WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై ఒక నిమిషం వరకు వీడియోలను స్టేటస్ అప్‌డేట్‌గా పెట్టుకోవచ్చు!

WhatsApp New Feature : ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కసరత్తు చేస్తోంది. త్వరలో ఒక నిమిషం వరకు వీడియోలను స్టేటస్ అప్‌డేట్‌గా షేర్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.

WhatsApp bringing new feature soon, will let users share videos of up to 1 minute as status update

WhatsApp New Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అందులో ప్రధానంగా ఎన్‌క్రిప్ట్ చేసినా మెసేజ్‌లు డిస్‌ప్లే చేయడం, ఇతర యూజర్ల ప్రొఫైల్ ఫొటోలను స్క్రీన్‌షాట్‌లను తీయకుండా నిరోధించడం, ఎవరైనా స్టేటస్ అప్‌డేట్‌లలో ఎప్పుడు పెట్టారో ఇతర యూజర్లకు తెలియజేయడం వంటి అనేక కొత్త అప్‌డేట్‌లను ప్రకటించింది. అయితే, వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు యూజర్లను అనుమతించనుంది.

Read Also : Realme Narzo 70 Pro : రియల్‌మి కొత్త నార్జో 70ప్రో వచ్చేసింది.. ఈ 5జీ ఫోన్ టచ్ చేయకుండానే ఆపరేట్ చేయొచ్చు తెలుసా? ధర ఎంతంటే?

వాట్సాప్ కొత్త ఫీచర్ ఇదే :
నివేదిక ప్రకారం.. వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వినియోగదారులు ఒక నిమిషం వీడియోలను స్టేటస్ అప్‌డేట్‌లుగా అప్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుతానికి, వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో గరిష్టంగా 30 సెకన్ల వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. అందువల్ల, లాంగ్ వీడియోలను వారి స్టేటస్ అప్‌లోడ్ చేయాలనుకునే యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

వీడియో స్టేటస్ వ్యవధిని పొడిగించడంపై వాట్సాప్ యూజర్ అభిప్రాయాన్ని కోరింది. స్టేటస్ అప్‌డేట్‌లుగా ఎక్కువ వీడియోలను షేర్ చేయగల సామర్థ్యాన్ని పెంచాలని ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు కోరారు. ఇప్పటివరకూ 30 సెకన్ల పరిమితితో యూజర్లు వీడియోలను షేర్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. రాబోయే కొత్త ఫీచర్ ద్వారా ఒక నిమిషం వ్యవధితో యూజర్లు తమ మెసేజ్ ఎడిటింగ్ అవసరం లేకుండా మరింత లాంగ్ వీడియో కంటెంట్‌ను షేర్ చేయవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ సరికొత్త వాట్సాప్ బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోలను షేర్ చేసే ఫీచర్ అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది. రాబోయే వారాల్లో మరింత మంది వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా షేర్ చేసిన లాంగ్ వీడియోలను వీక్షించడానికి యూజర్లు వాట్సాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఇతర ఫీచర్లు ఇవే :
ఇటీవలి నివేదికలో కూడా వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌లలో తమ కాంటాక్టులను షేర్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుందని సూచించింది. అలాంటి అప్‌డేట్‌లలో పేర్కొన్న యూజర్లు నోటిఫికేషన్‌ను కూడా పొందవచ్చు. ఇతరులు షేర్ చేసిన స్టేటస్ అప్‌డేట్‌లతో యూజర్లు ఒకరినొకరు ఇంటరాక్ట్ అయ్యేందుకు అనుమతి ఉంటుంది. తద్వారా యాప్‌లో యూజర్ ఎంగేజ్‌మెంట్ పెంచడానికి వీలుంటుంది.

అంతేకాదు.. వాట్సాప్ కూడా సులభంగా క్యూఆర్ పేమెంట్లను చేసేలా కృషి చేస్తోంది. మెసేజింగ్ యాప్ క్యూఆర్ కోడ్‌ను చాట్‌ల ట్యాబ్ నుంచి నేరుగా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందుకోసం మీరు వాట్సాప్ సెట్టింగ్‌ ఆప్షన్‌కు వెళ్లాలి. అదనంగా, మీ క్యూఆర్ కోడ్‌ను షేర్ చేసినప్పుడు.. వాట్సాప్ మీ ఫోన్ నంబర్‌కు బదులుగా మీ యూజర్ నేమ్ కనిపిస్తుంది. వాట్సాప్ యూజర్‌నేమ్ సపోర్ట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఫీచర్ అందుబాటులోకి రావచ్చు.

Read Also : Samsung Galaxy M55 5G : శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్‌కు ముందే కలర్ ఆప్షన్లు లీక్..

ట్రెండింగ్ వార్తలు