Vodafone Idea Plan
Vodafone Idea Plan : వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్.. నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? వోడాఫోన్ ఐడియా అందించే సరికొత్త రూ. 548 ప్లాన్ తీసుకోండి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల సర్వీసు వ్యాలిడిటీతో వస్తుంది. ప్రీపెయిడ్ వినియోగదారులు లాంగ్ వ్యాలిడిటీతో కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
అవసరమైనప్పుడు మాత్రమే డేటాను వాడేవారికి ఈ ప్లాన్ (Vodafone Idea Plan) బెటర్ అని చెప్పొచ్చు. యాక్టివ్ సిమ్ కోసం ఈ ప్యాక్ ఎంచుకోవచ్చు. ఇంతకీ ఈ రూ. 548 ప్లాన్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం..
వోడాఫోన్ ఐడియా రూ. 548 ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్ల కోసం రూ. 548 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందిస్తుంది. రోజంతా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. మొత్తం వ్యాలిడిటీ 7GB డేటా అందిస్తుంది. రోజువారీ లిమిట్ లేదు. 7GB బ్రౌజింగ్ చేసుకోవచ్చు. అవసరమైతే స్పెషల్ డేటా వోచర్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ఎలాంటి యాడ్-ఆన్ యాప్ బెనిఫిట్స్ లేదా OTT యాక్సెస్ పొందవచ్చు.
సర్వీస్ వ్యాలిడిటీ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల సర్వీస్ వ్యాలిడిటీని అందిస్తుంది. మిడ్-టర్మ్ ఆప్షన్ లాంటిది. వినియోగదారులు నెలవారీ ఖర్చు లేకుండా నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. రోజుకు ఖర్చు దాదాపు రూ. 6.52 అవుతుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, లాంగ్ వ్యాలిడిటీని కోరుకునే యూజర్లకు బెస్ట్. చాలా మంది యూజర్లు Wi-Fi లేదా డేటా ప్యాక్‌లను అవసరాన్ని బట్టి వాడుతుంటారు.
ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్? :
రూ. 548 ప్లాన్ మొబైల్ డేటా కన్నా కాల్స్ ఎక్కువగా ఇష్టపడే యూజర్లకు బెటర్. ఇంట్లో లేదా ఆఫీసులో Wi-Fi ఉన్నవారికి అప్పుడప్పుడు మొబైల్ డేటా వాడే వారికి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్లాన్ విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, సెకండరీ సిమ్ యూజర్లకు బెటర్. ఎందుకంటే.. తక్కువ ఖర్చుతో మీ మొబైల్ నంబర్ యాక్టివ్ చేసుకోవచ్చు. రోజువారీ మొబైల్ డేటాపై ఆధారపడే యూజర్లు 7GB చాలా తక్కువే. అధిక డేటాతో ప్యాక్‌లను ఎంచుకోవచ్చు.
డేటా వోచర్ ఆప్షన్లు :
వోడాఫోన్ ఐడియా ప్రత్యేక డేటా వోచర్‌లను అందిస్తుంది. తక్కువ డేటా అవసరమయ్యే యూజర్లకు బెస్ట్. రూ.22 నుంచి డేటా వోచర్లు ఉన్నాయి. ఒకటి లేదా రెండు రోజులు అదనపు డేటా అవసరమైతే ఇలాంటి వోచర్‌లు ఎంచుకోవచ్చు. ఇందులో ప్రతి ఒక్కటి లిమిటెడ్ వ్యాలిడిటీతో లభిస్తాయి. ధరలు వేర్వేరు ఉంటాయి. రూ.548 ప్లాన్ డేటా ఎక్కువ ఉండదు. అందుకే చాలా మంది యూజర్లు ఇలాంటి చిన్న వోచర్‌లను ఎంచుకుంటారు.