతో మరపురాని ప్రదర్శనను సృష్టిస్తాయి.

మ్యూజికల్ ఫౌంటెన్‌ని అంకితం చేస్తూ నీతా అంబానీ మాట్లాడుతూ, “ఎంతో సంతోషంతో గర్వంతో, ధీరూభాయ్ అంబానీ స్క్వేర్, ప్రపంచ స్థాయి ఫౌంటైన్ ఆఫ్ జాయ్‌ని ముంబై ప్రజలకి నగరానికి అంకితం చేస్తున్నాం. నగరస్ఫూర్తిని పురస్కరించుకుని, ప్రజలు ఆనందాలని పంచుకునే, ఆంచి ముంబై రంగులు, శబ్దాలలో మునిగితేలే కొత్త బహిరంగ ప్రదేశం అవుతుంది! ప్రారంభం చేసే రాత్రి ఉపాధ్యాయులకు ప్రత్యేక గౌరవ ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉంది. స్వయంగా ఉపాధ్యాయురాలిని అవ్వడంతో, ఈ కష్ట సమయాల్లో అవిశ్రాంతంగా పనిచేసినందుకు, జ్ఞానాన్ని పంచుతున్నందుకు ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గౌరవ ప్రదర్శన ఈ నిజమైన హీరోలని ప్రశంసిస్తుంది.”

రెండు సంవత్సరాలలో జ్ఞానాన్ని పంచినందుకు, తర్వాతి తరాలలో కూడా మన దేశం ఈ దిశగా ప్రయాణించడానికి కొత్త బోధనా పద్ధతులకి అనుగుణంగా వారు చేసిన కృషికి గౌరవసూచకంగా ముంబై అంతటా బీఎంసీ పాఠశాలలు, ఇతర పాఠశాలలకు చెందిన 250 మందికి పైగా ఉపాధ్యాయులని ప్రారంభ ప్రదర్శనకి ఆహ్వానించారు.

ప్రతిరోజూ ఈ స్క్వేర్ లో ఈవెనింగ్ షోలు ప్రదర్శిస్తారు. dhirubhaiambanisquare.com వెబ్ సైట్ ద్వారా ఉచిత ఎంట్రీ పాస్‌లను బుక్ చేసుకోవచ్చు.