WhatsApp: 16లక్షల ఇండియన్ అకౌంట్లు బ్యాన్ చేసిన వాట్సప్
వాట్సప్ ఏప్రిల్ 2022కు సంబంధించి నెలవారీ రిపోర్టును బుధవారం పబ్లిష్ చేసిది. అందులోని డేటా ప్రకారం.. మెటా మెసేజింగ్ ప్లాట్ ఫాం అయిన వాట్సప్ ఒక్క ఏప్రిల్ నెలలో 16లక్షల 66వేల అకౌంట్లు బ్యాన్ చేసినట్లు తెలిసింది. ఐటీ యాక్ట్ రూల్ 4(1)(d) ప్రకారం.. రిపోర్ట్ పబ్లిష్ అయింది.

Whatsapp’s Upcoming Feature May Let You Store Disappearing Messages Forever (1)
WhatsApp: వాట్సప్ ఏప్రిల్ 2022కు సంబంధించి నెలవారీ రిపోర్టును బుధవారం పబ్లిష్ చేసిది. అందులోని డేటా ప్రకారం.. మెటా మెసేజింగ్ ప్లాట్ ఫాం అయిన వాట్సప్ ఒక్క ఏప్రిల్ నెలలో 16లక్షల 66వేల అకౌంట్లు బ్యాన్ చేసినట్లు తెలిసింది. ఐటీ యాక్ట్ రూల్ 4(1)(d) ప్రకారం.. రిపోర్ట్ పబ్లిష్ అయింది.
“ఐటీ రూల్స్ 2021 ప్రకారం, ఏప్రిల్ 2022 నెలలో రిపోర్టును పబ్లిష్ చేశాం. ఈ యూజర్ సేఫ్టీ రిపోర్టులో స్వీకరించిన ఫిర్యాదులు , WhatsApp ద్వారా తీసుకున్న సంబంధిత చర్యల వివరాలు అలాగే WhatsApp జాగ్రత్త చర్యలు పొందుపరిచాం. మా ప్లాట్‌ఫామ్‌పై దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం వంటివి లిస్ట్ చేశాం. రీసెంట్ నెలవారీ నివేదికలో చెప్పినట్లుగా WhatsApp ఏప్రిల్ నెలలో 1.6 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించింది” అని వాట్సాప్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
అంతకుముందు, మార్చిలో ప్లాట్‌ఫారమ్ దేశంలో 18 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. ఏప్రిల్ నెలలో, WhatsApp 844 ఫిర్యాదులు అందుకుంది. 844 ఫిర్యాదుల నివేదికలలో, 670 నివేదికలు నిషేధ అప్పీల్ కోసం, మిగిలినవి సపోర్ట్, సేఫ్టీ వంటి ఇతరత్రా అంశాలు ఉన్నాయి.
Read Also: ఒకే వాట్సప్ అకౌంట్.. వేరే ఫోన్‌లో కూడా
గత నెలతో పోల్చి చూస్తే, వాట్సాప్‌కు మార్చిలో 597 ఫిర్యాదుల నివేదికలు అందాయి.
“ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో WhatsApp పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. సంవత్సరాలుగా, మా ప్లాట్‌ఫారమ్‌లో మా వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతికత, డేటా శాస్త్రవేత్తలు, నిపుణులు, ప్రక్రియలలో స్థిరమైన చర్యలు తీసుకుంటున్నాం” అని అధికారులు స్పష్టం చేశారు.