Tech Tips and Tricks : మీ వాట్సాప్ మెసేజ్‌లు సేఫ్‌గా ఉండాలంటే.. కంపెనీ ఎగ్జిక్యూటివ్ చెప్పిన టాప్ 5 టిప్స్ పాటించాల్సిందే..!

Tech Tips and Tricks : వాట్సాప్ అకౌంట్ వాడుతున్నారా? మీ వ్యక్తిగత చాట్, ఇతర డేటా సురక్షితమేనా? ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం అనేక ప్రైవసీ ఫీచర్లు ఉన్నాయి. మరింత భద్రత కోసం టాప్ 5 టిప్స్ గురించి తెలుసుకోండి.

WhatsApp executive reveals top 5 hacks to keep messages private and secure

Tech Tips and Tricks : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2.7 బిలియన్లకు పైగా వినియోగదారులతో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్‌లలో ఒకటిగా నిలిచింది. వాట్సాప్ తన వినియోగదారులకు అత్యంత సురక్షితమైన అనుభవాన్ని అందించడానికి ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లు, ప్రైవసీపరంగా అనేక చర్యలు చేపడుతోంది. అయితే, ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే వాట్సాప్ ప్లాట్ ఫారంపై అనేక రిస్క్‌లు ఉన్నాయి.

అందుకే, వాట్సాప్ ఐఓఎస్, వాట్సాప్ ఆండ్రాయిడ్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, యాప్ లాక్, మరెన్నో ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో మీ అకౌంట్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి ఒకటి కన్నా ఎక్కువ మార్గాలు ఉన్నాయి. మీ వాట్సాప్‌కు మరింత భద్రతను జోడించే 5 అద్భుతమైన టిప్స్ అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్‌లో గ్రోత్ అండ్ ప్రైవసీ డైరెక్టర్ ఉజ్మా హుస్సేన్ నుంచి ఈ టిప్స్ అందిస్తున్నారు. తద్వారా మీ వాట్సాప్ అకౌంట్ భద్రతా ఉల్లంఘనల నుంచి రక్షించవచ్చు.

Read Also : Tech Tips in Telugu : మీ గూగుల్ క్రోమ్ స్లో అయిందా? ఈ సింపుల్ సెట్టింగ్ మార్చుకోండి చాలు.. జెట్ స్పీడ్‌తో పనిచేస్తుంది..!

అదృశ్యమయ్యే మెసేజ్ ఫీచర్ ఎనేబుల్ చేయండి : 
వాట్సాప్ యూజర్లు అదృశ్యమవుతున్న మెసేజ్‌లను ఎనేబుల్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఆప్షన్ సెట్ చేసిన సమయం తర్వాత మల్టీమీడియా ఫైల్‌లతో సహా అన్ని మెసేజ్‌లు ఆటోమాటిక్‌గా మాయమైపోతాయి. Go to Settings > Privacy > Default message time ఆప్షన్ తర్వాత టైమర్‌ను ఎంచుకోండి.

WhatsApp top 5 tricks and tips

డిఫాల్ట్  ఎన్‌క్రిప్ట్  బ్యాకప్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి : 
ఇందులో 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు వంటి ఆప్షన్లు ఉంటాయి. వాట్సాప్ మెసేజ్‌లు డిఫాల్ట్‌గా వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయి. గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా ఆపిల్ ఐక్లౌడ్, క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ ప్రొవైడర్‌లు కూడా మీ మెసేజ్‌లను యాక్సెస్ చేయలేరు. Go to Settings > Privacy > Calls > Chat Backup చేయండి. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ని ఎనేబుల్ చేయండి.

వ్యక్తిగత చాట్‌లను లాక్ చేయండి :
మీ వాట్సాప్‌లో ప్రైవేట్‌గా చాట్ ఉంటే.. కొత్త లాక్ చాట్ ఫీచర్‌ని ఉపయోగించుకోండి. ఇందుకోసం ప్రత్యేకమైన పాస్‌కోడ్‌తో కాన్ఫిగర్ చేయండి. మీరు లాక్ చేయాలనుకునే ఏదైనా చాట్‌కి వెళ్లి.. ప్రొఫైల్ పేరుపై క్లిక్ చేసి, పాస్‌కోడ్ ఎంటర్ చేసేలా లాక్ చాట్‌ని ఎంచుకోండి.

గుర్తు తెలియని కాల్స్ కోసం సైలంట్ ఎనేబుల్ చేయండి :
చాలా మంది వినియోగదారులు వాట్సాప్ కాల్స్ ద్వారా సైబర్ దాడులను కూడా ఎదుర్కొంటారు. గుర్తుతెలియని కాల్స్ వచ్చినప్పుడు సైలంట్ అయ్యేలా ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. తద్వారా దీని నుంచి ప్రొటెక్షన్ పొందవచ్చు. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయగానే ఫోన్ తెలియని నంబర్ నుంచి కాల్ యూజర్లకు తెలియజేయదు. Go to Settings > Privacy > Calls > తెలియని కాలర్‌లను సైలంట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే సరిపోతుంది.

ఐపీ నిఘా నుంచి ప్రొటెక్ట్ కోసం కాల్ రిలేని ఎనేబుల్ చేయండి :
వాట్సాప్ ఇటీవల కొత్త కాల్ రిలే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీ ఐపీ అడ్రస్‌లను రక్షిస్తుంది. హ్యాకర్లకు ఐపీ అడ్రస్ కనిపించకుండా హైడ్ చేస్తుంది. Go to Settings > Privacy > Calls > మీ IP Address ప్రొటెక్షన్ కాల్‌లలో అధునాతన, ప్రొటెక్షన్ ఐడీ అడ్రస్ ఎనేబుల్ చేయండి. మీ వాట్సాప్ అకౌంట్‌లో ఈ సాధారణ మార్పులను చేయడం ద్వారా మీరు హ్యాకింగ్, భద్రతా ఉల్లంఘనల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

Read Also : Credit CIBIL Score : బ్యాంకు లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లయ్ చేస్తున్నారా? మీ క్రెడిట్ స్కోర్ వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే కష్టమే..!