WhatsApp Channels : వాట్సాప్‌‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఛానెల్స్‌లో ఫొటోలు, వీడియోలతో ఆటోమాటిక్ ఆల్బమ్ గ్యాలరీ క్రియేట్ చేసుకోవచ్చు!

WhatsApp Channels : వాట్సాప్ ఛానెల్‌లలో 'ఆటోమేటిక్ ఆల్బమ్' ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. అడ్మిన్‌లు షేర్ చేసిన మల్టీ ఫొటోలు లేదా వీడియోలను ఒకేచోట ఆల్బమ్ మాదిరిగా క్రియేట్ చేసుకోవచ్చు.

WhatsApp Channels to soon get an Automatic Album feature

WhatsApp Channels : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ ఏడాదిలో ఛానెల్స్ ప్రవేశపెట్టింది. వినియోగదారులకు తమ ఫాలోవర్లతో ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి ఈ కొత్త మార్గాన్ని అందిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌క్యాస్ట్ గ్రూపుల మాదిరిగానే ఈ ఫీచర్ వినియోగదారులను అంకితమైన గ్రూపులను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది.

ఇక్కడ అడ్మిన్లు మాత్రమే కమ్యూనికేట్ చేయగలరు. వారు మాత్రమే మెసేజ్‌లను పంపగలరు. అయితే, ఫాలోవర్లు ఎమోజీలతో రెస్పాండ్ కాగలరు. అదనంగా, ఛానెల్స్‌కు ‘ఆటోమేటిక్ ఆల్బమ్’ అనే ఫీచర్‌తో పాటు సరికొత్త అప్‌డేట్‌లతో వాట్సాప్ ఛానెల్‌లను మెరుగుపరచడంలో మెటా చురుకుగా పనిచేస్తోంది.

Read Also : Realme Christmas Sale : అమెజాన్‌లో రియల్‌మి క్రిస్మస్ సేల్.. ఈ నార్జో స్మార్ట్‌ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

వాట్సాప్ డెవలప్‌మెంట్‌లను ట్రాక్ చేసేందుకు వెబ్‌సైట్ Wabetainfo, గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో ఉన్న బీటా వెర్షన్ 2.23.26.16లో ఈ కొత్త ఆల్బమ్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోందని రిపోర్టు తెలిపింది. వ్యక్తిగత, గ్రూపు చాట్‌ల మాదిరిగానే మల్టీ ఫొటోలు లేదా వీడియోలు వరుసగా షేర్ చేసినప్పుడు వాట్సాప్ ఛానెల్‌లు ఇప్పుడు ఆటోమాటిక్‌గా ఆల్బమ్‌లను క్రియేట్ చేస్తాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో విస్తృత యూజర్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు.

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది? :
ఆల్బమ్ ఫీచర్ ఛానెల్‌లలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మీడియా ఫైళ్లను మరింత సులభతరం చేస్తుంది. అడ్మిన్లు మల్టీ ఫొటోలు లేదా వీడియోలను షేర్ చేసినప్పుడల్లా వాట్సాప్ వాటిని ఆటోమాటిక్‌గా ఒకే ఆల్బమ్‌గా క్రియేట్ చేస్తుంది. కంటెంట్ విజువల్ ప్రెజెంటేషన్‌ను మెరుగుపరచడమే కాకుండా ఛానెల్ ఫాలోవర్లకు యాక్సస్ అందిస్తుంది.

ఈ ఫీచర్ మొత్తం మీడియా సేకరణను యాక్సెస్ చేయడానికి ఆటోమేటిక్ ఆల్బమ్‌పై సౌకర్యవంతంగా నొక్కడానికి యూజర్లను అనుమతిస్తుంది. షేర్డ్ మీడియా కంటెంట్ నావిగేషన్‌ను సులభతరం చేస్తుంది. పర్సనల్ మెసేజ్ బబుల్‌లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

WhatsApp Channels Automatic Album feature

అదనంగా, ఆటోమాటిక్‌గా ఆల్బమ్ ఫీచర్ మరో ముఖ్య ప్రయోజనం ఏంటంటే? షేర్డ్ ఆల్బమ్‌లలో ఛానెల్ రియాక్షన్లకు సపోర్టు చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపరుస్తుంది. మీడియా కంటెంట్ సందర్భంలో నేరుగా వారి ఆలోచనలు, భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి వారిని అనుమతిస్తుంది. ఛానెల్ అడ్మిన్లు ఈ అప్‌డేట్ నుంచి మరింత ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే అడ్మిన్లు షేరింగ్ మీడియా సంస్థను మెరుగుపరచడంలో సాయపడుతుంది.

వాట్సాప్ పిన్ మెసేజ్ :
వాట్సాప్ ఛానెల్‌లతో పాటు చాట్‌లతో సహా కొత్త అప్‌డేట్‌లపై పనిచేస్తోంది. ఇప్పటికే కొన్ని అప్‌డేట్స్ వాట్సాప్ రిలీజ్ చేసింది. వినియోగదారులందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగత లేదా గ్రూపు చాట్‌లలో మెసేజ్‌లను పిన్ చేయగల సామర్థ్యం లేటెస్ట్ ఫీచర్‌లలో ఒకటి. పిన్ మెసేజ్ ఫీచర్ వాట్సాప్ పిన్ చాట్ ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఈ ఫీచర్ వినియోగదారులు హైలైట్ చేయాలనుకుంటున్న ఏదైనా నిర్దిష్ట మెసేజ్ పిన్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌కి గంటలు లేదా రోజుల సమయ పరిమితి కూడా ఉంది.

వినియోగదారులు వ్యవధిని సెట్ చేయడానికి అనుమతిస్తుంది. సెట్ చేసిన సమయం తర్వాత పిన్ చేసిన మెసేజ్ ఆటోమాటిక్‌గా టాప్ ప్లేస్ నుంచి అన్ పిన్ చేయడం జరుగుతుంది. కానీ, మెసేజ్ విండోలో ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, వినియోగదారులు చాట్‌లో పిన్ చేయాలనుకుంటున్న మెసేజ్ ఎంచుకోవాలి. ఆపై పాప్-అప్ మెను నుంచి పిన్ ఆప్షన్ ఎంచుకోవడమే..

Read Also : Apple iPhone 14 Sale : ఆపిల్ ఐఫోన్ 14పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ.24,999కే కొనుగోలు చేయొచ్చు.. డోంట్ మిస్!